Saturday, August 29, 2020

శ్రీ దత్త శరణం మమ

 శ్రీ దత్త శరణం మమ 🙏

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁



గురుస్వరూపమై, లోకోద్ధరణకు అవతరించిన శ్రీ మహావిష్ణువు రూపమే దత్తాత్రేయుడు. 


త్రిమూర్తుల సమష్టిరూపం.


గురుః బ్రహ్మః, గురుః విష్ణు:

గురుదేవో మహేశ్వరః 

అనే శ్లోకానికి ప్రతీకదత్తాత్రేయుడు. 


అత్రి, అనసూయ దంపుతుల పుత్రునిగా ఆవిర్భవించిన స్మర్తగామి. తనను స్మరించిన వారికి వెంటనే అనుగ్రహించే సిద్ధుడు దత్తుడు. 


జగదుత్పత్తికర్త్రేచ, స్థితి సంహారహేతవే భవనాశ విముక్తాయ దత్తాత్రేయ! నమోస్తుతే॥


ఆదౌ బ్రహా హరిర్మధ్యేహ్యంతే దేవస్సదాశివః మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ! నమోస్తుతే॥


జరాజన్మవినాశాయ, దేహశుద్ధికరాయచ దిగంబర! దయామూర్తే! దత్తాత్రేయ! నమోస్తుతే ॥


దత్తాత్రేయ అవతారం జ్ఞాన అవతారం. గురువుగా లోకోద్ధరణ కోసం అవతరించిన రూపం.  త్రేతాయుగంలో దత్తాత్రేయుడు అవతరించినట్లు పురాణాల్లో ఉంది. 


పుణ్యదంపతులైన అనసూయ, అత్రి మహర్షిలకు త్రిమూర్తులు ఆయా సందర్భాల్లో ఇచ్చిన వరాల ఫలితంగా బ్రహ్మ సోముడుగా, విష్ణు దత్తుడుగా, శివుడు దుర్వాసుడుగా జన్మించారు. 


దీనిలో విష్ణు స్వరూపంగా అవతరించిన దత్తాత్రేయుడిలో త్రిమూర్తి అంశలు ఉన్నాయి.


అవతార అంతరార్థం 🌹


అత్రి అంటే త్రిగుణాలకు అతీతుడు అని అర్థం. సత్వ, రజో, తమో గుణాలకు అతీతంగా, జాగ్ర, స్వప్న, సుషుప్తావస్థలకు అతీతమైన స్థితి కలిగి దానికి అనసూయ తోడైనవారికి భగవంతుడు దత్తం అవుతాడు అన్నదే ఈ అవతార రహస్యం. 


అనసూయ అంటే అసూయను లేకుండుట అంటే ఇతరులలో దోషాన్ని వెదికే గుణం లేకుండుట అని అమరకోశ అర్థం. 


మూడు గుణాలు/మూడు స్థితులు దాటి దోషాలు వెదకని తత్వంలోకి వెళ్లినవారికి పరమాత్మ సాకారం అవుతాడు అనేది అంతరార్థం. 


సాక్షాత్తు విష్ణువే తన జన్మకు ముందు అత్రి, అనసూయలకు తనపేరు దత్తుడని తెలిపాడు. మీ తపస్సుకు మెచ్చి,  దత్తోమయో అహం అంటే నన్ను నేను ఇచ్చుకొంటున్నాను అని స్థితికారకుడు పేర్కొన్నాడు. 


దత్తః అంటే ఇవ్వబడినవాడు తనకు తాను అత్రిఅనసూయలకు ఇచ్చుకొన్నాడు కాబట్టి,  దత్త అత్రిఅనసూయః కలిసి దత్తాత్రేయ గా నామం వచ్చింది. సహ్యాద్రి శిఖరంపై దత్త భగవానుడు ఆవిర్భవించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. 


మధ్యప్రదేశ్‌లోని ఆర్ణీ గ్రామానికి దగ్గర్లో రేణుకాపురం అనే గ్రామం. దీన్నే మాలాపుర గ్రామం అని కూడా అంటారు. ఇక్కడే అత్రి ఆశ్రమం ఉంది. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని మహూర్‌గఢ్‌గా పిలుస్తున్నారు. దత్త భగవానుడు ఆవిర్భవించిన స్థానం ఇదే.


దత్తాత్రేయుడు త్రిమూర్తి అంశ. 🌻🌹


దీనిలో విష్ణువు మధ్యలో అటు ఇటూ బ్రహ్మ, మహేశ్వరులు ఉంటారు. ఆయన శంఖం, చక్రం, గదా, పద్మం, త్రిశూలం, డమరుకం, కమండలం, అక్షమాల (జపమాల) ధరించి వీరాసనంలో ఉంటాడు. 


వీరాసనం అంటే ఎడమతొడపై కుడికాలుని వేసుకొని తన రెండుపాదాలను, పాదుకలను కన్పించేలా కూర్చోవడం. వీటితోపాటు తనచుట్టు నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీక. ఇక దూరంగా ఆవు ఉంటుంది. ఇది ఉపనిషత్‌లకు సూచిక. 


దత్తుడు ధరించిన ఆయుధాలు శత్రు సంహారానికి కాదు. కేవలం జ్ఞానమార్గాన భక్తులను ఉద్ధరించడానికి మాత్రమే. 


ఈ అవతారం జ్ఞానావతారం. ప్రధానంగా దత్తాత్రేయుడిగా, హరి, కృష్ణ, ఉన్మత్త, ముని, ఆనందదాయక, దిగంబర, బాల, పిశాచ, జ్ఞానసాగర అనే 10 రూపాల్ల్లో దర్శనమిస్తాడు. ఈ రూపాలను స్మరించుకొంటే పాపపుణ్యాలను తీసివేస్తాడు. అద్భుత ఫలితాలను ఇస్తాడని భక్తుల విశ్వాసం. 


ఆయన కాశీ గంగలో స్నానమాచరించి, కొల్హాపురిలో భిక్ష తీసుకొని, సహ్యాద్రి శిఖరంలోని మాలాపురంలో నిద్రపోతారని పురాణాల్లో ఉంది. ఇటువంటి ఈ గురువును పట్టుకోవాలంటే కేవలం స్మరణ చేస్తే చాలు. అందుకే ఆయనను స్మర్తృగామి అంటారు. అవతార పరిసమాప్తిలేని అవతారం దత్త అవతారం.


