Sunday, August 9, 2020

షిర్డీ సాయి బాబా వారు ధరించిన కాఫ్ని బట్ట లీలలు

 *షిర్డీ సాయి బాబా వారు ధరించిన కాఫ్ని బట్ట లీలలు*



 "శ్రీ సాయిబాబా వారి ధరించిన కాఫ్ని లేదా లాంగోట దరిస్తూ వుండేవారు. బాబా వారు వేసుకున్న *కాఫ్ని లేదా లాంగోట* చిరిగిపోయినప్పుడు బాబా వాటిని ఎవ్వరికీ ఇవ్వలేదు, చిరిగిన బట్టలను ధునిలో కాల్చి బూడిద చేసేవారు. శ్రీ సాయిబాబా వారు ధరించిన  బట్టలు కాల్చడానికి అవి చిరిగిపోయి లేదా పాతదిగా వుడేవాటిని కాకుండా కొన్నిసార్లు కొద్దిసేపు వేసుకున్న  బట్టలను దునిలో వేసి కాల్చేవారు.కొన్నిసార్లు బాబా వారు ధరించిన బట్టలు చిరిగితే  చేసి వాటిని కట్టుకుని ఉపయోగించేవారు. శ్రీ సాయి బాబా వారి బట్టలు చిరిగిపోయినప్పుడు తాత్యా పాటిల్ చిరిగిన చిరుగులలో  తన వేళ్ళను పెట్టి మరింత చింపివేసేవారు. శ్రీసాయిబాబా ఆధ్యాత్మిక విషయంలో ఏదైనా భక్తుడిని ఎత్తుకోవాలనుకుంటే, ఆ అదృష్టవంతునికి శ్రీసాయి బాబా వారు తను వేసుకున్న పాత దుస్తులను ప్రసాదంగా ఇచ్చేవారు. శ్రీ సాయిబాబా వేసుకొని ఇచ్చిన బట్టలలో అపారమైన శక్తులను కలిగి ఉండేవి.  ఒకసారి శ్రీ సాయి బాబా తన కాఫ్నిని మహల్సపతికి బహుమతిగా ఇచ్చారు. సాయిబాబా వారి వద్ద నుండి కాఫ్ని పొందిన ఫలితంగా  మరణించే వరకు మహల్సపతి తన కుటుంబంతో జీవనాన్ని సాగిస్తూ, సామాజిక అనుబంధాలను కూడా చూసుకుంటూ సన్యాసిలా మాత్రమే జీవించారు.మరొక సందర్భంలో, సాయి బాబా తన కాఫ్నిని ముక్తరం అనే భక్తునికి ఇచ్చాడు.  కాఫ్ని మురికిగా ఉండటంతో, ముక్తరం దానిని ఉతికి ఆరబెట్టలని ఉద్దేశంతో వాడా (ధర్మశాల) లో ఉంచి ముక్తరం శ్రీసాయిబాబా దర్శనం కోరకు వెళ్లారు.  కాకా సాహెబ్ దీక్షిత్ వాడాలో ఉతికి,ఎండబెట్టడం కొరకు ఉంచిన శ్రీసాయిబాబా కాఫ్ని ఉంచిన చోట వామనరావ్ వెళ్ళిరు.అక్కడ ఉన్న కాఫ్ని నుండి ఒక స్వరం వచ్చింది - "చూడండి, ముక్తరం నన్ను ఇక్కడికి తీసుకువచ్చి తలక్రిందులుగా వేలాడదీశారు."వామన్‌రావు వెంటనే కాఫ్ని తీసుకొని స్వయంగా ధరించారి.  కాఫ్ని ధరించిన తరువాత, వామనరావ్ ద్వారకామయికి వెళ్ళారు.వామనరావు ధరించిన కాఫ్నిని చూసిన శ్రీసాయి బాబాకు కోపం వచ్చింది. కానీ వామన్‌రావు సన్యాసం తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు.  ఈ సంఘటన తర్వాత సమయం వచ్చినప్పుడు ఆధ్యాత్మికత విషయంలో వామన్‌రావు ఒక స్థాయికి చేరుకున్నారు. *అక్టోబర్ 15, 1918, మంగళవారం, శ్రీసాయిబాబా వారు సమాధి చెందిన రోజు* శ్రీసాయిబాబా వారు ఆసంచిన తాకడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదుగు. పాత గుడ్డ సంచిసంచి తెరచి అందులో  ఉన్న పచ్చని కాఫ్ని మరియు పచ్చని టోపి (తలకు కట్టుకునే గుడ్డ) ఉన్నాయి. వాటిని కాశీ రామ్ అనే(దర్జీ) టైలర్ శ్రీసాయిబాబా వారికి ఇచ్చారు. 

 శ్రీసాయిబాబా వాటిని కూడా ధరించారు.కాని తరువాత తెల్లని వస్త్రాలను మాత్రమే ధరించేవారు. ఇతర వస్తువులతో పాటు, ఈ పాత గుడ్డ సంచి కూడా శ్రీసాయిబాబాతో పాటుగా సమాధి లోపల ఉంచబడింది.ఈ రోజుల్లో, శ్రీసాయిబాబావారు ఉన్నప్పుడు ధరించే కాఫ్నిలను షిర్డీలోని దీక్షిత్ వాడలో ఉన్న *"సాయిబాబా మ్యూజియం"* లో ఉంచారు.

No comments:

Post a Comment