Monday, August 10, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నవళి 37,38,39వ అద్యాయములు

 శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నవళి

37,38,39వ అద్యాయములు


37వ అద్యాయము


1 . చిలుము విషయం లో ఎంత మంది ముఖ్య మైనవారు వున్నారు?

జవాబు) శ్యామ, తాత్య, బాబా, మహల్సా.


2 . సాయి గురించి అందరూ ఎరిగిన విషయం ఏమిటి?

జవాబు) శాశ్వత అస్ఖలిత బ్రహ్మాచర్యము. 


3. 37వ అధ్యాయము చదివినచో జ్ఞప్తికి తెచ్చుకున్నచో ఏమి కలుగును?

జవాబు) మనస్సుకు శాంతి, తప్తి.


4. చిలుము తయారు చేసి ఎవరు ఇచ్చేవారు?

జవాబు) శ్యామా.


38వ అద్యాయము


5 . ఎవరి వలన షిరిడి పుణ్యక్షేత్రంగా పేరు గాంచెను?

జవాబు) దాసగణు హరికధలవలన.


6. కోరాల్బాకు పోయి మాంసము తెమ్మని బాబా ఎంత మంది తో చెప్పను?

జవాబు) దాదా, పాండవ.


7. అన్నదానములో ఎవరికి పెట్టుటకు శ్రేయస్కరం?

జవాబు) నిస్సహమైన అంగవికలురులకు పెట్టాలి.


8. పలావు ఉడికిన విషయము గురించి దాచి ఎవరిని పిలిచెను?

జవాబు) దాదా కేల్కర్.


9. బూటీ వాడాలో వున్న బాబాను ఏవిధంగా భావించాలి?

జవాబు) మురళీధరునిగా.


39వ అద్యాయము


10  .  ఏవి తొలగిపోయినచో నీవుగా గ్రహించ వచ్చును?

జవాబు) స్వప్నము, నిద్ర.


11  . ద్వారాకా మాయి వాసి పాదస్పర్శ భాగ్యము ఎవరికి కలిగింది?

జవాబు) నానా సాహెబ్ చందోర్కర్.


12 . భగవద్గీత చెప్పిన అర్ధము కధ ఎవరి ద్వారా చెప్పబడెను?

జవాబు) బి. వీ. దేవ్. శ్రీ సాయి లీలా 4 పుట. 563.


13. భక్తడు అన్నిటిని దేనివిగా భావించెను?

జవాబు) వాసుదేవమయముగా.


14. శ్రీ కృష్షుని ప్రతిమ కొరకు నిర్మించవలసిన హలు నిర్మాణం లో ఎంత మంది పాల్గొన్నారు?

జవాబు) 4 గురు బూటీ, శ్యామా, దీక్షిత్, జోగ్. 


15. బూటీ వాడా నిర్మాణమలో ముందుగా పూర్తి అయినవి ఏవి?

జవాబు) భూమ్యుపరిగ్రహము , భూగృహము ,భావి.


16. అనేక జన్మల అజ్ఞానము వలన మనకు ఏది కప్పి వేయును?

జవాబు) శుద్ధచైతన్యము.

No comments:

Post a Comment