మేలు చేసే గురువు..


బ్రహ్మాండ పురాణ అంతర్గంలో దత్తపురాణం ఉంది.  ఇదే మొదటి గురుచరిత్ర. ఇది వ్యాస ప్రోక్తం. *భాగవతంలో, మార్కండేయ పురాణంలో ఇలా పలుచోట్ల దత్తుడి గురించి ఉంది.  


నారదుడు, ప్రహ్లాదుడికి ఇచ్చిన సూచన మేరకు ప్రహ్లాదుడు దత్తాత్రేయుడి దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన ఉద్ధవగీతలో మొదట అధ్యాయం అంతా దత్తుడు గురించే ఉంది. 


శ్రీవిద్యోపాసనలో త్రిపుర రహస్యాన్ని దత్తుడు పరుశరాముడికి ఉపదేశించినదే. ఇవేకాకుండా దత్తాత్రేయుడు మంత్ర అధిష్ఠానదేవతగా, దత్తకల్పం, దత్తోపాసన, అనఘ సహిత దత్తోపాసన ఇలా పలుచోట్ల ప్రస్తావన ఉంది. 


వేదధర్ముడు అనే గురువు సందీపకుడు (కొందరు దీపకుడు అంటారు) అనే శిష్యుడు తనకు 21 ఏండ్లపాటు అవిశ్రాంతంగా చేసిన సుశ్రూషలకు మెచ్చి దత్త వైభవాన్ని చెప్పినట్లు పురాణాల్లో ఉంది. దత్తుడు త్రిమూర్తి స్వరూపమైన విశ్వగురువు. శిష్యునికి భగవంతుని వెలుగు ఎవరి ద్వారా వస్తుందో వారే గురువు. 


గురువులో 'గ' కారంసిద్ధివాచకం, 

'ర' కార పాపనాశకం, 'ఉ' కార విష్ణువాచకాలు ఉన్నాయి. 


గురువులో రెండు ఉకార వాచకాలు పాపనాశనాన్ని చేసి సిద్ధిని ఇచ్చే వ్యాపకత్వమే గురువు. మరో అర్థం ఎవరి నుంచి మేలు పొందినా వారిని గురువు అనాలి. అంటే మేలుచేసినవారు గురువు.


దత్తాత్రేయుడికి 24 మంది గురువులు.. వీరంతా లోకంలో ఉన్నవారే. వారు పంచభూతాలు, సూర్యచంద్రులు, పాము, లకుముకి పిట్ట, కీటకం, పతంగం, హరిణం, పూర్ణనాభి, బాలుడు, వేశ్య, ఆవు, కన్య, కొండచిలువ, పావురం, చేప, ఇరుకాసురుడు (బాణాలు తయారుచేసేవాడు), భ్రమరం, పింగళ, ఏనుగు  ఇలా ప్రతి ఒక్కరి నుంచి ఒక్కోవిషయాన్ని గ్రహించి వారిని/వాటిని తన గురువులుగా దత్తాత్రేయుడు స్వీకరించారు. 


దీనిలో పరమార్థం మనం మన చుట్టు ఉన్న ప్రకృతిలోని జీవులు, వస్తువులోని మంచిని గ్రహించి జీవనాన్ని సన్మార్గంలో నడుపుకోవాలని తెలియజేస్తుంది. 


దత్తాత్రేయ అవతారంలో ఎందరినో ఉద్దరించాడు. ఆధ్యాత్మిక సిద్ధి, యోగవిద్యను ఎందరికో ఉపదేశించాడు. వీరిలో ప్రహ్లాదుడు, యదురాజు, పరుశరాముడు, కార్తవీర్యార్జునుడు, మహాసతి మదాలస పుత్రుడైన అలర్క వీరిలో ప్రధానమైనవారు. 


ఇక అవధూత పరంపరకు ఆద్యుడు. దత్తాత్రేయుణ్ణి అవధూత శిరోమణి, ఆదిగురువు అని కూడా పిలుస్తారు. అవధూత అంటే స్వస్వరూపంగా అవస్థితమైన మహాత్ముడు. దీనిగురించి గోరక్ష సిద్ధాంతంలో విశేషంగా పేర్కొన్నారు. ఈ పరంపరలో భాగంగా కలియుగంలో పరమహంస పరివ్రాజకాచార్య, దత్తావతారం, నృసింహ సరస్వతి, శ్రీపాద శ్రీవల్లభుడు, అక్కల్‌కోట స్వామి మహరాజ్, వాసుదేవానంద సరస్వతి తదితర రూపాలుగా అవతరించారు.


దత్తాత్రేయ వైభవం🌸🌷


ఈ అవతారంలో మొట్టమొదట అత్రి ఆశ్రమంలో ఉన్న వందలమంది దత్తుడిని జ్ఞానబోధ చేయమని ప్రార్థిస్తారు. పలుమార్లు తర్వాత అనిచెప్పి తప్పించుకుంటాడు. ఒకనాడు దగ్గర్లోని సరస్సులోకి వెళ్లి దానిలో అంతర్థానమవుతాడు. బయట శిష్యులు చాలా కాలం వేచి చూస్తారు. కొందరు వెళ్లిపోతారు. అప్పుడు బయటకు వచ్చిన దత్తుడు మధుపానం చేస్తూ, అనఘ సహితుడై సరస్సులో నుంచి బయటకు వస్తాడు. అదిచూసిన శిష్యులు ఈయన మనకు ఏం బోధ చేస్తారని చాలామంది వెళ్లిపోతారు. కానీ కొందరు శిష్యులు మాత్రం ఒక్కడిగా సరస్సులోకి వెళ్లిన దత్తుడు ఇలా రావడం అంటే మనల్ని పరీక్షించడమే అని భావించి స్వామి వెంట పడుతారు. ఆయన తత్వాన్ని వారికి ఉపదేశిస్తాడు. ఇదేవిధంగా జంభాసురుడనే రాక్షసుడు దేవతలను హింసిస్తున్న సందర్భంలో దేవగురువు తో కలిసి దత్తుడి దగ్గరకు వస్తారు. ఆ సమయంలో ఆయన మధుపానం సేవిస్తూ అనఘ సమేతుడై మదోన్మత్తుడిగా దర్శనమిస్తాడు. వారంతా బ్రహ్మజ్ఞానులు కావడంతో స్వామిని ప్రార్థిస్తారు. ఆ సందర్భంలో దేవతలు ఇలా పేర్కొన్నారు.....


