శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నావళి
40,41,42వ అద్యాయములు
40 వ అద్యాయము
1. ఫాల్గుణ పౌర్ణమి రోజున వచ్చిన అతిధుల పేర్లు?
జవాబు) అలీ మహమ్మద్, మౌలానా ఇస్ముముజావర్.
2. 40వ అధ్యాయం లో మద్యాహ్న హరతి ప్రారంభ సమయమునకు వచ్చిన వారు ఎంత మంది?
జవాబు) 3+2=5.
3 . అన్నా సాహెబ్ దాబోల్కర్ దేనిని విని తలుపు తీసెను?
జవాబు) మేడ మెట్ల పై చప్పుడు విని.
4 . శ్రీ సాయి సచ్చరిత్ర రచయిత ఇంట భోజనమునకు ఎవరు వచ్చారు?
జవాబు) కొడుకులు, మనవలు, కుమార్తెలు, అల్లుళ్ళు.
5 . దహను మామలతాదారు ఎందులకు పశ్చాత్తాప పడెను?
జవాబు) బాబాను నిందించినందులకు.
6 . భక్తులు పరిపూర్ణముగా శరణు వేడినచో ఏమి జరుగును?
జవాబు) భక్తుల ఇళ్లల్లో శుభకార్యములు జరుగును.
7 . దహను లో వేరొక చందా పెట్టి నడుపు చున్న వారు ఎవరు?
జవాబు) రావు సాహెబ్ నరోత్తమ శెట్టి.
8. శ్రీ సాయి శక్తి ఏవిధంగా పంపించేవారు?
జవాబు) తన హస్తములను భక్తుల తలపై పెట్టి.
41వ అద్యాయము
9 . దహను మామలతాదారు స్వగ్రామం ఏది?
జవాబు) పాండ.
10 . ఫిబ్రవరి నెలలో దర్శించిన వారు బాబాకు ఎంత దక్షిణ సమర్పించారు?
జవాబు) 20+20+25+12=77 రూపాయలు.
11 . గుడ్డ పీలికలు దొంగిలించుట అనగా నేమి?
జవాబు) బాలకరాముని దేవు ప్రశ్నించుట.
12 . షిరిడి వచ్చిన దేవుకు బాబా స్వప్న దర్శనం ఎన్ని రోజులకు ఇచ్చారు?
జవాబు) (ఫిబ్రవరి నుంచి ఏప్రిల్) 2 నెలల 2 రోజులకు.
13 . షిరిడి నాధుడు దహను వాసిని ఏమి ఏమి చదువ వలెను అని చెప్పారు?
జవాబు) ఆధ్యాత్మిక చదువుము.
14 . ఙ్ఞానేశ్వరీ చదువుట కధలో ఎంత మంది భక్తులు ఉన్నారు?
జవాబు) దేవు, బాలకరావు, జోగ్, చంద్రు, బాబా.
15 . సముద్రంలో ఎన్ని పటములు విసిరిరి?
జవాబు) 6+4=10 (1మిగిలినది).
16 . 40 వ అధ్యాయం లో మొదటి కధ ద్వారా మనకు ఏమి తెలియును?
జవాబు) బాబా కు భూత భవిష్యత్తు వర్తమాన ములు తెలియును అని.
17. అన్నా సాహెబ్ దాబోల్కర్ కు బాబా చిత్రము ఎవరి సలహ వల్ల వచ్చెను?
జవాబు) ఇస్ము ముజావర్ వల్ల వచ్చెను.
42వ అద్యాయము
18 . షిరిడి నాధుడు ఏ సమయములో ఎవరితో వుండగా ఆకలిగా ఉన్నదని సెలవిచ్చెను?
జవాబు) సాయంకాలం మసీదులో తాత్యతో కూర్చుని వుండగా.
19 . షిండే ప్రతిరోజు భక్తి ప్రేమలతో బాబాకు ఏమి సమర్పించేది?
జవాబు) రొట్టె, పాలు.
20 . రొట్టె కధ ద్వారా బాబా గురించి మనకు ఏమి తెలియును?
జవాబు) బాబా సర్వ జీవుల యందు గలడని.
21 . తొమ్మిది వుండల కధలోని భాగము ఏమి తెలియజేయును?
జవాబు) 21వ అధ్యాయం లోనిది నవవిధ భక్తి మార్గములు.
22 . సాయినాధ స్తవన మంజరి రచయితకు స్వప్న దర్శనం ఎక్కడ జరిగెను?
జవాబు) పండరీపురం లో.
23 . సమాధి చెందిన తరువాత దాసగణు చేసిన సేవలు ఏమిటి?
జవాబు) 3పనులు, ఒకరోజు భజన, పువ్వుల హారం, అన్నదానము.

No comments:
Post a Comment