Sunday, May 31, 2020
Saturday, May 30, 2020
Friday, May 29, 2020
Thursday, May 28, 2020
సాయి కి రంజాన్ కు ఉన్న సంబంధం
*ఇమాంబాయ్ చోటాఖాన్*
వయస్సు: 65 సం. వైజాపూర్
ఔరంగాబాద్ జిల్లా
*అల్లాగా వచ్చావని చల్లంగా చూస్తావని-* *
*ఓ సాయిబాబా ఇవే మా నమస్సులు* .
క్రీ .శ .1918 లో సాయిబాబా తన దేహత్యాగానికి
నాలుగు నెలల ముందు అనగా జూన్ నెలలో
(1918 సం .జూన్ నెల రంజాన్ మాసము. )
బాబాగారు సమాధి చెందుటకు నాలుగు నెలలు పూర్వము అప్పాబిల్ అను అతనిని రాత్రి 9 గంటల సమయమున 4 కోళ్లను తీసుకొని రమ్మనరి. అతిథులు వచ్చుచున్నారని చెప్పారు. నేను అతిధులు ఎవరై ఉంటారు అని ఆశ్చర్యమొందాను. ఆ రోజు రాత్రి మసీదులు తెరవెనుక మేలుకొని కూర్చుని ఉన్నాను. *తెల్లవారుజామున 2 గంటలకు ఒక పెద్ద నిప్పు గోళం ( Ball of Fire ) ఒక అడుగు వ్యాసము తో ( గోళ్ళము మధ్యరేఖ - Diameter ) మసీదు లోనికి చొచ్చుకొని వచ్చెను* *పడమర దిశలో ఉన్న గూడు వరకు వెళ్ళను. కొంత సేపు కూర్చోనేను. తరువాత మసీదు పైకప్పు వరకు వెళ్ళెను. అక్కడ అది చాలా తుణకలుగా చీలి పోయాను. మసీదు మొత్తం వ్యాపించెను. అక్కడ ఉన్న అన్నింటిని కాంతివంతముగా చేసెను* ఆ వెలుగును తదేకంగా చూడజాలక నా కళ్ళును మూసుకొని, నా మెడను క్రిందకు వంచాను. నాతో కూడా ఉన్న అప్పాబిల్ కూడా అలాగే చేసెను.
*తరువాత బాబాగారు దుని దగ్గరకు వెళ్ళిరి. తన దగ్గర ఉన్న పొట్టికర్ర యొక్క ఒక కొనను వంచి ఉన్న తన మెడ పై ఉంచుకొని పది, పదిహేను నిమిషములు వరకు అరబ్బీ భాషలో దీనినో చెప్పుచుండిరి. బాబా గారు ధుని దగ్గర వెళ్ళగానే కాంతివంతమైన వెలుగు మరగిపోయెను*
ఉదయమున బాబాగారు
అప్పా బిల్ కోళ్లు తెమ్మనిరి. అవి వండబడెను. మండపములో ఉన్న నిప్పు దగ్గర బాబాగారు పోళీలను తయారు చేసిరి.
బడే బాబా కుమారుడు కాసిం తర్వాత వచ్చెను. బాబా గారు అతనికి వండిన ఆహారమును కొంత ఇచ్చారు. ఔరంగాబాదుకు వెళ్లమనిరి. అచ్చట సంసుద్దీన్ చూడుము. ఈ రెండు వందల యాభై రూపాయలు అతనికి ఇవ్వము.
అక్కడ ' మౌలు' 'కవాలి'
' న్యాస్ ' చేయుము అనిరి.
( మౌలు అనగా పైగంబరు గురించి నోటితో పాడుట.
కవాలి అనగా తబలా వాయించుట, న్యాస్ అనగా ఆహారము తయారు చేసి పంచుట )
తరువాత బాబాగారు కాశింను
' *బన్నేమియా ఫకీరు* ' వద్దకు వెళ్లి ఆయనకు పూల హారము వేయుము, మరియు ఆయనతో *నవ్ దిన్ నవ్ తారీఖ్ అల్లా మీనే అప్పా దునియా తెగాయా మార్జీ అల్లాకి*' అని చెప్పుమనిరి.
