కాకడ హారతి ,మధ్యాన్న హారతి ,సాయం హారతి ,
శేజ్ హారతి .ఇలా నాలుగు వేళలలో హరతులనేవి
షిర్డీ సంప్రదాయముగా ఏర్పడ్డాయి .బాబా వారు
మశీదు ( ద్వారకామాయి ) లో నివసిస్తుండేవారు .
ముస్లింలకు అయిదు సార్లు నమాజు చేయడం
విధాయకం .వారికేదో ఒక పద్దతి ఉంది ".మనం కూడా ఏదో ఒక ప్రత్యేక విధానాన్ని ,సమయాలను
పెట్టుకొంటే బాగుండేది " అన్న ఉద్దేశంతో హిందూ
భక్తులు హారతులు ఇవ్వడం ప్రారంభించారు .అది
ఆలా స్థిరపడిపోయాయి .ఇందులో ఉన్నవాటిలో
ఎక్కువభాగం శ్రీకృష్ణ జగేశ్వర భీష్మ ,దాసగణు
మహరాజ్ ,ఉపాసనీ మహరాజ్ ,మున్నగు మహా
సాయిభక్తులు రచించినవి .వేకువ జామున ,
ప్రశాంత వాతావరణంలో ,రాత్రి నిద్రవలన ,
హాయిగా ,తాజాగా ఉన్న మనసుతో పాడే మేలుకొలువు పాటలు అద్భుతమైన అనుభూతులు కలిగిస్తాయి .భావనాపరంగా కూడా ఈ కాకడ హారతి పాటలు అతి సున్నితంగా
హృదయాలను కరిగిస్తున్నట్లుగా వుంటాయి .
" రహం నజర్ కరో అబ్ మోరేసాయి ,తుమ్ బినా
నహి మాబాప్ భాయీ " అంటే గుండె కరుగక మానుతుందా ? " ముజేసె ప్రభు దిఖాలనా " అనగానే ఈ దీనత్వ మనసు తాకకుండా ఉండదా
ఉపాసనీ మహరాజ్ రచించిన సాయినాథ మహిమా స్తోత్రం లో " భవ ద్దర్శనాత్ పునీతం ప్రభో " అన్న పలుకులు పెదవులమీదకు రాగానే
ఏదో తెలియని ఒక నిశ్చింత కలుగుతుంది .
" షిర్డీ మాఝే పండరీపుర " అన్న పాట ,దాని రాగంలాగానే మనలో ఉత్సాహము నింపుతుంది .
నమస్కార అష్టకంలో " ధరావే కరిసాన "అన్నది
మనలో ని ,పసితనాన్ని ,ఆత్మార్పణ భావమును
పైకి తేగా చివరి భాగం " తులామాగతో "భక్తీ
వినమ్రులను చేస్తుంది .ఇలా అడుగడునా అద్భుతమైనవే ఈ హారతులన్నీ .
అసలు ఈ హరతులు రచించిన వారంతా ,ఎంతో
ఆర్తీ ,ఆర్ద్రత నింపుకుని రచించారు .అందుచేత
పాడేవారు కూడా తగిన జాగ్రత్త అవసరం కదా
మనం ముఖ్యముగా గుర్తుంచుకోవలిసిన విషయము ఏమిటంటే మనం పాడేది బాబా కోసం
వినవలిసిన అసలు వానిమీదే దృష్టిని నిలపాలి .
స్వయంగా సాయబాబా ఎదుట ద్వారకామాయిలో నిలబడి పాడుతున్నాం ,అల నాటి భక్తులతో కలసి పాడుతున్నాం " అన్న లోతైన భావముతో పాడాలి .ముఖ్యముగా పాటలోని భావన మన హృదయాన్ని తాకుతూ
ఉండాలి .అసలు నిజం చెప్పుకోవాలంటే ఒక్క పాట ,ఒక్కపాట ఏమిటీ ? ఒక్క చరణం పాడితే
మనసు రుద్దమైతే ,మరో చరణం ఎలా పాడగలను ? " నా తల్లి తండ్రులు కోపగించినా సరే -నా భార్యాబిడ్డలు కోపగించిన సరే -నా తోబుట్టువులు ,అత్తమామలు అలిగినా సరే -
తండ్రీ ! సాయినాధ ! నీవు మాత్రం నాపై కోపగించుకోకు స్వామీ ! " ఈ మాటలు మన నోట
పలుకగానే ఏదో తెలియని దుఃఖం లోపలనుంచి
తన్నుకు వస్తుంది .కంఠం రుద్దమైపోతుంది .
ఆ తరువాత శ్లోకం ఎలా చదవగలము ? ఎంతో
కష్టం మీద నిగ్రహించుకొని ముందుకు సాగవలిసి
వస్తుంది .ఇలా మనసు మెత్తబడడమే హారతుల
ప్రయోజనము .అది కావాలంటే గట్టి భావన
ప్రధానం .మొత్తం మీద ఫలితార్ధం ఏమిటంటే -
ప్రియ సాయిభక్తులారా ! హారతులను ఆర్తితో ,
భక్తితో ,బాబా పట్ల గొప్ప అనురక్తితో పాడితేనే
అవి సత్ఫలితాలిస్తాయి .ఆలా కాకపొతే మనకి
టేపు రికార్డర్ కు తేడా వుండదు .సాయబాబా
ముందు అలనాటి భక్తుల వలె హారతులు పాడుదాం .

No comments:
Post a Comment