Saturday, August 8, 2020

పూలమ్మ యను సాయి అంకిత భక్తురాలు చుండూరు కామేశ్వరమ్మ "వీరిది గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణమునకు దగ్గర గల మునిపల్లె గ్రామము.

పూలమ్మయను సాయి అంకిత భక్తురాలుని పరిచయము చేసుకుందాము  

అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

పరిపూర్ణమైన సాయి తత్వ ప్రచారం లో 
శ్రీ పూజ్య బి.వి.నరసింహ స్వామి, శ్రీ కేశవయ్యజీ, శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్, శ్రీ బాపట్ల హనుమంతరావు, శ్రీ వేమూరి వెంకటేశ్వరులు, శ్రీ సాయి లీలమ్మ , మాతాజీ కృష్ణ ప్రియ, మాతృశ్రీ పూలమ్మ, శ్రీ ఆదిపూడి మోహనా రావు, శ్రీ ఎం రంగాచారి. మమొదలైన ఎందరో భక్తులు తమ జీవితాలను త్యాగం చేసి , సాయి ప్రచారం లో మునిగి తేలారు. 

వారిలో 

ఇప్పుడు పూలమ్మయను సాయి అంకిత భక్తురాలుని పరిచయము చేసుకుందాము. ఈమె పూర్తి పేరు చుండూరు కామేశ్వరమ్మ "వీరిది గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణమునకు దగ్గర గల మునిపల్లె గ్రామము. 

సాయినాధుని శబ్దం, పేరూ తెలుగువారికి తెలియనప్పుడే , విననప్పుడే వీరు సాయిభక్తురాలు అయ్యారు. 

చుండూరు కామేశ్వరమ్మగారు బాబా ఆశ్రయము పొందిన విధానము

శివరామయ్యగారు, రుక్మిణి అమ్మ దంపతులకు 22, జనవరి,1915 సంవత్సరంలో రధసప్తమి రోజు గుంటూరు జిల్లాలో మునిపల్లి గ్రామంలో జన్మించారు. శుక్రవారం రోజు పుట్టారు కాబట్టి లక్ష్మీకామేశ్వరి అని పెట్టారు. 

వీరికి 8 సంవత్సరాల వయసప్పుడు ,
ఆమె తల్లిదండ్రుల చెంతయుండగా ఆల్ ఇండియా సాయిసమాజ్ అధ్యక్షులైన శ్రీ బి.వి.నరసింహ స్వామి వారు 1944లో ఆంధ్రప్రదేశ్ లో సాయితత్వ ప్రచారము చేయుచు చీరాల, బాపట్ల, రేపల్లె, తెనాలి, విజయవాడ పట్టణములకు వచ్చిరి. ఆ సమయములో మునిపల్లె గ్రామములోని శివరామయ్య గారి ఇంటికి వచ్చిరి.

నరసింహస్వామిగారు నిరాడంబరముగా ఎప్పుడు తన చెంత ఒక బాబా పటమును వుంచుకొనెడివారు. యిచట కుడా ఆపటమును పెట్టి సత్సంగము చేసిరి.

సత్సంగములో యున్న కామేశ్వరమ్మను శ్రీనరసింహాస్వామిగారు తదేక దృష్టితో వీక్షించి ఆ బాలికను ఆశీర్వదించి, బాబా పటమును ఒకటి బాలికకు యిచ్చి "బిడ్డా!" అని సంబోధిస్తూ *ఈ పటమును తదేకముగా చూచుచుండుము*. *శ్రీ సాయి నామమును తదేకముగా స్మరింపుము*. *ఒక అగరుబత్తిని వెలిగించి అది పూర్తియగువరకు ఆ పటము నందలి మూర్తిని ధ్యానింపుము*. *అట్లు చేసిన శ్రీసాయిబాబా నీ కనుసన్నల మెలుగు సమయము రాగలదు* అని చెప్పిరి. 

*ఇదే సాధన*

నరసింహస్వామిగారు కామేశ్వరమ్మగారి మనసును బాబా యందు ఏకాగ్ర పరచుటకు సాధన చూపిరి.

