సాకోరి నివాసి హంసరాజ్, ఉబ్బసంతో బాధపడుతున్నాడు. అతనికి సంతానం కూడా లేదు. అతడు ఈ రెండు బాధల నుండి విముక్తి పొందడం కొరకు నాసిక్ నివాసి, దిగంబరీ యోగి అయిన శ్రీ నరసింగ్ మహరాజ్ అను సిద్ధపురుషుణ్ణి ఆశ్రయించారు. అతని దేహాన్ని ఒక భూతమావేశించి సంతానం లేకుండా చేస్తోందని, సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చెంపమీద రెండు దెబ్బలు కొట్టి భూతాన్ని తరిమెస్తారని ఆ మహనీయుడు చెప్పారు. అతను మరియు శ్రీమతి కషిబాయ్ హంసరాజ్ డిసెంబర్ 1916 సంవత్సరంలో శ్రీసాయిబాబా వారిని దర్శించిన వెంటనే అతడు ఏమి చెప్పకముందే శ్రీసాయి అతని చెంపమీద రెండు దెబ్బలు కొట్టి, "దుష్టగ్రహమా ఫో బయటకు!" అని కోపంగా గద్దించారు.శ్రీ సాయిబాబా వారిని దర్శించిన కొద్దికాలానికి అతడికి సంతానం కల్గింది. అప్పటినుండి 6 నెలలపాటు షిరిడి లో ఉన్నారు. షిరిడి రాకముందు హంసరాజ్ రాత్రింబవళ్ళు తీవ్రమైన ఉబ్బసంతో బాధపడేవారు. బాబాను దర్శించిన తరువాత ఆ వ్యాధి తీవ్రత క్రమముగా తగ్గుతూ వచ్చి పగలు మాత్రము ఉండేది. రాత్రిల్ల్లు ఇబ్బంది పెట్టేది కాదు. కానీ బాబా రాత్రిళ్ళు దగ్గుతూ ఉండేవారు. షిరిడి వచ్చిన కొత్తలో శ్రీమతి హంసరాజ్ భర్తకి రోజు ఉబ్బసానికి మందు ఇచ్చేది. అది చూసి బాబా ఆమెతో “తమకు ఉబ్బసవ్యాది ఉందని. నీవు నీ భర్తకు మందిస్తున్నట్లుగానే తమకు కూడా వేలమంది స్త్రీలు మందు ఇవ్వగలరు. కానీ ప్రయాజనమేముంది? అల్లా మాలిక్ హై – భగవంతుడే యజమాని” అన్నారు. అప్పటినుండి ఆమె తన భర్తకు మందు ఇవ్వడం మానివేసింది.
ఆ వ్యాదిని నివారించే క్రమంలో బాబా అతనికి పుల్లని, ఘాటైన పదార్దములు తినవద్దని ముఖ్యంగా పెరుగు తినడం నిషేదించారు. కాని పెరుగు పట్ల అమిత ఇష్టం వలన హంసరాజ్ ప్రాణాన్ని అయిన విడుస్తాను గాని పెరుగు తినకుండా ఉండలేనని భార్యతో చెప్పి, ముర్ఖించి రోజూ బార్యతో పాలు తోడు పెట్టించేవాడు ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు. బాబా ఏదో ఒకవిధంగా రెండు నెలలపాటు అతడు పెరుగు తిని కుండ కాపాడుతూ వచ్చారు. రోజూ ఆ యిద్దరూ ఆరతికి మసీదుకు వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు త్రాగివెళ్లి పోతువుండేది. ఒక రోజు అతడు కోపంతో ఆరతికి కూడా వెళ్ళక, పొంచివుండి, పిల్లివచ్చి పెరుగు త్రాగతున్న సమయంలో కర్రతో కొడితే పిల్లి భాధతో ఏడుస్తూ పారిపోయింది. తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే బాబా. "ఇక్కడొక మూర్ఖుడు పుల్లపెరుగు తిని చావాలని చూస్తున్నాడు కాని రోజూ అతను తినకుండా చూస్తున్నాను. ఒక పిల్లి రూపంలో అతని ఇంటికి వెళ్ళాను.వాడు నన్నీరోజు కర్రతో కొట్టాడు! ఇక్కడ చుడండి" అంటూ బాబా తమ వీపు పై కర్రతో కట్టిన వాత చూపారు.

No comments:
Post a Comment