Monday, August 10, 2020

శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నావళి 7,8,9 వ అద్యాయములు, ప్రశ్నలు మరియు జవాబులు.


శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నావళి


7,8,9 వ అద్యాయములు, ప్రశ్నలు మరియు జవాబులు.




7వ అద్యాయము :-


1. సాయి బాబా ఏ మాటలు పలుకు చుండెడివారు?

జవాబు) అల్లా మాలిక్.


2. నానా సాహెబ్ హుటాహుటిన పండరీ వెళ్లి ఎవరిని దర్శించుకున్నారు?

జవాబు) విఠోబా యగు బాబా ను.


 3. మహాత్మలు భక్తుల నమస్కారం తో వేటిని స్వీకరిస్థారు?

జవాబు) బాధలు.


4. బాబా భక్తుల కు ఔషధాలు ఇచ్చినందుకు ఏమి పేరు వచ్చెను?

జవాబు) గొప్ప హకీం  వైద్యులు.


5. నందూరు బారు మామలతాదారు మసీదు చేరు సరికి అక్కడ ఉన్నవారు ఎవరు?

జవాబు) బాబా , మహల్సా, కాశీరాం ,అప్పాశిందే.


6. భాగోజీ ఎటువంటి ఉపాసన తీసుకొనెను?

జవాబు) బాబా చేతులు పట్టీలను విప్పుట , తోముట , కట్టుట.


7. బాబా ఎంత వస్త్రమును మింగేవారు?

జవాబు) 3 అంగుళాల వెడల్పు ,22 1/2 అంగుళాల పొడవు.


8వ అద్యాయము :-


8 . బాబా చర్యలు ఎటువంటివి?

జవాబు) అంతుపట్టనివి.


9 . మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు ఎవరూ?

జవాబు) తాత్య కోతే పాటిల్, మహల్సా పతి.


10 . బాబా రహత ఎలా వెళ్లే వారు?

జవాబు) టాంగా లోను, ఎడ్ల బండి.


11. బాబా, కుశాల్ చంద్ ఎలా ముచ్చటించుకునేవారు?

జవాబు). ప్రేమొల్లాసములతో.


12. బాబాను చాంద్ ఎచ్చటి నుండి స్వాగతం పలికేవారు?

జవాబు) గ్రామ సరిహద్దు ద్వారము.


9వ అద్యాయము :-


13 . గృహస్థులు పాప సంహారము కొరకు ఎన్ని యజ్ఞములు నిర్వహించ వలెను?

జవాబు) ఆరు


14 . బాబా ఏ స్వరూపులు?

జవాబు) బ్రహ్మ స్వరూపులు.


15 . బాబా గారికి ఏవి నైవేద్యం పెట్టాలని సంకల్పం?

జవాబు) వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ.


16. తర్కండ్ కథ 9వ అధ్యాయములో ఏయే వారములు జరిగెను?

జవాబు) శుక్రవారం నుండి మంగళవారం వరకు.

No comments:

Post a Comment