(అనగా *9వ తారీఖున 9వ నెల అల్లా వెలిగించిన దీపము అల్లా తీసుకొని పోవును* *ఇది అల్లా అనుగ్రహము*)
ఇలా చెప్పుచు బాబా గారు కాశింకు ₹250 సెవెంతి పుష్పముల హారము యిచ్చిరి. కాసిం తనకు ఆ ప్రదేశములు క్రొత్త అనెను. తరువాత బాబా గారు నన్ను
( ఇమామ్ భాయి ) కాసిం తో వెళ్ళమనిరి. మేమిద్దరమూ మరియు కాసిం పనివాడు అమీర్ ను తీసుకొని మూడు గంటలకు మధ్యాహ్నము ఔరంగాబాద్ స్టేషన్ చేరుకున్నాము. ఆ స్టేషన్ కు ఫకీర్ సంసుద్దీన్ వచ్చి అతిథులు ఎవరు ఫకీర్ సాయి వద్ద నుండి వచ్చి ఉన్నారు అని అడిగారు. నేను సంసుద్దీన్ ను ఇంతకు ముందే చూసి ఉన్నాను. నేను కాసిం ఆయన దర్శనం చేసుకున్నాము. *సంసుద్దీన్ గారు మా దగ్గర బాబా ఇంతకు ముందు చెప్పిన వాటిని అక్షరము తప్పకుండా చెప్పారు.* కోటలోని ఆయన గృహమునకు మమ్ములను పిలుచుకొని పోయి భోజనము పెట్టారు. ఆయనకు బాబా గారు ఇచ్చిన రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాను. ఆయన చాలా మందికి ఆహారం పంచిపెట్టారు.( న్యాస్ ) సంసుద్దీన్ కవాలి మరియు మౌలు చేశారు. అవన్నియు రాత్రికి ముగిసెను.
*నాకు బన్నేమియా ఇల్లు తెలియును. మరుసటి రోజు పొద్దున్న అక్కడికి వెళ్ళాము. ఆయన ఒక చేతిని పైకెత్తి ఒక చేతిని కిందకు దించి నిలుచొని యుండెను. అక్కడ ఉన్న అరబ్బులు, మమ్ములను బన్నేమియా వద్దకు వెళ్ళవలదు ఆయన కోపగించు కొనును అనిరి. ఒక గంట సేపు తరువాత ధైర్యం పుంజుకుని నేను బాబా గారు ఇచ్చిన పుష్ప హారమును ఆయన మెడలో వేశాను. తరువాత పైకి ఎత్తిన చేయిని క్రిందకు దించరి. తరువాత బన్నేమియాతో చెప్పమని బాబాగారు పలికిన పలుకులను చెప్పాను. బన్నేమియాగారు ఆకాశము వైపు చూశారు. ఆయన కళ్ళ వెంబడి కన్నీరు కారెను* ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చాము నాలుగు నెలలు తరువాత బాబా గారు
మహాసమాధి చెందారు. ఆయన మహా సమాధి చెందిన రోజు దసరా తొమ్మిదవ రోజు 9వ నెల ( సెప్టెంబర్ ) . మేము రంజాన్ నెలలో ఔరంగాబాద్ వెళ్లి పగలు ఉపవాసం చేసి రాత్రి భుజించాము.
*ఓం శ్రీ సాయి సర్వమత సమ్మతాయ నమః* .
శ్రీ సాయిబాబా అన్ని మతాలకు సమ్మతమైన
మార్గంలో నడిచారు .ఇవ్వాళ ప్రపంచం అంతటా
అన్ని మతాలలోను సాయిభక్తులున్నారు .ఈ పర్వదినాన బాబాను స్మరణ చేయవలెను .
