Saturday, June 13, 2020

శ్రీ షిరిడి సాయిబాబా గారి గురించి మొదటి సారిగా మరాఠీ భాషలో 1955 లో షిరిడి చే శ్రీ సాయిబాబా అను చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ తీయడం సుమారు 65 సంవత్సరాల క్రితం ఈ చిత్ర నిర్మాణం .

శ్రీ షిరిడి సాయిబాబా గారి గురించి మొదటి సారిగా మరాఠీ భాషలో 1955 లో షిరిడి చే శ్రీ సాయిబాబా అను చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ తీయడం జరిగినది.

1955 వ సంవత్సరంలో అనగా సుమారు 65 సంవత్సరాల క్రితం ఈ చిత్ర నిర్మాణం ఒక మహా అద్భుతం గా అభివర్ణించవచ్చును.
*ముందుగా చిత్ర నిర్మాత- శ్రీ కేశవ్ రావు సాటే,
దర్శకుడు - కుమార్సేన్ సమర్ది
సంగీత దర్శకుడు-పాండు రంగ దీక్షిత్
సినిమాటోగ్రాఫర్- కృష్ణా రావు వాషిర్డే
ఎడిటర్- సుదానంద్
ఆర్ట్ డైరెక్టర్- బాబు రావు జాదవ్ ఇలా ఎందరో ఈ సాయిబాబా సినిమా కోసం చాలా కష్ట పడి తీశారు.వారి అందరికీ పేరు పేరున ఇప్పటి తరానికి చెందిన సాయి భక్తులు అందరు తప్పక  కృతజ్ఞతలు తెలియజేయాలి.
*ఆ రోజుల్లో సమకాలీన సినిమాలు అయిన తెలుగులో విడుదల చేసిన విప్రనారాయణ, హిందీలో మీర్జా గాలిబ్ చెప్పుకోదగినవి.
*సినిమా లో శ్రీసాయిబాబా గా నటించిన దాత్తోపంత్ ఆంగ్రే బాబా గా నటించారు అనే మాట కన్నా జీవించారు అని చెప్పవచ్చును
*ఆశా భోంస్లే పాడిన లాలీ పాట చిత్రీకరణ అద్బుతం.
*ఆ రోజుల్లో గ్రాఫిక్స్ వంటి ఆధునికత లేకున్నా జంతువులతో చిత్రీకరణ గురించి చెప్పుకొని తీరాలి.
*సినిమా లో"రామ్ కహో కోయి రహీమ్ కహో పాటను ఇప్పటికీ కూడా బాబా గారి పాటల్లో మొదటిగా నిలబడేదిగా సంగీతం సమకూర్చారు.
*బాబా గారి లీలలను హృదయానికి హత్తకునేలా చూపించినారు .
*మొదటిసారిగా బాబా గారికి నాగ పంచమి రోజున భాయిజా మాయి రొట్టె ను సమర్పించడం , గత జన్మ శత్రువు అయిన పాము నుండి కప్పను రక్షించడం వీరభద్రప్ప చెన్న బసవప్ప కథను ,గోధుమపిండి తో షిరిడి గ్రామాన్ని కలరా వ్యాధి నుండి రక్షించడం,జాతి మత భేదాలు లేవు అని వంట చేసి అన్నదానం చేయడం, బాబా విభూది మహిమ తో ప్రసవ వేదన నుండి  నానా సాహెబ్ చంద్రోర్కర్ కూతురు మైనతాయిని రక్షించడం  ఇలా అనేక బాబా గారి మహిమలను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.
బాబా వారి లీలలు సామాన్య ప్రజానీకానికి చేరే లాగా కథా కథనాన్ని నడిపించడం లో దర్శకుని ప్రతిభ పాటవాలు అమోఘం అని చెప్ప వచ్చును. ఈ సినిమా మరాఠీ భాషలో తీసిన మనకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉండడం విశేషం.  👍👍👍 ఈ క్రింద సూచించిన లింక్ ద్వారా మీరు ఈ షిర్డీసాయి చలన చిత్రము చూడగలరు

No comments:

Post a Comment