Monday, August 10, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 25,26,27 అద్యాయములు


శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి

25,26,27  అద్యాయములు


25వ అద్యాయము


2.  బాబా కు భూత, భవిష్యత్తు, వర్తమానములు తెలియజేయుట గురించి ఎలా పోలుస్తారు?

జవాబు) అరచేతిలో ఉన్న ఉసిరికాయ వలే.


2 . రాసనే తన జీవిత కాలంలో గుర్తించ దగిన పనులు రెండు చేసెను, అవి ఏవి?

జవాబు) పతకములు ఇచ్చుట, బీదలకు అన్న దానము.


3. శ్రీ రామ నవమి ఉత్సవము గురించి ఏ అధ్యాయములో వచ్చినది?

జవాబు) 6 వ అధ్యాయములో.


4. దాముఅన్నాను ఎన్నిసార్లు వ్యాపారనష్టము నుండి తప్పించెను?

జవాబు) రెండు సార్లు.


26వ అద్యాయము


5. కొడుకు అనారోగ్యం తగ్గుట కు మిగిలిన మార్గం ఏది?

జవాబు) యొగుల పాదములపై పడుట.


6 . భావిలో పడి చనిపోవుట ఎక్కుడ ప్రస్తావన వచ్చింది?

జవాబు) అంబడేకర్ నూతిలో పడాలని అనుకొనుట, అక్కల్ కోట మహరాజ్ భక్తుడి కధ.


7. సద్గురు ప్రేమ ఏమి కలుగ  జేయమని ప్రార్ధించాలి?

జవాబు) అసలైన దృష్టి.


8. భక్త పంతు ఎక్కడ దిగి గురువు ను దర్శించెను?

జవాబు) విరాఠ్.


9. దాసగణు హరికధలు పితలే ఎప్పుడు వినెను?

జవాబు) 1910 లో.


10. పూనా నివాసి షిరిడీలో ఎన్ని రోజులు ఉండెను?

జవాబు) రెండు మాసములు.


27వ అద్యాయము


11. ఏ భక్తుడు యొక్క కధ లో 27 వ అధ్యాయం ముగిసేను?

జవాబు) కపర్ధే.


12 . 27 వ అధ్యాయం చివరి కధ లో ఏ సంబంధం తెలియుచున్నది?

జవాబు) గురు, శిష్యుల సంబంధము.


13 . సద్గురు పాదము ఆశ్రయించగానే ఏ ఫలములు లభించును?

జవాబు) త్రిమూర్తుల కు నమస్కరించిన ఫలము.


14. గురువును నమస్కరించిన ఏ విధమైన ఫలితము కలుగును?

జవాబు) త్రిమూర్తులకు ,పరబ్రహ్మ కు నమస్కరించిన ఫలితము.


15. శ్యామా తనకు రామదాసికీ ఏమి చేయుచున్నారని అనుకొనెను?

జవాబు) కయ్యము చేయుచున్నారని.


16. బాబా ఎవరిని ప్రేమించును, ప్రోత్సహించును?

జవాబు) బ్రహ్మ విద్యను అధ్యయనము చేసే వారిని.

No comments:

Post a Comment