అధ్యాయం 40
*శ్రీ సాయినాథుని భక్తుల మధుర స్మృతులు*
మూలం: *పూజ్యశ్రీ బి వి నరసింహ స్వామీజీ*
తెలుగు సేత:
*పెండ్యాల శ్రీనివాస్*
సద్గురు సేవ ముక్తికి మార్గం
మసీదులో శ్రీసాయిబాబా వారికి సేవ చేసే విషయంలో కొందరు భక్తులు పోటీ పదుతుండే వారు. నిత్యం శ్రీసాయి వెంటే ఉంటుండేవారు. *సద్గురు సేవ ముక్తికి మార్గం* అని నమ్మిన నిజమైన భక్తాగ్రేసరులు వారు అందరూ కూడా..... అందువలన బాబాకు సేవ చేసే విషయంలో ఒక చిన్న అవకాశం వచ్చిన శ్రద్ధ,భక్తితో మనస్ఫూర్తిగా ఆ సేవను పూర్తి అంకితభావంతో చేసేస్తుండే వారు. నిజముగా చెప్పాలి అంటే మన ఎవరికి కూడా భగవంతుడు ఎలా ఉంటారో అనే విషయం తెలియదు.మన *శ్రీ సాయినాథుడు ఎలా ఉంటారో మన కన్నులకు మాత్రమే కాదు..... మన హృదయంతరాలంకి కూడా తెలుసు.....*.అలానే అక్కడ ఉన్నవారి దృష్టిలో శ్రీసాయినాథుడే అనంత పరబ్రహ్మస్వరూపం మైనా భగవంతుడు. శ్రీసాయిబాబాకు సేవ చేసే విషయంలో భక్తుల మధ్య వుండే ఈపోటీ ఓకొక్కసారి మాటమాట పెరిగి గొడవలకు, పంతానికి,పట్టింపులు దారితీసేవి.ఇలా జరుగుతున్న సమయంలో బాబా మధ్యవర్తిత్వంతో చక్కని మాటలు చెప్పి బోధించడంతో అవి తొలగిపోతుండేవి.
*అలాంటి కథను ఇప్పుడు ఒక్కసారి చదువుకుందాం:-*
అణ్ణాచించణీకర్ (దామోదర్ ఘనశ్యామ్) శ్రీసాయిబాబా వారి భక్తుడు.ఈయన మొండివాడు,మొరటి మనిషిలా ప్రవర్తిస్తునదేవారు.కానీ ఈయన మనసు సున్నితమైనది.ఇతనికి కల్లాకపటం తెలియదు.మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా మనసులో ఎంవుందో అదే బయటికి మాట్లాడే గుణం కలవాడు.ఎవరినీ లెక్కపెట్టే తత్త్వం ఆయనలో లేదు. పైగా ఏదైనా పట్టింపు, పంతం, గొడవైనా...... సరే అక్కడికక్కడే తేల్చుకొని పోవాల్సిందే తప్ప దాన్ని వాయిదా వేసేవారు కాదు.గుంటనక్క వేషాలు తెలియవు.నిజమైన భక్తి ఒక్కటే అతనికి తెలుసు. శ్రీసాయిబాబా వారికి అణ్ణాలో వుండే భక్తి కన్న అతనిలోనే మొండితనమే ఎక్కువగా నచ్చేటట్లు ఉండేది. అందువలన అతనిని ఎక్కువగా దగ్గరికి చేరదీసే వారు.
ఒక సందర్భంలో మసీదులో వేణుబాయి కౌజల్గి (మావిశీబాయి) అనే ముసలి వితంతువు కూడా ఉండేవారు. ఆమెను బాబా "అమ్మా" అని పిలిచేవారు. ఇతర భక్తులు మాత్రం ఆమెను మావిశీబాయి అనే పిలిచేవారు.మావిశీబాయిది స్వచ్ఛమైన హృదయం. ఒకరోజు అణ్ణా,మావిశీబాయి బాబాసేవలో పూర్తిగా నిమగ్నులై అణ్ణా బాబాకు కాళ్లు వత్తుతున్నాడు. మావిశీబాయి బాబా నడుమును మర్ధనం చేస్తున్నప్పుడు ఒకసారి అణ్ణాముఖం మావిశీబాయి ముందుకు వెళ్ళింది.