చేతిలోని మధువు బ్రహ్మవిద్యాపానం, అతి సౌందర్యవతిగా ఒడిలో ఉన్నది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా వారు కీర్తిస్తారు. దీంతో ప్రత్యక్షమైన దత్తుడు వారికి జంభాసురుడి బాధ తీర్చడానికి మార్గం చెప్పి దేవతలను రక్షిస్తాడు. ఇలా పలు సందర్భాల్లో యుద్ధం చేయకుండా కేవలం జ్ఞానమార్గంలోనే భక్తులకు కల్పతరువుగా మోక్షాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాడు.


దత్త క్షేత్రాలు 🍀💐


దేశంలో అనేక దత్త క్షేత్రాలు ఉన్నాయి. సహ్యాద్రిలోని దత్త జన్మస్థానం, గుజరాత్‌లోని గిరినార్, పిఠాపురం, మైసూర్, గానుగాపురం, మహబూబ్‌నగర్ జిల్లాలోని కురమగడ్డ, శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురం (మక్తల్ మండల్), నాగార్జునసాగర్‌కు దగ్గర్లోని ఎత్తిపోతల ఇలా పలు క్షేత్రాలు ఉన్నాయి.


దత్తోపాసన 🌹🌻


కలియుగంలో శీఘ్రంగా భౌతిక ప్రయోజనాలు పొందడానికి, కార్యసిద్ధికోసం దత్తోపాసన, దత్తాత్రేయ వజ్రకవచ పారాయణం, దత్త క్షేత్ర సందర్శన చాలా ఉపయోగపడుతాయని విద్వత్తులు పేర్కొంటారు. దత్తోపాసనలో మంత్రశాస్త్రంతోపాటు తంత్రవిద్యలు ఉన్నాయి. ముఖ్యంగా కార్తవీర్యార్జునుడికి ఉపదేశించిన దానిలో అనేక తంత్రశాస్ర్తాలు ఉన్నట్లు పలు గ్రంథాల్లో ఉంది. ఇక గురుచరిత్ర పారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాసప్రోక్తమైన దత్తచరిత్ర మొదటి గురుచరిత్ర. దీన్ని పారాయణం చేస్తే చాలు సకలం సిద్ధిస్తుందని ఆధ్యాత్మికవాదులు పేర్కొంటారు. సామాన్యులు మొదలు సన్యాసుల వరకు అందరికి శీఘ్రంగా వారి వారి మనోవాంఛలను తీర్చే ఆది గురువు దత్తాత్రేయుడు.


అందరం భక్తితో.....🙏


దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా

దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా 

అని స్మరించి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు


దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా

దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా

Friday, August 28, 2020

సాయబాబా తన మోమును మృదుమధుర మందహాసాలొలికిస్తూ చూపారు .అలాంటి మందహాసం ఒక్కసారైనా సరే చూడటం కోసం ఈ షిరిడీలో ఎన్ని సంవత్సరాలయినా పడి ఉండవచ్చు .



సాయబాబా మహాసమాధి చెందకపూర్వము 

అయనను ప్రత్యక్షంగా సేవించిన ఎందరెందరో 

ఆయన అందాలను ,ఆయన చేష్టలలోని సౌందర్యాన్ని వర్ణించారు .గణేశ శ్రీకృష్ణ కపర్డే 

"సాయబాబా తన మోమును మృదుమధుర 

మందహాసాలొలికిస్తూ చూపారు .అలాంటి మందహాసం ఒక్కసారైనా సరే చూడటం కోసం 

ఈ షిరిడీలో ఎన్ని సంవత్సరాలయినా పడి ఉండవచ్చు .నేను పారవశ్యంతో పిచ్చివాడిలా 

ఆలాగే చూస్తూ ఉండిపొయాను " అని రాశారు .

మోరేశ్వర వామన్ ప్రధాన్ " సాయి మహరాజ్ 

ముఖం ,కాళ్ళు కడుగుకొనే విధానము చూసి 

తీరాల్సిందే తప్ప మాటలలో వివరించలేను .

అదొక అందమైన దృశ్యం .ఆ చేష్టలు చాలా 

దివ్యంగా ఉండేవి .ఆయన స్నానం చేసే విధానము కూడా అంతే  " అని వర్ణించారు .

సాయబాబా మహ సమాధి చెందడంతో సాయబాబా సౌందర్య లహరులు అదృశ్యమయ్యాయి .సాయబాబా మహా సమాధి 

అనంతరం ,చావడిలో గుప్తరూపంలొ ,మశీదు లో 

బ్రహ్మ రూపంలో ,సమాధి మందిరములో సమాధి 

అవస్థలో ,సర్వత్రా పరమాత్మ స్వరూపంలో ఉంటారని సాయిసచ్చరిత్ర గ్రంథాన్ని రచించిన 

హేమాడ్ పంత్ తన గ్రంథంలో తెలిపాడు .

మహాత్ముల ప్రశంసలు.* సాయి నాధుని గురించి

 *మహాత్ముల ప్రశంసలు.*

సాయి నాధుని గురించి  


-1.శ్రీ కంచి చoద్రశేఖరేంద్ర సరస్వతి, సాయి సాక్షాత్తు దత్త త్రేయులు.

2.చెందొలు రాఘవ నారాయణ శాస్త్రి గారు-సాయి పూర్ణ దత్తవ తారం.వారి మందిరానికి ముహూర్తం పెట్టగల వారు ఎవ్వరు?

