Saturday, August 8, 2020

మన మశీదు వెనుక ఒక పెద్ద నక్షత్రం రాలిపోయింది

అందరి ఆశలు వమ్ములయ్యాయి .సాయబాబా పాదతీర్థం తాగి  ,తన దృష్టినంతా సాయబాబా పటంపై పెట్టి అంతిమ శ్వాస వదిలాడు నూల్కరు దానికి బాబా ఎంతో స్పందించాడు ." మన మశీదు వెనుక ఒక పెద్ద నక్షత్రం రాలిపోయింది " అని రోదించసాగాడు .అతని జీవిత గమ్యం చేరుకోడానికి సహాయపడ్డాను " అని అన్నారు బాబా .అది మానవుల విషయములో జరిగిన 
ఒక సంఘటన .ఇక జంతువుల విషయములొ 
ఒక సంఘటన .పులిని ఆడించి పొట్టపోసుకొనే 
దర్వేషులు ,వ్యాధితో బాధపడుతున్న ఒక పులిని 
బాబా వద్దకి తీసుకొచ్చారు .బాబా ఆ వ్యాధిని 
తొలగిస్తారని .ద్వారకామాయి చేరుకున్న పులి బాబాను చూసింది .బాబా పాదాలవద్దకు చేరి ,
తోకను మూడుసార్లు భూమిపై కొట్టి ,పెద్దగా గర్జన 
చేసి ప్రాణాలు వదిలింది .బాబా పులి రుణబంధమును తొలగించారు .బాబాకు మనుష్యులైనా ,జంతువులయందైనా వారి దయ 
ఒకలాగే ఉంటుంది .
సాయిబాబా "నావారు ఏ దేశంలో ఉన్నా ,కొన్ని వేల మైళ్లు దూరంలో ఉన్నా ,వారిని పిచ్చుక కాలికి 
దారం కట్టి లాగినట్లు ,లాక్కుని వస్తాను " అని అంటారు సాయిబాబా .ఇక్కడ పిచ్చుకను ఉదాహరణ కింద వాడుకున్నారు .మరొక చోట 
సాయిబాబా "వారు ( సాయినాథుని గురువు )
నన్ను దృష్టి చేతనే కాపాడుచుండెడివారు .
తాబేలు పిల్లలను తన దృష్టి చేతనే పెంచునట్లు 
నన్ను కూడా మాగురువు దృష్టితో పోషించుచునెడివారు .తల్లి తాబేలు ఒక ఒడ్డున 
ఉండును .పిల్ల తాబేలు రెండవ ఒడ్డున ఉండును 
తల్లి తాబేలు పిల్లలకు ఆహారము పెట్టుటగానీ ,
పాలిచ్చుట గానీ చేయదు .తల్లి పిల్లలపై దృష్టిని 
పోనిచ్చును .పిల్లలు ఎదిగి పెద్దవి అగును .
అటులనే మా గురువుగారు తన దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి "అని బాబా అన్నారు .సాయిబాబా జంతువులను పోల్చుటకు మాత్రమే వాడుకొన్నాడా ? అని అనిపిస్తుంది .బాబా దూర ప్రాంతాలనుండి తన భక్తులను తనవద్దకు రప్పించుకొన్నాడు .
ఒకొక్కసారి ఆయనే భక్తులవద్దకు పోయి వారి 
కోరికలను తీర్చేవాడు .బాబా మనుషులకు ఇచ్చిన ప్రాధాన్యత జంతువులకు ఇవ్వలేదా ?
అని సందేహము వస్తుంది .సాయి వంటి మహనీయుల జీవిత చరిత్రలను పరీశీలిస్తే మనుషులకు ఎంత విలువ ఇచ్చేవారో ,అంతటి విలువను జంతువులకు కూడా ఇచ్చేవారు .
పండరిపురంలో ఉన్న సబ్ జడ్జి నూల్కరు బాబా భక్తుడయ్యాడు .ఆ ఉద్యోగాన్ని విరమించుకుని 
బాబా వద్దనే స్థిరనివాసం ఏర్పడుచుకొన్నాడు .
అనుకోకుండా నూల్కరు ఆరోగ్యము క్షీణించసాగింది .బాబా దర్శనం చేసుకునే స్థితిలో 
కూడా ఆయన లేడు .నూల్కరు కుటుంబము ,
ఇతరులూ బాబా నూల్కరు ఆరోగ్యం చక్కదిద్దుతారని అనుకున్నారు .ఆలా ఎందరికో 
అరోగ్యాన్ని ప్రసాదించిన దాత షిర్డీసాయిబాబా .

No comments:

Post a Comment