షిరిడీలో గల సాయిబాబాకు ఊరు పేరూ లేదు .
అయితే ప్రప్రధముగా చాంద్ భాయి అనే ముస్లిం
తన కుటుంబంతో పాటు వివాహ కార్యక్రమానికి
వలె వేషధారణలో ఉన్న ఒక యువకుడికి అక్కడే
ఉన్న మహల్సాపతి అనే ఖండోబా మందిర పుజారి " సాయీ " అని పిలిచాడు .ఊరు పేరూ
లేని ఆ యువకునికి " సాయీ " అను పేరు స్థిరమై
పోయింది .అయితే ఆ నామం సాయి వయసు పెరిగిన తరువాత అయనను "సాయబాబా " అను పిలువసాగారు .బాబా షిరిడీకి వచ్చిన గోవింద్ రఘునాద్ ధబోల్కర్ అను ప్రభుత్వ ఉద్యోగికి " హేమాడ్ పంత్ " అని పిలిచాడు .
అంతే ఆయన పేరు హేమడ్ పంత్ అని పిలవసాగారు .హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర
మరాఠి గ్రంథాన్ని రచించి భక్తుల మదిలో నిలిచిపోయాడు .ఆలాగే మాధవరావ్ దేశపాండే
అను భక్తుడిని " శ్యామా " అని బాబా పిలువసాగాడు .బ్రిటీషు వారి పాలనలో హైదరాబాద్ లో ఉన్నత పదవిలో నున్న మంత్రి
ప్రగడ లక్శ్మి నరసింహరావు గారు షిర్డి వెళ్ళి బాబాను దర్శించుకునేవాడు .ఆయన ఒకసారి షిర్డీ వెళ్ళి బాబాను దర్శించి " బాబా ! మూడు తరాలుగా మా వంశంలో ఆడపిల్లలు లేరు .కనుక
మాయందు దయ ఉంచి మాకొక ఆడపిల్లను సంతానంగా మాకు ప్రసాదించు " అని ప్రార్దించాడు
ఆదివిన్న బాబా " ఆలాగే అవుతుంది ఫో ! " అని ఆన్నారు .బాబా ఆశీర్వాద phalitamga ఒక ఆడపిల్ల జన్మిమిచ్చింది .మరల ఆయన షిర్డీ వెళ్ళి
బాబాను దర్శించి " బాబా ! ఆ శిశువుకు ఏమి పేరు పెట్టమంటారు ? " అని అడుగగా " శృంగేరి
శారదా దేవి " అని పేరు పెట్టు " అని బాబా సెలవిచ్చాడు .ఆలాగే ఆ బిడ్డకీ " శారదాదేవి "
అని పేరుపెట్టారు .ఆ పిదప మంత్రి ప్రగడ శారదాదేవి ,వివాహ అనంతరం గాలి శారదా దేవీ
అయినది .తరువాత ఆమె అనేక సార్లు షిర్డి వెళ్ళి
బాబాను దర్శించుకునేది .
గులాబ్ - ఇమాం భాయి చోటే ఖాన్ బాబా భక్తుడయినాడు .అతడు ఒకసారి షిర్డి వెళ్ళి బాబా
ను దర్శించాడు .బాబా అతనితో " గులాబ్ " మీ ఇంటికి వచ్చాడు "తరువాత అతను ఇంటికి వెళ్లగా గర్బవతి అయిన
తన భార్యా ప్రసవించిందని ,మగ శిశువు ప్రసవించిందని తెలిసింది .ఆ బిడ్డకు సాయబాబా
చెపినట్లు " గులాబ్ " అని పేరు పెట్టాడు .

No comments:
Post a Comment