ఆమె వెంటనే "బాబా! ఈ అణ్ణా చూడు. నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు. వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు"అంది మావిశీబాయి. అణ్ణా గురించి మనకు తెలిసిందే ఇంకా చెప్పేదేముంది. ఆమె మాటలు వింటూనే కోపంతో లేచి. "నేనా బుద్ధి లేని వాన్ని ? నేనా నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకున్ననా......? నా జోలికొచ్చావో.." అంటూ కోపంతో గొడవ ధిగబోయారు. మసీదులో ఉన్న వారూ అందరూ వాళ్ళిద్దరి గొడవని చూసి నవ్వుకుంటున్నారు. బాబా కూడా వారి మాటల మధ్యలో మాటలు కలిపి. శ్రీసాయిబాబా ఇలా అన్నారు. *"అన్నా ! ఎందుకంత గొడవ చేస్తున్నావ్ ? ఆమె నీ తల్లివంటిది. తల్లిని కొడుకు ముద్దుపెట్టుకుంటే తప్పేముంది ?"*
శ్రీ దత్తాత్రేయ అపరాధ క్షమాపణ స్రోత్రం
1.రస జ్ఞావశా తారకం స్వాదు లభ్యమ్
గృహీతం కదా చిన్న తే నామ దత్త|
క్షమ స్వాపరాధం,క్షమ స్వాపరాధం,
క్షమ స్వాపరాధం, ప్రభో క్లిన్న చిత్త||
ఓ దత్తాత్రేయ! మానసిక,వాచక,శారీరక రూపములలో నేను చేసిన పాపముల నుంచి రక్షింపుము.ఓ దయా జలధి నీ దయార్ద్ర హృదయంతో నేను చేసిన పాపములను క్షమించుము,క్షమించుము,క్షమించుము.
2.వియోన్యస్తరే దైవ దార్ధ్యా విభోప్రాగ్
గృహీతం కదాచిన్న తే నామ దత్త|
క్షమ స్వాపరాధం,క్షమ స్వాపరాధం,
క్షమ స్వాపరాధం, ప్రభో క్లిన్న చిత్త||
ఓ దత్తాత్రేయ!నా పూర్వజన్మలో నీ నామస్మరణం చేయలేక పోయాను.సర్వజ్ఞుడు,సర్వకారకుడు,అయిన .ఓ దయా జలధి నీ దయార్ద్ర హృదయంతో నేను చేసిన పాపములను క్షమించుము,క్షమించుము,క్షమించుము.
3.మయా మాతృగర్భ స్థితి ప్రాప్తకష్టాత్
గృహీతం కదాచిన్న తే నామ దత్త|
క్షమ స్వాపరాధం,క్షమ స్వాపరాధం,
క్షమ స్వాపరాధం, ప్రభో క్లిన్న చిత్త||
మాతృగర్భంలో ఈ మాయా ప్రపంచంలో మాయ చే బంధింపబడి నిన్ను తెలుసుకోనలేక పోయాను..ఓ దయా జలధి నీ దయార్ద్ర హృదయంతో నేను చేసిన పాపములను క్షమించుము,క్షమించుము,క్షమించుము.
4.మయా జాతమాత్రేణ సoమోహితేన
గృహీతం కదా చిన్న తే నామ దత్త|
క్షమ స్వాపరాధం,క్షమ స్వాపరాధం,
క్షమ స్వాపరాధం, ప్రభో క్లిన్న చిత్త||
జన్మించిన తరువాత నా అజ్ఞానంతో నీ నామస్మరణం చేయలేకపోయాను..ఓ దయా జలధి నీ దయార్ద్ర హృదయంతో నేను చేసిన పాపములను క్షమించుము,క్షమించుము,క్షమించుము.
5.మయా క్రీడ నాసక్తచిత్తేన బాల్యే
గృహీతం కదాచిన్న తే నామ దత్త|
క్షమ స్వాపరాధం,క్షమ స్వాపరాధం,
క్షమ స్వాపరాధం, ప్రభో క్లిన్న చిత్త||
ఓ కరుణా హృదయా!బాల్యము వలన క్రీడా ఆసక్తి చిత్తుడనై నీ నామస్మరణ చేయలేక పోయిన నన్ను ని కృపతో రక్షించి .ఓ దయా జలధి! నీ దయార్ద్ర హృదయంతో నేను చేసిన పాపములను క్షమించుము,క్షమించుము,క్షమించుము.
