🙏🏻🙏🏻శ్రీ గురు దత్త 🙏🏻🙏🏻
పద్నాలుగవ చాతుర్మాస్య దీక్ష తరువాత ప.ప .శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు దత్త స్వామి ఆఙ్ఞ ప్రకారం వాడీకి బయలుదేరిరి. వారు నిత్యము బ్రహ్మానంద మఠములో వుండేవారు. దూర ప్రాంతముల నుంచి భక్తులు ఎందరో వారి దర్శనమునకు వచ్చేవారు. భక్తులకు వారి కోరికలు తీరునట్లు సలహాలు ఇచ్చి పంపేవారు. ఒకనాడు ఉకడవే, చప్రే అను భక్తులు చాలా కాలం తర్వాత వాసుదేవనంద సరస్వతి స్వామి దర్శనం అయినందుకు సంతోషించి ఒక ఫోటోగ్రాఫరును, స్వామికి ఫోటో తీయవలననే కోరికతో స్వామి ని అడిగారు.స్వామి వారిని అనుమతి అడుగగా వారు, "నన్ను మీ హృదయము లందు ప్రతిష్ఠించుకోవలెను కాని, వట్టి కాగితం పైన ముద్రించిన ప్రయోజనం లేదు, " అన్నారు. ఆ మాట వినగానే భక్తులు అన్ని ప్రయత్నాలూ చేసుకొన్నాము. మీరు మమ్మల్ని అనుగ్రహించి అనుమతి ప్రసాదించ వలసినది అని వేడుకొగా దయార్ద్రహృదయులై అనుమతించి, క్రిందకు వచ్చి కూర్చున్నారు. వారు సిద్ధాసనములో కూర్చుని, ఎడమచేయి ఎడమకాలుపై పెట్టుకుని, కుడిచేతితో దండమును పట్టుకుని, దగ్గరగా కమండలమును పెట్టుకుని ప్రసన్నముగా ఫోటో దిగారు. అదే వారి యెక్క మొదటి ఫోటో అని తెలుస్తున్నది.🙏🏻
సేకరణ:: Rajyalakshmi srinivas boddupalli
No comments:
Post a Comment