శ్రీ సాయిబాబా వారి సమకాలికుడు వాసుదేవానంద సరస్వతి. ఆయనను టెంభే స్వామి అని కూడా అంటారు.
ఆయన తెలుగు వారు అయిన రాజమహేంద్రవరంలో శ్రీసాయి భక్తుడయిన దాసగణు మహారాజును కలిశారు.
అప్పుడు వాసుదేవానంద సరస్వతి, దాసగణు మధ్య సంభాషణ జరిగింది. వాసుదేవానంద సరస్వతి కర్మిష్ఠిడు. ఆచార వ్యవహారాల పట్ల తీవ్రమైన శ్రద్దను చూపేవారు.సాయిబాబా అలా కాదు. వాసుదేవానంద స్వామి తన అన్నగారైన సాయిబాబాకు తన నమస్కారాలు పంపుతూ నారికేళాన్ని కూడా పంపారు.
ఆచార వ్యవహారములలో ఆ ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవముల వలె ఉండేవారు. వాసుదేవానందులకు సాయి బాబా పై అవ్యాజమైన ప్రేమ. శ్రీసాయిబాబా వారి విధానాలయందు ఎటువంటి శంక ఆయనకు లేదు. తనకు సాయి సోదరుడే అవుతారని తెలిపారు స్వయంగా తెలిపారు.
No comments:
Post a Comment