శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి ( టెంబె ) స్వామి
వారి 165 వ జన్మదినం నేడే .( 13 -8 -1854 )
సాయిసచ్చరిత్ర చివరి అధ్యాయములలో టెంబె స్వామి ప్రస్తావన కనిపిస్తుంది .వాసుదేవానంద
సరస్వతి స్వామివారు సాయిబాబాకి సమకాలికుడు .స్వామివారు తమ 18 వ చతుర్మాస దీక్షలో భాగముగా రాజమహేంద్రవర
పట్టణాన్ని 1909 సం . ఫిబ్రవరి నెలలో దర్శించడం
జరిగింది .అక్కడే పుండలీకరావు గా పేర్కొనబడిన
దాసగణు మహరాజ్ స్వామివారిని కలవడం జరిగింది .పరమనిష్టాగరిష్ఠుడైన స్వాములవారు
తమ అచారాన్ని ఉల్లఘించి సాయిబాబాకు పాదాభివందనం చేసి ఒక నారికేళమును బాబాకు
సమర్పించమని దాసగణు మహరాజ్ కు అదేశించారు .అయన రాజమండ్రి నుండి టెంకాయని పంపడమే మహాకార్యం కాదు ,
అదే సంవత్సరములో పిఠాపురం దర్శించి ,అక్కడ
ప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుఁడు తెలుగువాడని ,ఆయన జన్మస్ధలం పిఠాపురమని
తెలిపి అక్కడ దత్త పాదుకలు ప్రతిష్టించారు .
వాసుదేవానంద సరస్వతీ స్వాములవారు తెలుగునాట దత్త సంప్రదాయాన్ని పునరుద్ధించారు ".వ్యాసోచ్ఛిష్ఠం జగత్సర్వము"
అని అంటారు .దత్తాత్రేయులవారి సాహిత్యం
వాసుదేవానందులవారి ఉచ్ఛిష్ఠం అన్నా తప్పు
కాదనీ అనిపిస్తుంది .కొంకణ్ ప్రాంతములో గల
సావంతవాడి సమీపములో మాన్గావ్ గ్రామములో
13 ఆగష్టు 1854 న వాసుదేవానందులు జన్మించారు .దత్తాత్రేయ స్వామి అయనకు స్వప్నములో మంత్రోపదేశం ఇచ్చారు .ఆయన తన వద్దగల దత్త విగ్రహం ( అది సాక్షాత్తూ దత్తాత్రేయ ప్రభువే ) ఆయనతో స్వయంగా ,
సన్నిహితంగా సంభాషించేవారు .స్వాములవారు
ఆ దత్తస్వామిని పూజించేవారు .ఈవిధమైన సన్నిహిత సంబంధం అపూర్వమైన విషయము .
సన్యాసులు ఇతరులకు నమస్కరించడం గానీ ,
విగ్రహాలను పూజించడం కానీ చేయరు .దత్త మూర్తిని ఆరాధించడంలోను ,సాయిబాబాకు నమస్కరించడంలోనూ తన అచారాన్ని పాటించలేదు .దత్తుని ఆరాధనను వ
[8/8, 7:32 AM] +91 98497 26896: దత్తుని అరాధనను విశేషంగా మహరాష్ట్రలో
తిరిగి ప్రవేశపెట్టారు .అయన శ్రీగురుచరిత్రను ,
గురుసంహిత అనే గ్రంథాలను సంస్కృతంలో
వ్రాశారు .ఇంకా దత్తపరమైన స్తోత్రాలు ,గ్రంథాలు
అనేకమైనవి సంస్కృతంలో రచించారు .
స్వాములవారు శృంగేరిని దర్శించినప్పుడు ఆలనాటి శృంగేరి శంకరాచార్యపీఠం అధిపతి అయిన శ్రీ సచ్చిదానంద శివాభి నవ నృశింహ భారతీ స్వాములవారిచే (1879 -1912 )
"అయంహీ భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయ స్వయం
యతిః " ( ఈ యతి సాక్షాత్తూ దత్తాత్రేయుడే )
అని కీర్తించబడిన వాసుదేవానంద సరస్వతి
స్వాముల స్మరణ చేసి ఆ దత్తాత్రేయుని అనుగ్రహ
అశీసులు పొందుదాం .
No comments:
Post a Comment