ఆమె వారు చెప్పినట్లు సాధనలో సాయి అనుగ్రహమునకు పాత్రురాలైనది. తరువాత కాలములో ఈమె బాబా అంకిత భక్తురాలై బాబా నుండి అద్బుత మహిమలను పొందినది. సాధనలేని వారు ఇలా ముందుకు వెళ్ళలేరు. 

*బాబా చెప్పినట్లు తీసుకో, తీసుకో అంటే ఎవరు తీసుకోవటంలేదు.తేతే అంటున్నారు, అన్నట్లు యున్నది భక్తులస్థితి*. 

అందువలననే ఇప్పటి వారు అంకిత భక్తులుకాలేక పోవుటకు ఈ సాధనలోపమే. ఈ విధముగా బి.వి.నరసింహస్వామి వారి ద్వారా కామేశ్వరమ్మగారు సాయినాశ్రయించుట జరిగినది.

ఈ పూలమ్మగారు ఆంధ్రదేశమంతటా సాయిప్రచారాన్ని వ్యాప్తిలోకి తీసుకువచ్చిన సాయిసేవిక. పూలమ్మగారి అసలు పేరు చుండూరు కామేశ్వరమ్మ.  ఆమె సాయిపూజ చేస్తున్నప్పుడెల్లా ఆమె చేతిలోనికి రక రకాల  పూలు ప్రత్యక్షం అవుతూ ఉండేవి.  
వీరికి సాయినాధుడు పిలిస్తే పలికెవారు వీరికి. అంతటి అదృష్టం. వీరి చేతిలో తరచూ గుప్పెడునిండా గులాబీపూలు వచ్చేవి.అందుకే పూలమ్మగారుగా ప్రసిద్ధి. 
ఎక్కువగా గులాబీ పూలు ప్రత్యక్షం అయ్యేవి. అందువల్లనే భక్తులందరూ ఆమెను ప్రేమతో పూలమ్మ అని పిలుస్తూ వుండేవారు.  

కామేశ్వరమ్మ గారికి వివాహమగుట, అత్తింట బాబాను సేవించుటలో ఇబ్బందులు పొందుట, గుంటూరు చేరి అచట బాబా పూజలు జరుపుచుండ భక్తులు ఆమె చెంతకు రాసాగిరి.

ఆమె బాబా అనుగ్రహమునకు పాత్రురాలైనది. ఆమె నుండి బాబా కొన్ని లీలలు ప్రకటింప సాగిరి. పూజాసమయమున యిల్లంతయు సుగంధభరితమగుట జరుగుచున్నది.

వీరు యిచ్చు బాబా తీర్దముతొ అనారోగ్యులు ఆరోగ్యవంతులగుచుండిరి. క్రమేపి భక్తుల సంఖ్య పెరగసాగినది.

ఒక రోజున నిత్య పూజ చేసి నైవేద్యమిడుచు రెండు చేతులు కలిపి దోసిలి పట్టగా  అందు గులాబి పుష్పము వచ్చినది.

క్రమముగా దోసిట నిండా మల్లెపూలు, గులాబీపూలు రాసాగినవి. ఈ లీల తెలిసిన భక్తులు కిటకిటలాడసాగిరి.

ఇక ప్రతిరోజూ ఆమె దోసిట గులాబీలు వచ్చుచుం డుటచే భక్తులు ఆమెను పూలమ్మగా పిలువసాగిరి.

ఆంధ్రప్రదేశ్ లో చుండూరు కామేశ్వరమ్మ అను పేరుకంటే పూలమ్మగా ప్రసిద్ది చెందినది. ఇంకను రవ్వకేసరి, కలకండ ప్రసాదాములుగా వచ్చుచుండెను. అక్షతలు కూడా వచ్చుచుండేవి.
సాధరణముగా ఇట్టి లీలలు సిద్దులుగానో, తాంత్రిక విద్యలుగానో భావిమ్తుము.

అట్టివి బాబా లీలలు కావు. భక్తుల విస్వాసమునకు ఏవైనా బాబా చూపుదురు.

బాబా దేహధారిగా యున్నప్పటికన్నా ఇప్పుడే అద్బుత లీలలు బాబా చూపుచున్నారని పూజ్యశ్రీ శివనెశన్ స్వామి, శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారు చెప్పినట్లు ఇవి బాబా నిదర్శ నములని తలచవచ్చు.