3-శ్రీ రామ శరణు గారు-సాయి సాక్షాత్తు రాముడే,4.మెహర్ బాబా-ప్రపంచంలో వివిధ మతాల కు చెందిన మహాత్ముల కూటమికి సామ్రాట్ సాయి నాధుడు,

5.శ్రీ ఆక్కల్ కోట మహారాజ్-నా కార్యం ఇక సాయి రూపంలో జరుగుతుo ది

.6.మాధవనాధ్ మహరాజ్-సాయి సామాన్య సత్ పురుషులు కాదు,మహనీయుల లో కోహినూర్ వజ్రం వంటి వారు,

7.శ్రీ కులకర్ణి మహారాజ్-యోగ స్థాయిలో ఉన్న నిన్ను ఉద్ధరించ గలవారు సాయి నాధుడు ఒక్కరే-ఉపసినీ మహారాజ్ తో,

8.మెహర్ బాబా-సాయి అంటే ఆధ్యాత్మిక  పరిపూర్ణతే ఆయన రూపంలో వెలిసింది.సాయి సృష్టి అంతటికీ గురువు

.9.రమణ మహర్షి-సైగలు తో నేను, ఆయన ఒక్కటే(మరకతమ్మ గారితో),

10.గోపాల్ స్వామి-సాయి భగవాన్ హ్

,11 శ్రీ గణపతి సచ్చిదానంద -సాయి అంటే దత్త త్రేయులు,

12 స్వామి శివా నంద-(ఋషికేష్)సాయి అంటే ఆనంద సాగరం,

13.శంబునాధ్ మహారాజ్-నిధి అన్నింటి కి నిధి సాయి,

14.నారాయణ మహారాజ్(ఖేడ్ గావ్ భేట్)-సాయి అందరికి పరమ గురువు,

15.వాసుదేవనంద సరస్వతి-దాసు గణు తో సాయి నాధుడు మా పెద్ద అన్న గారు మమ్మల్ని కినిపెట్టి ఉండ మనండి.

16.అనసూయ మాత-సాయి సాక్షాత్తు ఋషి,17.బ్రాహ్మ చారి బాబా-సాయి నాధుడు సత్ బ్రహ్మణడు,

18.ధుని వాలా దాదా-వారు దత్త స్వరూపం,19.గణేష్ పూరి నిత్యా నంద మహారాజ్-వారు పూర్ణ దత్త త్రేయులు

20.గులవణి మహారాజ్-సాయి దత్త త్రేయులు,21.రామకృష్ణ పరమహంస-వారి ని చూడటం వలన తీవ్ర మైన భక్తి కలుగుతుంది.

22.శ్రీ రంగన్న బాబు గారు-రాముల వారు ఆ రూపంలో వున్నారు.

23.శ్రీ దత్త మహారాజ్(పుణే)-కుసాభావు తో నిన్నుఁ ఉదరించ గలవారు సాయి నాధుడు మాత్రమే,

24 దాజి మహారాజ్-వారు మారుతి అవతార o, 

 25. జానకి దాస్ మహారాజ్-సాయి గొప్ప మహనీయులు,మేము కూడా వారి పాదాలను ఆశ్రయిస్తాము.

26.శ్రీ కేశవా నందాజీ మహారాజ్-సాయి దత్తులే,

27.శ్రీ గురూ సిధ్ద రూఢ స్వామి-సాయి సాక్షాత్తు దత్తులే,

28.గంగ ఘిర్ మహారాజ్-సాయి ఆధ్యాత్మిక ఉన్నత సింహాలను,ఏనుగులను శాసించగలరు.

29.శ్రీ గాడ్గి మహరాజ్-సాయి సమర్ధుడు అయిన సత్ గురువు,

30.కిల్వ న్ స్వామి-సాయి మహాశక్తి స్వరూపం, సాక్షాత్తు భగవంతుడు,బ్రాహ్మచారి,

31.అవధూత రామి రెడ్డి తాత-మన నయన,అందరికి నాయనా సాయి

33.అవధూత వెంకయ్య స్వామి-వారు మా పెద్దన్న, గారు,

34 ఆనందమయి అమ్మ-వారు జ్ఞాన స్వరూపం, వారిని నమ్మితే ఏలాంటి సాధన పెద్దగా అవసరం లేదు

35.హరి హర మహారాజ్-శ్రీ సాయి ఉఛ్ఛా కోటి లోని మహాత్ములు,

36.శ్రీ ఆనంద స్వామి-సాయి సామాన్యులు గా కనపడు తున్నా గొప్ప వజ్రం,

37.శ్రీఅఖండ నంద సరస్వతి-సాయి లాంటి సిద్ధపురుషులు ఆత్మ జ్ఞానం అవలీలగా ప్రసాదించగలరు.

38.రాఖాడి బాబా-సాయి దత్త స్వరూపం,

39.పూర్ణ నంద స్వామి-సాయి సన్నిధిలో తపస్సు చేస్తే వైయోగ సంబంధించిన ఇబ్బందులు తొలగి పోతాయి.

40.శ్రీరాం మారుతీ మహరాజ్-నాధ సంప్రదాయం కు అది నాధు డే సాయి నాధుడు

41.ఇసల్లం పుర్కర్ కులకర్ణి-సాయి గొప్ప తనం తెలుసుకోవాలి అంటే నువ్వు జ్ఞాని వి అయి ఉండలి.42 గజనాన్ మహారాజ్-సాయిదర్శనం ప్రపంచ oలో ఉన్నత మైనది.

43.తాజుద్దీన్ బాబా-బుట్టి తో నీ  గురువు సాయి,నీ విషయం  లో జోక్యం చేసుకోవటానికి నాకు శక్తి చాలదు

.44.శ్రీ మాత జీ-(మద్రాస్)త్రేతాయుగంలో వశిష్ఠ, ద్వాపరంలో దత్త త్రేయులు,కలియుగం లో సాయి నాధుని గా వచ్చింది.---

45.పాకలపటి గురువు గారు(గాయత్రి ఉపసకులు-సాయి సాక్షాత్తు దత్తులే-

 46.పూoడి స్వామి ఆయన ఎంతో గుణవంతుడు,సాయి ని పూజించు.  