6.మయా యౌవనే జ్ఞానతో భోగతోషా
గృహీతం కదా చిన్న తే నామ దత్త|
క్షమ స్వాపరాధం,క్షమ స్వాపరాధం,
క్షమ స్వాపరాధం, ప్రభో క్లిన్న చిత్త||
ఓ దయాద్ర హృదయా!యవ్వనంలో విషయ వాసనల మీద ఆసక్తితో నీ నామస్మరణం చేయలేక పశ్చాత్తాపం చింతనతో వేడుతున్నాను..ఓ దయా జలధి! నీ దయార్ద్ర హృదయంతో నేను చేసిన పాపములను క్షమించుము,క్షమించుము,క్షమించుము.
7.మయా స్థావిరే నిఘ్న సర్వేంద్రియేణ
గృహీతం కదా చిన్న తే నామ దత్త|
క్షమ స్వాపరాధం,క్షమ స్వాపరాధం,
క్షమ స్వాపరాధం, ప్రభో క్లిన్న చిత్త||
ఓ కరుణా హృదయా! వృద్దాప్యం,అనారోగ్యం, అశక్తి ,దయనీయ స్థితి వలన నీ నామస్మరణ చేయలేదు.ఓ దయా జలధి నీ దయార్ద్ర హృదయంతో నేను చేసిన పాపములను క్షమించుము,క్షమించుము,క్షమించుము.
.
8.హృషీకేశ మే వాజ్మనః కాయ జాతం
హరే2 జ్ఞానతో జ్ఞానతో విశ్వ సాక్షిన్ |
క్షమ స్వాపరాధం,క్షమ స్వాపరాధం,
క్షమ స్వాపరాధం, ప్రభో క్లిన్న చిత్త||
ఓ కృపా సింధూ!ఎన్నో జన్మలనుంచి నేను చేసిన పాపముల నుంచి నీవు తప్ప రక్షించు వారు ఎవరూ లేరు.ఓ దయా జలధి నీ దయార్ద్ర హృదయంతో నేను చేసిన పాపములను క్షమించుము,క్షమించుము,క్షమించుము.
9.స్మృ తో ధ్యాత అవాహితో2 స్యర్చితోనో
న గీతః స్తుతో వందితో నో న జప్త: |
క్షమ స్వాపరాధం,క్షమ స్వాపరాధం,
క్షమ స్వాపరాధం, ప్రభో క్లిన చిత్త.
ఓ దత్తాత్రేయ!నీ నామ స్మరణం చేయక,నిన్ను పూజించక,నీ లీలలు గానం చేయక,నీ స్తోత్రములు పఠిoచక వ్యర్ధంగా గడిపిన నేను పశ్చాత్తాపం తో వేడుకుంటున్నాను.ఓ దయా జలధి నీ దయార్ద్ర హృదయంతో నేను చేసిన పాపములను క్షమించుము,క్షమించుము,క్షమించుము.
10 .దేహిమే పుత్ర సౌభాగ్యం దేహి మే సుఖ సంపదం |
వాంచా సిద్ది చ మే దేహి విద్యాం దేహి యశో ధనమ్||
ఓ దత్త గురు!అన్ని శాస్త్రాల సారం అయిన ఈ స్త్రోత్రం నీ శిష్యుడు వాసుదేవానంద సరస్వతి చే విరచితం..నీ కరుణా పూరితమైన అనుగ్రహం దీనిని పఠిoచిన వారి మీద వర్షించి, వారి పాపం లను తొలగించి ,మీ దయార్ద్ర హృదయం తో సచ్చిదానందస్వరూపం అయిన మీ మీద నా మనస్సు నిలుపునట్లు అనుగ్రహించి , కరుణతో రక్షించు.
తెలుగు లోకి అనువదించినది శ్రీ రాజ్యలక్ష్మి శ్రీ నివాస్ బోడ్డుపల్లి.
🌺🌹🌻🍀🌸🌼💐🌷🌹🌺🌼🌻🌺🌹
పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం.
పిఠాపురం,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం.
