Tuesday, June 16, 2020

డాక్టర్ పిళ్ళే యనునాతడు బాబాకు ప్రియ భక్తుడు

డాక్టర్ పిళ్ళే 

డాక్టర్ పిళ్ళే యనునాతడు బాబాకు ప్రియ భక్తుడు.అతని యందు బాబాకు మిగుల ప్రేమ.బాబా అతనిని 'భావూ' (అన్నా) అని పిలుచువారు. బాబా యతనితో ప్రతి విషయము సంప్రదించువారు.అతని నెల్లప్పడూ చెంత నుంచుకోనువారు. ఒకప్పడు ఈ డాక్టర్ గినియా పురుగులచే(నారిపుండు) బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్ తో , " బాధ చాలా హెచ్చుగా నున్నది. నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మములో చేసిన పాపమును పోగోట్టుకోనుటకై నేనీ బాధ ననుభవించు చున్నాను. కాన బాబా వద్దకు పోయి యీ బాధ నాపు చేసి , దీనిని రాబోయే 10 జన్మములకు పంచిపెట్టవలిసినదని వేడు " మనెను.
  దీక్షిత్ బాబా వద్దకు పోయి యీ సంగతి చెప్పెను.బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షిత్ తో కిట్లనెను. " నిర్భయముగా నుండు మనుము. అతడేల పది జన్మల వరకు బాధ పడవలెను ? పది రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి యీహపర సౌఖ్యము లిచ్చుటకు సిద్దముగా నుండ అతడేల చావును కోరవలెను ? అతని నెవరి వీపు పయి నయిన తీసికోనిరండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను ". 
     ఆ స్థితిలో డాక్టరును దెచ్చిబాబా కుడివైపున, ఫకీరు బాబా యెప్పుడు కూర్చుండచోట, కూర్చండబెట్టిరి. బాబా అతనికీ బాలీసునిచ్చి యిట్లనెను. "ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసికోమ్ము. అసలయిన విరుగుడేమనగా గత జన్మ పాపము లనుభవించి , విమోచనము పోందవలెను. మన కష్ట సుఖములకు మన కర్మ యే కారణము. వచ్చినదానిని నోర్చుకోనుము. అల్లాయే అర్చి తీర్చువాడు. వాని నెల్లప్పడు ధ్యానించుము.అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము ,మనస్సు , ధనము , వాక్కు , సమస్తము అర్పింపుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసేదరో చూడుము.". నానాసాహెబ్ కట్టకట్టెననియు కాని , గుణమివ్వలేదనియు డాక్టర్లు పిళ్ళే చెప్పెను. బాబా యిట్లనెను. "నానా తెలివి తక్కవవాడు ; కట్టం విప్పుము లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పోడుచును. అప్పుడు నీ కురుపు నయమగును."
    ఈ సంఘటన జరుగుతుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగుచేయుచుండగా, అతని కాలు సరిగా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి యుండెను. దానిపయి అబ్దుల్ కాలు పడగనే యందులో నుంచి ఏడుపురుగులు నోక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టర్ పిళ్ళే బిగ్గరగా యేడ్వసాగెను. కోంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడుపు , పవ్వు ఒకటి తరువాత నింకోకటి వచ్చుచుండెను. బాబా యిట్లనెను. "చూడుడు ! మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు". పిళ్ళే "కాకి ఎపుడు వచ్చు" ననెను. బాబా యిట్లు జవాబు నిచ్చెను. "నీవు కాకిని చూడలేదా ? అది తిరిగి రాదు. అబ్ధులే యా కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గోనుము.నీవు త్వరలో బాగయ్యెదవు ". ఊదీపూయుట వలన , దానిని తినుట వలనను , ఏ చికిత్స పోందకయే ఔషధమును పుచ్చుకోనకయే వ్యాధి పూర్తిగా 10 రోజుల లో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయేను.
🌹🌻🍀🌷🌺🍀🥀💮💐🌸🌼🥀🌺🌹🌻

No comments:

Post a Comment