47.బిడ్కర్ మహరాజ్-స్వామి సమర్ధకు,సాయి నాధుని కి ఏమి తేడా లేదు,సాయి గొప్ప యోగి.------- ఇలా కొన్ని వందల ప్రశంసలు ఎందరో ఆత్మ సాక్షాత్తు కారులు,భగవత్ సాక్షాత్తు కారులు,యోగులు ప్రశంసించారు. అదే సాయి నాధుడు.by .by) Rajya lakshmi srinivas boddupalli

షిరిడీలో ఎవరో ఒక బ్రాహ్మణుడు ఫకీరుగా ఉన్నాడని తెలిసి ,భగవద్గీతను వెంట తీసుకుని బాబా దర్శనం కోసం వెళ్లాడు


  నాసిక్ పట్టణ నివాసి అయిన గొపాల్ హోరా అనే 

కృష్ణ భక్తుడు ఏ విధముగా నైనా సరే ,ఈ జన్మలోనే శ్రీ కృష్ణ దర్శనం పొందాలనే తపనతో ,

తన గురువు వద్ద మంత్రోపదేశం పొందాడు .

భక్తి శ్రద్దలతో 26 ఏళ్లు సాధన చేశాడు .కృష్ణ దర్శనం లభించలేదు .ఎక్కడికి వెళ్లినా భగవద్గీతను వెంట తీసుకుని పోయేవాడు .

షిరిడీలో ఎవరో ఒక బ్రాహ్మణుడు ఫకీరుగా ఉన్నాడని తెలిసి ,భగవద్గీతను వెంట తీసుకుని 

బాబా దర్శనం కోసం వెళ్లాడు .సాయబాబా ను 

చూసి ఆగిపోయాడు .సాయి మహమ్మదీయుడా? 

బాబా వద్దకు భగవద్గీతను తీసుకుపోతే ,ఆ గ్రంథం 

అపవిత్రమవుతుందేమోనని అనుమానపడ్డాడు .

బాబా అతనితో " నీవు మైలు పడవచ్చును గానీ,

గీతా గ్రంథం మాత్రం అపవిత్రం కాదు .నీవు తలచినది పొరపాటు " అని అన్నారు .ఇంకా బాబా "నీవు భగవద్గీతను పఠించగలవా ?"

అని ప్రశ్నించారు అతన్ని .

" నేను 26 సంవత్సరాలనుండి పఠిస్తున్నాను .అది 

కంఠస్థమైనది కూడా ." అని హోరా చెప్పాడు .

బాబా భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని మధ్య నుండి 

చదవమంటే ,అతడు చదవలేకపోయాడు .

" విచారించకు ! నీకు చదవగలిగే శక్తిని యిస్తాను .

చదువు " అని అన్నాడు బాబా ." నీవు బాలకృష్ణుని దర్శనమే కావాలనుకొంటున్నావు ,

నీకు పెద్ద కృష్ణుని దర్శనమే లభిస్తుంది .చూడు ."

అన్నారు బాబా .అనుకోకుండా ఆశ్చర్యంగా ,

సాయబాబా నుండి మృదుమధుర వేణుగానం 

వినబడినది .సాయినాధునికి బదులు సాక్షాత్ 

శ్రీకృష్ణుడే దర్శనమిచ్చాడు .గొపాల్ హోరా తన్మయుడై సాయి పాదాలపై వాలిపోయాడు 

" నేను మీవద్దనే ఉండిపోతాను " అన్నాడు హోరా 

" ఇంటికి వెళ్లి తామరాకు పై నీటిబొట్టులా ఉండి 

శ్రీకృష్ణ ధ్యానంలో నిమగ్నడవు కమ్ము " అని బాబా 

అశీర్వదించి పంపించివేశారు .

Monday, August 24, 2020

పూణే శివాజినగర్ రాసనే చల్ ,సాయిమందిర విశేషాలగూర్చి సాయిభక్తులందరూ తప్పక తెలుసుకోవాలిసినవి


పూణే శివాజినగర్ రాసనే చల్ ,సాయిమందిర 
విశేషాలగూర్చి సాయిభక్తులందరూ తప్పక తెలుసుకోవాలిసినవి .ఈ మందిరములో 
సాయబాబా శరీరభాగంలో ఒక భాగమైన దంతంలో ఒక పన్ను ,ఇక్కడ బాబా మందిర విగ్రహము ముందు గల పాదుకలు క్రింద భద్రపరిచారు .ది 12  -7 - 1961 నాడు, దగ్గరలో 
గల పన్నెర్ డాము కృంగి ,దానిలోని నీరు బయటకి 
ప్రవహించి పూణే నగరాన్ని ముంచివేసింది .
అక్కడగల ఎన్నో గృహాలు నీటి ఉధృతికి కూలిపోయి ఆపార నష్టం సంభవించింది .సాయి 
మందిరం ఉన్న శివాజినగర్ లోతట్టు ప్రాంతమైనందున మందిరం పుర్తిగా మునిగిపోయి 
మందిర గోపురం పైన 25 అడుగుల ఎత్తున నీరు 
నిలచింది .నీరు తగ్గుముఖం పట్టిన తరువాత 
పునరుద్ధణ కార్యక్రమాలు మొదలైనాయి .సాయి 
మందిరం పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది .
ఆ మట్టిని పూర్తిగా తొలగించి ,మందిరాన్ని పూర్వ 
స్ధితికి తెచ్చే కార్యక్రమం అతి వ్యయప్రయాసలతో 
కూడినది .అయినా స్థానిక సాయిభక్తులు ,
మందిర కమిటీ సభ్యులు ,నాలుగు అయిదు రోజులు కష్టపడి పనిపూర్తి చేశారు .అప్పుడు 
వారికి కనిపించిన దృశ్యం అద్భుతం .నిత్య 
పూజలందుకొంటున్న బాబా రంగుల చిత్రపటం 
చెక్కుచెదరక పూర్వపువలె జీవకళ ఉట్టిపడుతూ 
కనిపించింది .ఆ పటం ఎన్నొ రోజులు నీటిలో 
మునిగిఉన్నదంటే ఎవ్వరూ నమ్మరు .ఆ ప్రక్కనే 
ఉన్న ఔదంబర వృక్షం కూడా కళకళలాడుతూ 
కనిపించింది .ఈ అద్భుత లీలతో బాబా సంపూర్ణ 
అనుగ్రహం ఈ మందిరం పై ఉన్నదని అందరూ 
విశ్వసించారు .తరువాత కమిటీ సభ్యులు సంకల్ప సహకారములతో అందమైన బాబా 
పాలరాయి విగ్రహాన్ని తయారు చేయించి 
మందిరమునందు ప్రతిష్టించారు .వరదకు తట్టుకొన్న బాబా రంగుల పటం కూడా నేటికీ 
నిత్యపూజలు అందుకొంటున్నది .

