Monday, August 10, 2020

శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నావళి 49,50,51వ అద్యాయములు


శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నావళి

49,50,51వ అద్యాయములు

ఓంశ్రీసాయిరామ్

49వ అద్యాయము


1. మహమ్మదీయ స్త్రీలు ఎచ్చటి నుండి వచ్చిరి?

జవాబు) బీజాపూర్ నుండి.


2. మనస్సు ఎటువంటిది ?

జవాబు) చంచలమైనది.


3. కానోబాకు కుర్రవాడు ఎప్పుడు కనిపించెను?

జవాబు) భోజనానంతరము చేతులు కడుగు కొనుటకు బయటకు వచ్చినపుడు.

4 . 49వ అద్యాయము లో మొదటి కధలో బాబాని ఏవిధంగా చూడాలి ?

జవాబు) సత్పురుషుడిగా.


5 . సచ్చరిత్ర లో కధలను ఎవరు వ్రాయించిరి?

జవాబు) సాయిబాబా ప్రేరేపించి వారి యిష్టానుసారముగా వ్రాయించినారు.


50వ అద్యాయము


6 . న్యాయవాది ఏ గ్రంధమును రచించెను?

జవాబు) తుకారామ్ జీవితము.


7 . 48వ అద్యాయము లో కలిగిన అనుభూతి యిక్కడ ఎవరికి కలిగెను ?

జవాబు) బాలాధురంధర్ కు ,పాండురంగని వలే.


8 . బొంబాయి నివాసి ఎన్ని సంవత్సరముల తర్వాత మళ్ళీ వ్యాధి కనిపించేను ?

జవాబు) 6 సంవత్సరాల తర్వాత.


9 . దత్తాత్రేయుని భక్తుడు ఇచ్చినది ఎన్ని రెట్లు విలువైనది ?

జవాబు) ఎన్నోరెట్లు దానికి సరిపోవునది లేదు.


10 . దీక్షిత్ తన స్నేహితుడను ఎచ్చట కలిసెను ?

జవాబు) లోనావాలో.


11 . కోపర్ గావ్ మామలతాదారు ఎవరు ? వివరములు ?

జవాబు) బాలాసాహేబ్ మిరికర్ , తండ్రి కాకా సాహేబ్ మిరికర్. 


12 . దీక్షిత్ వాడ నిర్మాత బాబా సన్నిధిలో ఏరోజు అమరుడయ్యెను ?

జవాబు) 1926 జులై 5వ తేది.


13 . 46వ అద్యాయములో బాబా దర్శనము యిచ్చట ఎవరికి  జరిగెను ?

జవాబు) కాకా సాహేబ్ దీక్షిత్ పటము రూపమున.

51వ అద్యాయము


14 . ఎన్ని  అవస్ధలలో లీనమైనచో సంసార బంధమును నుండి తప్పు కొనగలరు?

జవాబు) జాగృత , స్వప్న ,సుషుప్తవ్యస్తలు.


15 . 51వ అద్యాయము ను దేనితో ముగించారు?

జవాబు) భగవంతుని ప్రార్ధనతో.


16 . నిత్య పారాయణము చేసే వారికి ఏమి తొలగి పోవును?

జవాబు) ఆపదలు.


17. దేనిని దాటుట బహుకష్ట తరము ?

జవాబు) సంసారమనే మహాసముద్రమును.


19 . 51వ అద్యాయములో ఎన్ని అద్యాయములు కలవు?

జవాబు)   52, 53  అద్యాయములు.

No comments:

Post a Comment