షిర్డీసాయిబాబా ను ప్రత్యక్షముగా దర్శించిన దక్షిణాది అంకిత భక్తురాలు -మాతా శివమ్మ .
(శివమ్మ తాయి ). బాబా సజీవంగా ఉన్నప్పుడు
ఆనేకమంది భక్తులు ఉత్తరాదివారే కాకుండా దక్షిణాదివారు కూడా దర్శించినవారు ఆనేకమంది.
వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవలిసిన మహిళా భక్తురాలు శివమ్మ తాయి .శివమ్మ తాయి అసలు
పేరు రాజమ్మ .ఆమె తమిళనాడు కొయంబత్తూర్
సమీపాన వెళ్ళికినారు గ్రామంలో 29 -5 -1889 నాడు ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు .
రాజమ్మ చిన్నతనంనుంచి ఆధ్యాత్మిక చింతనతో
గడిపేది .ఆమెకు 13 వ యేటనే సుబ్రమణ్య గౌండర్ వ్యక్తితో వివాహము ,మరుచటి ఏటున
ఒక మగబిడ్డను కనడం జరిగింది .ఆమెకు చిన్నాన్న అయిన తంగవేలు గౌండర్ ,సాధు సత్పురుషులను సేవించుట పూర్తివైరాగ్య భావనలతో వుండేవాడు .ఒక రోజున తంగవేలు
గౌండర్ కు షిర్డీసాయిబాబా దర్శనం ప్రత్యక్షముగా
ఆయన సమీప గ్రామములో జరగడం ,అనేక మంది ఆయనను అక్కడ వచ్చి దర్శించారు .
సుమారుగా 1906 సం .లో ఈ సంఘటన ద్వారా
రాజమ్మకు శ్రీసాయిబాబా దర్శనం కలిగింది .
ఆ సమయంలో బాబా ఆమెకు గాయత్రి మంత్రోపదేశం చేసి ఒక కాగితంపై ఆ మంత్రాన్ని
తమిళంలో రాసి ఇచ్చారు కూడా .అప్పటినుంచి
రాజమ్మ కు షిర్డిసాయిబాబాను గురువుగా నిర్ణయించుకొన్నది .కొన్నాళ్లకు ఆ కాగితాన్ని మరచిపోతే బాబా యే గుర్తుచేసి ఆమెకు చూపించారు .రాజమ్మ (శివమ్మ ) తన భర్త కుటుంబంతో కలిసి షిర్డీవెళ్లి ద్వారకామాయిలో ఆసీనుడైయున్న బాబా ను దర్శించారు .బాబా
ఆమె ను " నల్లా ఇరు " అని తమిళంలో ఆశీర్వదించారు .
షిరిడీలో బాబాను దర్శించిన శివమ్మ తాయి
ఈ విధముగా బాబా రూపురేఖలు వర్ణించింది .
"బాబా ఎల్లప్పుడూ ఒక సామాన్యవ్యక్తిలా ఆసీనులై ఉండేవారు .ఆ స్ధితిలో ఆయనలో
రాజవైభవం కనబడేది .ఆయన సుమారుగా ఆరు
అడుగుల ఎత్తు గా ఉండేవారు .ఆయన పొడవాటి చేతులు మోకాళ్లవరకు ఉండేవి .
ఎరుపు రంగుకలిగి సూదిమొనలాంటి ముక్కు
కలిగి ,పెద్దగా లావుకాకుండా ,నీలి రంగు కళ్ళతో
ఉండేవారు .చీకటిలో ఆయన కళ్లు పులి కళ్లు వలె
మెరిసెడివి .ఆ మనోహరదృశ్యాన్ని చూసి పరవశించేదానిని ."ఆమె బాబా వంట చేయునప్పుడు ఉడుకుచున్న గంగాళంలో చేయి
పెట్టి కలపడం ,ఖండయోగం ,ధౌతి ప్రక్రియ మున్నగు అనేకమైన బాబా అద్భుత లీలలు దర్శించింది .తదుపరి అనేకసార్లు బాబా సమాధి
అయ్యేవరకు దర్శించింది .
అనేక శ్రమలకోర్చి ,బెంగళూరులో ఒక సుందరమైన భిక్షామూర్తి గా బాబా విగ్రహాన్ని
నిలిపి ఒక బాబా మందిరాన్ని స్ధాపన 20 -5 -1970 నాడు జరిగినది .ఆమె నిరంతర తపస్సు
పూజా ,ధ్యానాదులు కలిపి ఆమెను బాబా దగ్గరచేశాయి .అంతటి మహా అంకిత మహిళా సాయిభక్తురాలు ,ది 11 -7 -1994 నాడు తన
105 వ ఏట షిర్డిసాయిలో ఐక్యమైనది .
నేడు ఆ భక్తురాలి 26 వ పుణ్యతిథి .
(స్థలాభావంచే చాలా క్లుప్తంగా శివమ్మ తాయి గూర్చి వ్రాయడం జరిగింది .)
షిర్డి సాయబాబా వారి ఆనుగ్రహముచే ,
బెంగళూరు ,రూపేణ అగ్రహారంలో కల శివమ్మతాయి సమాధి ,ఆమె నిర్మించిన బాబా మందిరం 10 -6 -2019 నాడు దర్శించే భాగ్యం
కలిగింది .

No comments:
Post a Comment