మనం దేనినైనా సాయబాబా కు, తినుటకు ముందు సమర్పించిన ఎడల అది నైవేద్యంగా
మారుతుంది .బాబా స్వీకరించగా మిగిలినది
ప్రసాదమవుతుంది .
మామూలుగా ఇతర పదార్ధాలకంటే ఎంతో పవిత్రత ,శక్తి గలిగి ఉంటాయి .ఈ సందర్బంగా సాయిబాబా కు అంకిత భక్తులైన శ్రీ స్వామీ కేశవయ్యజీ తన అనుభవాన్ని ఇలా తెలిపారు .ఒక రోజు మా ఇంట్లో మ డి లేకుండా ,ఓళిగలు తయారుచేసిబాబా కు సమర్పించకుండా మేమందరం తినడం జరిగింది .ఆ రాత్రి బాబా స్వప్నములో కనిపించి
" నాకు మీరు ఓళిగలు సమర్పించకుండా ,మీరు
అందరూ తిన్నారు ." అని జ్ఞాపకం చేశారు .
మహా అపరాధం చేశాను .మన్నించమని
ప్రార్థన చేశాను .ఇక్కడ సాయబాబా తనకు
ప్రత్యేకముగా ఒక విధానములో పూజ చేసి తనకు
సమర్పించమని చెప్పలేదు .బాబా కు పూజా తంతుతో పనిలేదు .ఏదైనా పదార్థం తినే ముందు
సమర్పణ చేసి న ,చాలును .ఇక ఆ పదార్థం
మ డి తో చేసారా ,లేదా బయట కొని సమర్పించిరా అని బాబా అడగలేదు .తినుటకు
ముందు సమర్పించిన చాలును .ఈ విషయము
సాయి సచ్చరిత్ర రచయిత అయిన హేమడ్ పంత్
తనకు జరిగి న అనుభవాన్ని ,ఆ గ్రంథంలో తెలిపాడు .బజారులొ కొనిన శనగలు నాకు
ఏల సమర్పించలేదు అని హేమడ్ పంత్ ను
అడిగారు .మనం కూడా ఏదైనా పదార్థం
సాయబాబా కు సమర్పించి తీసుకొందామా !
No comments:
Post a Comment