#ఈ_మంత్రం_పోయినవాటిని_తిరిగి_తెస్తుంది... కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే

#పూర్తిగా_చదవండి 
#ఈ_మంత్రం_పోయినవాటిని_తిరిగి_తెస్తుంది...

ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా, భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా ఒకేఒక మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి. ఇంతకీ ఏమిటా మంత్రమని ఆలోచిస్తున్నారా? అదే కార్తవీర్యార్జున మంత్రం. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే  పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నారు మన పండితులు. ఆ మంత్రం ఈ విధంగా ఉంటుంది.

  ఓం కార్తవీర్యార్జునో నమః రాజ బాహు సహస్రవాన్

      తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే

ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవాన్ని తిరిగి మనకు దక్కుతాయి. ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ. తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు. కాని భూలోకంలో మనిషిగా పుట్టిన
కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు. అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు. అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు. ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.

ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి. ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు. అంత రుచికరమైన ఆహారపదార్థాలు కామదేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయ్యమని అడుగుతాడు, అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు. ఆశ్రమానికి తిరిగివచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకుని కార్తవీర్యునితో పాటు 21సార్లు భూలోకం మొత్తం చుట్టి క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు. అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు. పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో సుదర్శునుడిగా మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు.

అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు.

ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః

పంచ సత్పురుషులలో ఒకరైన హజరత్ తాజుద్దీన్ బాబా వారి 95 వ పుణ్య తిథి


*నేడు అనగా 17 -8 -2020 సోమవారము, అంగ్ల కాలమానము ప్రకారము,*
*పంచ సత్పురుషులలో ఒకరైన హజరత్ తాజుద్దీన్ బాబా వారి 95 వ పుణ్య తిథి.*
*తాజుద్దిన్ బాబా ముస్లిం పంచాంగం ప్రకారం మొహరం నెల 26 వ రోజున (17 -8 -1925 ) నాగపూర్ నగరమునందు సమాధి చెందారు. తాజుద్దిన్ బాబా* *షిర్డీ సాయిబాబా వారి* 
*సమకాలికులు.*
*షిరిడీలో సాయబాబా వద్ద శ్యామకర్ణి అని పిలవబడే గుర్రము ఒకటిఉండేది.* *సాయిబాబా కు ఇచ్చే హరతులలోను, పల్లకి సేవలో నృత్యం చేసి తన భక్తిని చాటుకోనేది.*
*పంచ సత్పురుషులలో ఒకరు, నాగపూరు నివాసి అయిన తాజుద్దిన్ బాబా వద్ద " షేరు " అని పిలవబడే కుక్కఒకటుండేది.*
*ఆ కుక్క తాజుద్దిన్ బాబా గొప్పదనాన్ని గుర్తించింది.*
*తన సమయాన్ని అంతా బాబా సేవలో గడిపేది.* *ప్రతిరోజూ ఆ కుక్క* 
*నాగపూరు రైల్వే స్టేషనుకు* *వెళ్ళి, రైలు వచ్చే సమయము వరకు వేచిఉండి, బాబా దర్శనానికి వచ్చే భక్తులను బాబా దగ్గరకు తీసుకువెళ్లేది.*
*తాజుద్దిన్ బాబాను దర్శించేందుకు వచ్చే భక్తులందరికీ ఆ విషయము తెలిసిపోయింది.*
*రైలు దిగగనే భక్తులు బాబా వద్ధకు ఆ కుక్క వెంట* 
*వెళ్ళేవారు. ఎందుకనగా* 
*బాబా ఒకప్పుడు వాకి* 
*( బాబా ఉండే ప్రదేశం )* *మరొక్కప్పుడు సమీపములోగల అడవిలో ఉండెడివారు.*
*ఆ కుక్క క్రమము తప్పకుండా స్టేషను కు వెళ్ళి బాబా ఎక్కడుంటే అక్కడకి భక్తులను చేర్చేది.*
*ఒక రొజు" షేరు " రైల్వే స్టేషనుకు రాలేదు.స్టేషన్ లో దిగిన భక్తులకు బాబా వాకి లో ఉన్నారా లేదా అడవిలో ఉన్నారా అనేది తెలియలేదు.*
*వారు స్టేషను లో దిగి బయలుదేరి వస్తుండగా, వారికి మార్గమధ్యమములో " షేరు " చనిపోయిన* 
*కళేబరం కనిపించింది.*
 *వారు బాబావద్దకు వెళ్లి ఆ సంగతి చెప్పారు. వెంటనే బాబా చనిపోయిన కుక్కవద్దకు వచ్చి దాని పై తన ధరించిన చొక్కా కప్పి, అక్కడివారికి దానిని తన* *కుటీరానికి తీసుకురమ్మని* *వెళ్ళిపోయారు.* 
*బాబా కొంత దూరము నడచి వెళ్ళగానే కుక్కకు ప్రాణం వచ్చి బాబావెంట పరిగెత్తింది.*
*సత్పురుషుల మహిమ చెప్పుటకు అసాధ్యము.*
*తాజుద్దిన్ బాబా, షిర్డి సాయిబాబా సమకాలికులు.*
*ఒకరోజు షిరిడీలో సాయిబాబా తన భక్తులతో గొప్ప ముస్లిం మహాత్ముడైన* *తాజుద్దీన్ బాబా గూర్చిమాట్లాడుతున్నారు.*
*మధ్యలో తన satka ( దండం ) తీసుకుని అక్కడున్న నీటి కుండను గట్టిగా తట్టారు.* *భక్తులు దాని భావమేమి అని అడిగారు " నా సోదరుడు తాజుద్దిన్* *బాబా కుటీరానికి నిప్పంటుకొంటే*
*చల్లార్చుతున్నాను" అన్నారు బాబా.*
*ఒక భక్తుడు నాగపూరు లోని తన మిత్రునికి ఉత్తరం వ్రాయగా అదే రోజు, అదే* *సమయానికి తాజుద్దిన్ బాబా కుటీరానికి నిప్పు అంటుకొన్నదని, కానీ వెంటనే* *దాని అంతట అది చల్లారిపోయింది వారు తెలిపారు.* 
*సాయిబాబాకు తాజుద్దిన్ అంటే ఎనలేని ప్రేమ.* *అయనను* 
*"బంగారు మామిడి చెట్టు "అని వర్ణించారు.*
*అట్టి మహా సత్పురుషుడైన తాజుద్దిన్ బాబా* 
*17 -8 -1925న పరమాత్మలో ఐక్యమయ్యారు.*
*నాగపూరు లోని పాండురంగ స్వామి దేవాలయము లొని విఠలుడు, రుక్మిణీదేవి* 
*విగ్రహాలు ఆ రోజున ఏకధాటిగా 12 గంటలు కన్నీరు కార్చాయి.*
*ఈ రోజు ఆయన మహాసమాధి చెంది 94 ఏళ్లు ముగిస్తుంది.తాజుద్దిన్ బాబాను స్మరిద్దాం. తరిద్దాం*