దత్తాత్రేయస్వామి యొక్క అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన పుణ్యస్థలం పిఠాపురం.🌹
లోకకల్యార్థమై భగవద్రూపమైన అతీంద్రియ పరమాత్మ శక్తి దుష్టశిక్షణకు, సత్ పదార్థ రక్షణకు అవతారాలు స్వీకరిస్తుంది. అట్టి అవతారాలు స్థూలంగా మూడురకాలని చెప్పవచ్చు. అవి అంశావతారాలు, పూర్ణావతారాలు, జ్ఞానావతారాలు. ఇందులో దక్షిణామూర్తి, హయగ్రీవుడు, దత్తాత్రేయుడు అనేవారు జ్ఞానావతారలని శాస్త్రాలు చెప్తున్నాయి.
దత్తాత్రేయుడు గురుస్వరూరం, మానవునిలో అంతర్లీనంగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడమే దత్తాత్రేయుని లక్ష్యం. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానాభివృద్ధికి కావలసిన సాధనామార్గాన్ని సాధకుడు అనుసరించి ముక్తిసోపానాన్ని అధిరోహిస్తాడు. దత్తాత్రేయుడు స్మర్తృగామి అనగా సాధకుడు మనస్సులో తలచిన వెంటనే వచ్చి ఆదుకుని, ఆపదలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే దయాస్వరూపుడు.
కలియుగంలో ప్రజలు ధర్మాన్ని విడచి, ఆచారహీనులై వ్యసనములకు బానిసలై శరీరసుఖమే పరమార్థంగా భావిస్తూ పతనమైపోతున్న దశలో భగీరథుడు పితృవిమోచనమునకై సురగంగను భూమిమీదకు తెచ్చినట్లుగా దత్తాత్రేయుడు తన అవతారమైన శ్రీ పాదవల్లభులను భూమిమీద అవతరింపజేసారు.
శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం
ఆంధ్రదేశంలో గోదావరి జిల్లా పీఠికాపురంలో 1320 – 1350 మధ్యకాలంలో శ్రీ పాదవల్లభులు జన్మించినట్లుగా ఆధారాలున్నాయి.పిఠాపురం దత్తక్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం, శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం"గా ఏర్పాటు చేయబడింది, శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు. మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు ఉన్నాయి.
పిఠాపురంలో రాజశర్మ సుమతి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. రాజశర్మ ఆపస్తంబగోత్రీకుడు, ధర్మకార్యతత్పరుడు. అతిథి అభ్యాగతులకు సేవచేసే స్వభావం కలవాడు. ఆయన ధర్మపత్ని సుమతి కూడా అన్నివిధాల తనభర్తకు అనుకూలవతి. ఇరువురూ దత్తాత్రేయుని భక్తులే.
ఇట్టి పుణ్యదంపతుల భక్తి ప్రపత్తులకు ప్రసన్నుడైన దత్తాత్రేయుడు ఒక అమావాస్య రోజున అనగా రాజశర్మ పితృకర్మచేయవలసి వచ్చిన రోజున అవధూతవేషములో వచ్చి భిక్షను అడిగాడు. బ్రాహ్మణ భోజనం పూర్తికాకుండా సాధువులకు భిక్షపెట్టే ఆచారము లేకపోయినా సుమతి ఆ అవధూతకు భిక్షను ఇచ్చుటచే, సంతోషించిన దత్తాత్రేయుడు తన నిజరూపాన్ని ధరించి సుమతిని ఏదైనా వరం కోరుకోమని ఆదేశించాడు.
దత్తాత్రేయ దర్శనంతో ఆనందసాగరంలో మునిగిన ఆమె దత్తుని అనేక విధాలుగా స్తోత్రం చేసి తనకు చాలామంది పుత్రులు కలిగి చనిపోయారని, మిగిలిన ఇద్దరు పుత్రులలో ఒకరు గ్రుడ్డివాడు, మరియొకడు కుంటివాడని, అందువలన తనకు యోగ్యుడైన దత్తుని వంటి కుమారుని అనుగ్రహించమని ప్రార్థించింది. దత్తాత్రేయుడు ప్రసన్నుడై తథాస్తు అని అనుగ్రహించాడు.
