శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నవళి
28,29,30వ అద్యాయములు
(28వ అద్యాయము)
1. షిరిడి వెళ్ళే వారికి ఏమీ ఇచ్చి పంపించాలి?
జవాబు) పూల మాలలు, కర్పూరం, దక్షిణ.
2. కిచిడి కధ ద్వారా బాబాకు ఏ విధమైనది తన వద్దకు వచ్చిన వారి మీద వుండును?
జవాబు) అసాధారణమైన ప్రేమ.
3. సాయి పాద తీర్థము త్రాగిన ధన్యుడు ఎవరు?
జవాబు) మేఘశ్యాముడు.
4. ద్వారాకా మాయి వాసి దేనిలో పారంగతులు?
జవాబు) వేద జ్ఞానము నందు, ఆత్మ సాక్షాత్కారం నందు.
5. షిరిడి ప్రయాణమునకు గుమస్తా కు ఎంత మంది తోడ్పాటు చేసారు?
జవాబు) మంజునాధ, దాసగణు, శంకర్ రావు, పినతండ్రి కొడుకు, ముసలమ్మ.
6. సర్వజ్ఞత బాబాకు ఉన్నది ఎన్ని కధలలో వచ్చును?
జవాబు) మూడు కధలు.
7. మద్యాహ్న హారతి కాగానే దేహ త్యాగము చేసిన వారు ఎవరు?
జవాబు). మేఘశ్యాముడు.
8. ఎన్ని పిచ్చుకలు కలవు ఎన్ని కోసుల దూరం లో?
జవాబు) మూడు పిచ్చుకలు, 1000 క్రోసుల దూరం.
(29వ అద్యాయము)
9. బికానేరు భక్తుడి కధలో పాత్రధారులు ఎంత మంది వున్నారు?
జవాబు) బాబా స్నేహితులు, నిమొనుకర్.4
10. బాబా మనము అడిగినది ఇస్తారా! అను వాక్యము ఏ కధలో ఉన్నది?
జవాబు) టెండూల్కర్ కధలో ఎక్కువ గా ఉన్నది.
11. ఆశ లేని భక్తురాలు బాబా ను చూసిన ఆనందం లో ఏమి చేసింది?
జవాబు) చేతులు తట్టేను (చప్పట్లు).
12. నమస్కారములు ఎన్ని రకాలుగా చేయవచ్చు?
జవాబు) 2 రకములు, 1.పైకము తీసుకొనుటకు, 2. దేవుని గా భావించి.
13. ద్వారాకా మాయి లో మేలైన వస్తువేది?
జవాబు) బాబా ఆశ్విర్వాదం.
14. ఇచ్చిన రూపాయి మళ్లీ వచ్చినది దానిలో ఏమి బాబా ఇచ్చిరి?
జవాబు) ఊదీ ప్రసాదం.
15. ఎంత పెద్ద పైకము బాబా అందరికి ఇచ్చేవారు?
జవాబు) 50 రూపాయలు వరకు.
(30వ అద్యాయము)
16. కలలో కనిపించి పిలుపించుకున్న భక్తుడు ఎవరు?
జవాబు). కుశాల్ చంద్.
17. యొగుల ఆజ్ఞ లేనిచో ఏమి జరుగును?
జవాబు) చెట్టు మీద ఆకు కూడా కదలదు.
18. షిరిడి కి లాగబడిన భక్తులు ఎవరు? ఎంత మంది?
జవాబు) వైద్య కుశాల్, రామ్ లాల్, 30 మాధ్యమం గా.
19. స్వప్నములో దర్శనము ఇచ్చిన షిరిడి కి రప్పించుకున్న భక్తుడు?
జవాబు). పంజాబి రామ్ లాల్.
20. మ్రొక్కు సంగతి ఎవరి ద్వారా శ్యామాకు తెలిసెను?
జవాబు) జ్యోతిష్యుడు తమ్ముడు బాపాజీ.
21. 30 వ అధ్యాయం లో అదృష్ట వంతుడు ఎవరు?
జవాబు) హేమాది పంత్.
22. వణి నివాస కధ ద్వారా మనము బాబా గురించి ఏమి తెలుసుకోగలము?
జవాబు) సాయి సర్వాంతర్యామి.

No comments:
Post a Comment