Sunday, August 16, 2020

మహల్సాపతి అనే ఖండోబా మందిర పుజారి " సాయీ " అని పిలిచాడు .ఊరు పేరూ లేని ఆ యువకునికి " సాయీ " అను పేరు స్థిరమై పోయింది

షిరిడీలో గల సాయిబాబాకు ఊరు పేరూ లేదు .
అయితే ప్రప్రధముగా చాంద్ భాయి అనే ముస్లిం 
తన కుటుంబంతో పాటు వివాహ కార్యక్రమానికి 
షిర్డీ వచ్చినపుడు ,వారితోపాటు వచ్చిన ముస్లిం 
వలె వేషధారణలో ఉన్న ఒక యువకుడికి అక్కడే 
ఉన్న మహల్సాపతి అనే ఖండోబా మందిర పుజారి " సాయీ " అని పిలిచాడు .ఊరు పేరూ 
లేని ఆ యువకునికి " సాయీ " అను పేరు స్థిరమై 
పోయింది .అయితే ఆ నామం  సాయి వయసు పెరిగిన తరువాత అయనను "సాయబాబా " అను పిలువసాగారు .బాబా షిరిడీకి వచ్చిన గోవింద్ రఘునాద్ ధబోల్కర్ అను ప్రభుత్వ ఉద్యోగికి " హేమాడ్ పంత్ " అని పిలిచాడు .
అంతే ఆయన పేరు హేమడ్ పంత్ అని పిలవసాగారు .హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర 
మరాఠి గ్రంథాన్ని రచించి భక్తుల మదిలో నిలిచిపోయాడు .ఆలాగే మాధవరావ్ దేశపాండే 
అను భక్తుడిని " శ్యామా " అని బాబా పిలువసాగాడు .బ్రిటీషు వారి పాలనలో హైదరాబాద్ లో ఉన్నత పదవిలో నున్న మంత్రి 
ప్రగడ లక్శ్మి నరసింహరావు గారు షిర్డి వెళ్ళి బాబాను దర్శించుకునేవాడు .ఆయన ఒకసారి షిర్డీ వెళ్ళి బాబాను దర్శించి " బాబా ! మూడు తరాలుగా మా వంశంలో ఆడపిల్లలు లేరు .కనుక 
మాయందు దయ ఉంచి మాకొక ఆడపిల్లను సంతానంగా మాకు ప్రసాదించు " అని ప్రార్దించాడు 
ఆదివిన్న బాబా " ఆలాగే అవుతుంది ఫో ! " అని ఆన్నారు .బాబా ఆశీర్వాద phalitamga ఒక ఆడపిల్ల జన్మిమిచ్చింది .మరల ఆయన షిర్డీ వెళ్ళి 
బాబాను దర్శించి " బాబా ! ఆ శిశువుకు ఏమి పేరు పెట్టమంటారు ? " అని అడుగగా " శృంగేరి 
శారదా దేవి " అని పేరు పెట్టు " అని బాబా సెలవిచ్చాడు .ఆలాగే ఆ బిడ్డకీ  " శారదాదేవి " 
అని పేరుపెట్టారు .ఆ పిదప మంత్రి ప్రగడ శారదాదేవి ,వివాహ అనంతరం గాలి శారదా దేవీ 
అయినది .తరువాత ఆమె అనేక సార్లు షిర్డి వెళ్ళి 
బాబాను దర్శించుకునేది .
గులాబ్ - ఇమాం భాయి చోటే ఖాన్ బాబా భక్తుడయినాడు .అతడు ఒకసారి షిర్డి వెళ్ళి బాబా 
ను దర్శించాడు .బాబా అతనితో " గులాబ్ " మీ ఇంటికి వచ్చాడు "తరువాత అతను ఇంటికి వెళ్లగా గర్బవతి అయిన 
తన భార్యా ప్రసవించిందని ,మగ శిశువు ప్రసవించిందని తెలిసింది .ఆ బిడ్డకు సాయబాబా 
చెపినట్లు " గులాబ్ " అని పేరు పెట్టాడు .

షిరిడీలో బాబా సన్నిధికి ఇతర గురువులకు చెందిన శిష్యులు కూడా రావడము జరిగేది .సాయిబాబాను గురువుగా నమ్మని వ్యక్తులు ఇతర గురువులవద్దకు పొవడం కూడా సహజముగా జరిగేది