శ్రీపాదునికి 16 సంవత్సరాల వయస్సు వచ్చింది. తల్లిదండ్రులు వివాహం చేయాలని సంకల్పించారు. తన తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గ్రహించిన శ్రీపాదుడు తండ్రిని సమీపించి, తనకు వైరాగ్యకన్యయందు మాత్రమే మనస్సు లగ్నమైందని, ఆమెతప్ప మిగిలిన స్త్రీలందరూ తనకు తల్లితో సమానమని, కాన విరక్తి స్తీని తెచ్చినచో స్వీకరించెదనని తెలియపరిచాడు. విరక్తిని సంపాదించడానికి యోగస్త్రీని స్వీకరించాలి. యోగానికి శ్రీ అనే పేరుంది కాబట్టి యోగవల్లభుడైన శ్రీపాదునికి శ్రీ వల్లభుడు అనే పేరు సార్థకమైంది.
చివరకు తల్లిందండ్రులను ఓదార్చి అమృతమైన చూపులతో తన సోదరులకు గల గ్రుడ్డితనాన్ని–కుంటితనాన్ని పోగొట్టి వారిని సంతోషపెట్టాడు. వారిరువురు కృతజ్ఞతతో శ్రీపాదుని పాదములు తాకగా వారు వేదశాస్త్రముల యందు పండితులైనారు. అప్పటినుండి వారందరూ శ్రీపాదవారై వేదశాస్త్రములయందు సంపూర్ణ పాండిత్యాన్ని సంపాదించి ప్రజాగౌరవాన్ని పొందసాగారు.
తల్లిదండ్రుల అనుమతితో అచటి నుండి ఉత్తర ముంఖంగా బయలుదేరి కాశీక్షేత్రాన్ని సందర్శించి, అచటి నుండి బదరికాశ్రమాన్ని చేరి నరనారాయణ దర్శనం చేసుకుని భక్తులకు దత్తదీక్షను అనుగ్రహించారు. నెమ్మదిగా పశ్చిమ సముద్రతీరమందున్న గోకర్ణ క్షేత్రాన్ని సందర్శించి అచటి నుండి కర్ణాటక రాష్ట్రంలోని కురుపురంలో కొంతకాలం భక్తులను అనుగ్రహించారు.
తన భక్తురాలికిచ్చిన వరం ప్రకారం శ్రీపాదవల్లభులు మహారాష్ట్రమునందలి కరంజియా గ్రామంలో నృసింహసరస్వతిగా అవతరించారు. వీరు మహారాష్ట్ర దేశంలో సంచారం చేస్తూ కృష్ణపంచ గంగా సంగమమైన సరసోబావాడి అనే గ్రామంలో నివసించి అనేకమంది భక్తులను రక్షించి దత్తదీక్షను అనుగ్రహించారు. అచటి భక్తులయందలి వాత్సల్యంతో నిర్గుణపాదుకలు ప్రతిష్ఠచేసి సాంగ్లీజిల్లాలోని ఔదుంబర క్షేత్రంలో కొంతకాలం నివాసముండి మరికొంతకాలమైన తరువాత సమీపంలో గాణుగాగ్రామంలో గురుపాదుకలను ప్రతిష్ఠచేసారు. కొంతకాలం దేశసంచారం చేస్తూ చివరకు శ్రీ శైలఅడవుల యందలి కదళీవనంలో అంతర్థానమయ్యారని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది.
అప్పటినుండి పీఠికాపురం, కురుపురి, కరంజియా, సరసోబావాడి, గాణగాపురం అనబడే అయిదు గ్రామాలు దత్తక్షేత్రాలుగా ప్రసిద్ధిపొందాయి. వీటిలో పీఠికాపురం ప్రధాన దత్తక్షేత్రంగా విరాజిల్లుతోంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఊదీ యొక్క అమోఘమైన శక్తి*"..!!
బాబా వారి ఊదీ యొక్క అమోఘమైన శక్తి గురించి ఈరోజు ఒక అధ్భుతమయిన సంఘటన తెలుసుకుందాము.
