Saturday, August 8, 2020

#బాపట్ల హనుమంతరావు

*బాపట్ల హనుమంతరావు*

బాపట్ల హనుమంతరావు గారు 14 సెప్టెంబర్ 1902లో బాపట్ల లో చిన్న పున్నమ్మ, బాపట్ల వీరయ్య గార్లకు జన్మించారు. పున్నమ్మ గారు సంస్కృతంలోనూ తెలుగులోనూ పండితురాలు. ఆమె హనుమంత రావు గారికి తొలిగురువు. ఆమె శిక్షణలో హనుమంతరావు గారు తెలుగు సంస్కృతంలో పాండిత్యం సంపాదించి  భాషాప్రవీణ  అయ్యారు. వారు పురాతన గ్రంథాలలోనూ, పురాణాల్లోనూ చిన్న వయసులోనే ఆసక్తి కనపరిచారు. వాటిని తెలుగులో సులువైన పద్యాలుగా ఆయన రాసే వాడు.

హనుమంతరావు గారు చిన్నగంజాములో  జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు పండిట్గా పనిచేస్తూ అక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు.

27 డిసెంబర్ 1944న హనుమంత రావు గారికి కలలో ఒక ఫకీరు కనబడి కొన్ని పుస్తకాలను తెలుగులోకి అను వదించమని చెప్పారు.
అదే రోజు శ్రీ వి నరసింహ స్వామి గారు హనుమంతరావు గారిని చీరాల రమ్మని కబురు చేశారు. తను రచించిన  కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలను హనుమంతరావు గారికి ఇచ్చి అను వదించమని అది శ్రీ సాయి బాబా గారి ఆ దేశం అని చెప్పారు. ఒక సాయిబాబా ఫోటో కూడా  ఇచ్చారు. ఆ పుస్తకాలు ఇచ్చి వీటిని తెలుగులోకి అనువదించి సాయిబాబా బోధనలు ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయమని చెప్పారు.ఆ ఫోటో చూడగానే హనుమంతరావు గారు తనకు కలలో కనిపించి ఆశీర్వదించిన వారు శ్రీ సాయి బాబా అని తెలుసుకున్నారు. ఆ ఇంగ్లీష్ పుస్తకాలను  తెలుగులోకి అనువదించారు.

సాయి బాబా గారి పైన అనేక పుస్తకాలు  అనువదించి, వాటిని ప్రచురించి, ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేశారు. ఏమీ నిన్నుపేక్షింతునా అనే పుస్తకం సాయి భక్తి ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ లో మొదటి పుస్తకం.

7 నవంబర్ 1973 న హనుమంతరావు గారు పరమపదించారు.

No comments:

Post a Comment