మతాన్ని అయినా ,దైవాన్నైనా మార్చడం సాయిబాబా అంగీకరించరు .షిరిడీలో బాబా సన్నిధికి ఇతర గురువులకు చెందిన శిష్యులు కూడా రావడము జరిగేది .సాయిబాబాను గురువుగా నమ్మని వ్యక్తులు ఇతర గురువులవద్దకు పొవడం కూడా సహజముగా జరిగేది .ఒకసారి బాబా వద్దకు ఇతర గురువుకి 
చెందిన పంత్ అను శిష్యుడు వచ్చాడు .బాబా 
అతనితో "ఎలాంటి సందర్భంలోను అయినా 
మనము నమ్మిన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు .
ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ ,అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు " అని అన్నారు .
ఒకసారి ఒకరిని గురువుగా నిర్ణయించుకున్న తరువాత ,వేరొక గురువు మహత్తు ,ప్రజ్ఞలను 
చూసి మనసు చలించకూడదు .జీవితాంతము ఒకే గురువుని అంటిపెట్టుకొవాలి .అంతేకానీ మన గురువు తక్కువ ,వేరొక గురువు ఎక్కువ అను 
ఆలోచన మన మనసులోంచి తీసివేయాలి .
ఒకసారి శ్యామా అను పేరుగల బాబా భక్తుడు 
నాగపూరు పరిసరప్రాంతాలు కు పోయి బాబా వద్దకు వచ్చాడు .బాబా శ్యామాతో " శ్యామా ! 
ఇక్కడెక్కడకు పోయివచ్చావు ? అని అడిగాడు .
" నాగపూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు " అని జవాబిచ్చాడు శ్యామా ." నాగపూరులో గల 
బంగారు మామిడి చెట్టును చూశావా ?" అని బాబా అడిగాడు .అందుకు శ్యామా బంగారు 
మామిడి చెట్టు అంటే ,నాగపూరు నందుకల 
సత్పురుషుడైన " తాజుద్దిన్ బాబా "అని అర్థం చేసుకున్నాడు ." ఇంకా మరే ప్రదేశాలు దర్శించావు ? అని బాబా శ్యామాను అడిగాడు .
అందుకు శ్యామా " బాబా ! ఖేడ్ గాన్ బెట్ వెళ్లాను 
అక్కడగల నారాయణ మహరాజ్ ను దర్శించాను 
బాబా ! అక్కడకి ఎంతమంది భక్తులు వచ్చారో" 
 అని చెప్పాడు ." నారాయణ మహరాజ్ గారి గూర్చి నీ ఉద్దేశమేమిటి ?" అని ప్రశ్నించాడు 
బాబా శ్యామాని .నారాయణ మహరాజ్ గారు 
చాలా ఆడంబరంగా ఉండేవారు .ఖరీదైన వస్త్రాలు ధరించేవారు .దీనికి భిన్నంగా సాయి దర్బారు ఉంటుంది .అడంబరం ,నిరాడంబరం 
మధ్య ఊగిసలాడే శ్యామా మనసు బాబా గ్రహించారు .
బాబా కొద్దిసేపు ఆగి " శ్యామా ! ఎంతైనా నీతండ్రే 
నీతండ్రే కదా ! నీ తండ్రిలాగా నిన్ను ఎవరు చూస్తారు ? ఒకటి వెంట పడడం ఎందుకు " ?అని 
అన్నారు సాయబాబా .మన గురువే మన తండ్రి .
ఇతరుల కోసం ఆరాటపడటం ఎందుకు ?.

సమాధిమందిర నిర్మాణము


*సమాధిమందిర నిర్మాణము*
బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనులగూర్చి ఎప్పుడును మాట్లాడువారు కారు. ఏమియు సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి ఫలితములు కలిగించుచుండువారు. అందుకు సమాధిమందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూరు కోటీశ్వరుడు, శ్రీమాన్ బాపుసాహెబు బుట్టీ, షిరిడీలో సకుటుంబముగా నుండెడివారు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని యాలోచన కలిగెను. కొన్నాళ్ళ పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి యొక వాడాను మందిరముతో సహ నిర్మించుమనెను. బాపుసాహెబు లేచి శ్యామా యేడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామా యిట్లు చెప్పెను. “బాబా నా దగ్గరకు వచ్చి మందిరముతో వాడాను నిర్మింపుము. నేను అందరి కోరికలను నెరవేర్చెద ననెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని, నేను భావావేశమున మైమరచితిని; నా గొంతుక యార్చుకొనిపోయెను. నా కండ్ల నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలిడితిని.” వారిద్దరి దృశ్యములు ఒకటే యయినందులకు బాపుసాహెబు బుట్టీ విస్మయమందెను. ధనవంతుడగుటచేతను, చేతనయినవా డగుటచేతను, అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు (శ్యామా) సహాయముతో ఒక ప్లాను వ్రాసెను. కాకాసాహెబు దీక్షిత్ దాని నామోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామా పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరి గృహము, భూగృహము, బావి పూర్తియయ్యెను. బాబాకూడ లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చునపుడు కొన్ని మార్పులను సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనియంతయు బాపుసాహెబు జోగును చూడుమనిరి. అది నిర్మించునపుడు, బాపుసాహెబు బుట్టీకి ఒక యాలోచన కలిగెను. చుట్టు గదులుండి, దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని (శ్రీ కృష్ణుని) ప్రతిమ ప్రతిష్ఠ చేయవలెనని శ్యామాకు చెప్పెను. వాడా ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామా యీ విషయము నడుగగా బాబా యందులకు సమ్మతించి “దేవాలయము పూర్తి కాగానే నేనే యచ్చట నివసించుటకు వచ్చెదను” అని వాడా వయిపు జూచుచు “వాడా పూర్తియయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించు కొనవలెను. మనమందరమచ్చట నుందుము. అందరు కలసిమెలసి యాడుకొందుము. ఒకరి నొకరు కౌగిలించుకొని సంతోషముగా నుండవచ్చును.” అనెను. దేవస్థాన మధ్యమందిరము కట్టుట కది తగిన శుభసమయమా యని శ్యామా యడుగగా, బాబా సమ్మతించుటచే శ్యామా కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించిరి. కొద్ది కాలములో పని పూర్తి యాయెను. మురళీథర్ విగ్రహము తయారు చేయుట కాజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపుసాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయెను; నిరాశపడెను. బాబా సమాధి చెందినచో, తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన లక్షరూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందకముందు “నన్ను రాతి మందిరములో నుంచుడు.” అన్నట్టి పలుకు బాపుసాహెబు కేగాక యందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరము మధ్యమందిరములో బెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధర్ కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధిచేయుటచే బాబాయే మురళీధరుడనియు, బుట్టీ వాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచత్రజీవితము లోతును కనుగొన శక్యము గాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్రశరీరము సమాధి యగుటచే బాపుసాహెబ్ బుట్టీ మిగుల ధన్యుడు, అదృష్టశాలి