రోజు నియ మంగా సాధన చేసేవారు. సాయినాధుని భౌతికంగా దర్శించాలని 12 సంవత్సరాలు ఉపవాసం చేశారు. చివరికి షిరిడీ వెళ్లినప్పుడు సాయినాధుడే స్వయంగా జొన్న రొట్ట పెట్టి ఉపవాస దీక్ష విరమింపజేశారు.

తెలుగులో మొదటిసారి సాయి సత్ చరిత్ర, సాయిసత్యవ్రతం రాసిన శ్రీ వేమూరి వెంకటేశ్వర్లుగారి పుస్తకాలను పూలమ్మ గారు ప్రింట్ చేయించారు. 

వీరిని తరచు రoగన్నబాబుగారు, జిల్లెలముడి అమ్మ, 
శ్రీ లక్ష్మీకాంత యోగేశ్వరులు దర్శించుకున్నారు. 

ఒకరోజు కాశీ నుంచి ప్రసాదం, గంగ నీరు రావటంతో తాను కాశీ దర్శించలేదని బాధ పడ్డారు.ఆరోజు సాయి పటం నుంచి 3 బిందెలో నీరు కారితే పట్టుకొని వారు స్నానం చేయటమే కాక, ఇది చూడడానికి వచ్చిన వారికి తీర్ధంగా ఇచ్చారు. 

ఆమె తన స్వగ్రామమయిన
గుంటూరుజిల్లా నండూరులో 1965లో . 
సుందరమయిన సాయిమందిరాన్ని కట్టించారు. 

పూలమ్మ గారు తాను దర్శించిన, తనకు కలిగిన అనుభవాలు అన్నికూడా, నండూరులో తాను ప్రతిష్టించిన సాయిబాబా మందిరం,  ప్రతిష్టించినప్పుడు తనకు కలిగిన అనుభవాలు, చాలా చక్కగా ఒక పుస్తక రూపంలో, "శ్రీ సాయి లీలాతరంగిణి- శ్రీ సాయినాధుడు ప్రసాదించిన దివ్యానుభూతులు" అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. 12- 10- 1994లో  "శ్రీ సాయి లీలాతరంగిణి" అనే పుస్తకం విడుదలైంది. మాతృశ్రీ చుండూరు కామేశ్వరమ్మ గారి (పూలమ్మ గారి) అనుభవాలు సారాంశమే, ఈ" శ్రీ సాయి లీలాతరంగిణి". శ్రీ సాయినాథుడు ప్రసాదించిన దివ్యానుభూతులు అనే శీర్షికతో, ఈ పుస్తకం విడుదలైంది. 

ఎందరెందరో దూర ప్రాంతముల నుండి వారి వద్దకు వచ్చుట అనేక విషయములు తెలుసుకొనుచుండట జరిగేడిది. సాధన నేర్పెడివారు.

చివరి రెండు మూడు సంవత్సరముల ముందు నుండి వారిట్టి మహిమలు చూపుట ఆపిరి. సాధకులకు వాటితో పనిలేదనిరి.

ఆమె దేహము చాలించుటకు కొద్ది రోజుల ముందు ది 20-7-1993వ తేదిన భక్తులతో మాట్లాడుతూ
బాబా విషయములు చెప్పుచు చివరగా “మహావిష్ణువైన శ్రీసాయిబాబా మనకు అండగా యున్నారు.నీవు మంత్రాలు కాని తాయెత్తులు వంటి వాటిని గాని, ఎవరిని కాని ఆశ్రయించవద్దు” అని చెప్పారు.

ఇదే ఆమె ఆఖరి సందేశమైనది. 

29, జులై 1993 సంవత్సరంలో 5 రోజుల ముందు గా తెలిపి ఏకాదశి రోజు సాయిలో ఐక్యం అయ్యారు.

  ఓం శ్రీ సాయిరాం....

సద్గురులీల ( మార్చి - 2014) మరియు
Sreenivas Murthy గారి సౌజన్యంతో. 

సేకరణ- అల్లు జయశ్రీ.

No comments:

Post a Comment