*బాలాజీ వసంత్ తలీమ్ వర్క్‌షాప్‌లో గిర్గావ్ బొంబాయిలో ఉంది. శ్రీ సాయిబాబా వారి విగ్రహాన్ని చెక్కడం కొరకు శ్రీసాయిబాబా స్వయంగా అతనికి కలలో కనిపించి ఆశీర్వదించారు. బాబా ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాలిమ్ శ్రీ సాయిబాబా విగ్రహమూర్తిని చెక్కారు.అందువలన శిరిడీలో ఉన్న పాలరాతి విగ్రహం ఎల్లప్పుడూ చాలా అందంగా మరియు సజీవస్వరూపంగా కనిపిస్తుంది.ఇది బాలాజీ వసంత్ తలిమ్ యొక్క చివరి ప్రాజెక్ట్ అని చెప్పబడింది. తరువాత అతని కుమారుడు హరీష్ గురుస్తాన్ లో ఉంచబడిన చిన్న పాలరాతి శ్రీసాయిబాబా మూర్తి (ఇప్పుడు మ్యూజియంలో ఉంది) విగ్రహాన్ని చెక్కారు.ప్రతిరోజూ ఉదయాన్నే బాలాజీ స్నానం మరియు బాబా ఆరాధన తర్వాత దీనిని చెక్కేవారు. విగ్రహాలను చెక్కడంలో ఆయన చాలా ప్రసిద్ది చెందారు.ఇప్పుడు అతని వారసులు "విజయనంద్ ఆర్ట్ స్టూడియో" పేరుతో తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.*
No comments:
Post a Comment