శ్రీమూలే నాసిక్ లో ప్రముఖ న్యాయవాది. ఆయన, ఆయన భార్య ఇద్దరూ బాబా భక్తులు. మూలే గారు ఎన్నో ఆధ్యాత్మిక సాంప్రదాయాలను పాటించే వారు. అంతే కాదు ధ్యానం, యోగా కూడా చేసేవారు. ఎక్కువ సార్లు ఉపవాసాలు ఉంటూ ఉండేవారు. ఆయన ఉపవాసాలు చాలా కఠినంగా ఉండేవి. ఆయన రోజుల తరబడి, వారాలు, ఒక్కొక్క సారి నెలలపాటు ఉపవాసాలు ఉండేవారు.
ఆయన పాలు మాత్రమే తీసు కుంటూ, ఆయా కాలాలలో దొరికే పండ్లను మాత్రమే చాలా సార్లు ఆహారంగా తీసుకునే వారు. అయినప్పటికీ ఆయన చాలా చురుకుగాను, బలం గాను ఉండేవారు. ఆయన శరీరం చుట్టూ ప్రకాశవంత మయిన వెలుగు (ఆరా) ప్రసరిస్తూ ఉండేది. ఆయన వదనం ప్రకాశవంతమయిన వెలుగుతో కాంతవంతంగా ఉండేది.
ఒకరోజు ఆయన ఇంటిలోకి ఒక సర్పం ప్రవేశించింది. ఆ సమయంలో ఇంటిలో ఆయన భార్య ఒక్కతే ఉంది. మూలేగారు కోర్టుకు వెళ్ళారు. ఇంటిలో మగవారెవరూ లేరు. మూలేగారి భార్య సర్పాన్ని చూసి, మనఃస్ఫూర్తిగా ఎంతో వేగంగా బాబాని ప్రార్ధించ సాగింది. ఆ సర్పం గదిలో ఒక మూలకు వెళ్ళి చుట్టచుట్టుకుని కూర్చుంది. మూలేగారి భార్య ధైర్యాన్ని కూడదీసుకుని పూజ గదిలోకి వెళ్ళి ఊదీ ఉన్న చిన్న పెట్టెను తీసుకుని వచ్చింది.
ఆమె బాబాకు శిరసు వంచి నమస్కరించు కుని సర్పం చుట్ట చుట్టుకుని పడుకున్న చోటకి వెళ్ళింది. ఆ సర్పంతో “ఓ! నాగదేవతా! ఇది బాబా ఊదీ. నువ్వు ఈ ఊదీని గౌరవిస్తావని నేను అనుకుంటున్నాను. నేను ఈ ఊదీతో లక్ష్మణ రేఖను గీస్తున్నాను. నువ్వు ఈ గీత దాటి రావటానికి వీల్లేదు” ఇలా అని ఆమె ఊదీతో ఒక పొడవాటి రేఖను గీసింది. ఆశ్చర్యకరంగా ఆ సర్పం ఊదీ రేఖను దాటి బయటకురాలేదు.
ఆ తరువాత ఆమె ఇంటిలోకి వెళ్ళి ప్రశాంతంగా తన పనులు తాను చేసుకో సాగింది. మూలేగారు కోర్టు నుంచి వచ్ఛిన తరువత మంత్రం చదివి ఆసర్పాన్ని ఇంటి బయటకు పోయేలా చేశారు. “ఊదీ యొక్క శక్తిని మాటలలో వర్ణించలేము.” ఊదీని మనం నొసట ధరించినా, లేక నోటిలో వేసుకున్నా దాని ప్రభావం మనలోని అహంకారమనే సర్పం యొక్క కోరలను పెరికి వేస్తుంది. ఇంకా ముఖ్యమయిన విశేషమేమిటంటే అది మనలోని కుండలినీ శక్తిని జాగృతం చేసి ఆత్మానుభూతిని కలిగిస్తుంది.
శిరిడీ సాయి బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు
శిరిడీ సాయి బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు:
1.మొదట 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమైన సంవత్సరం - 1854(వేప చెట్టు - ప్రస్తుత గురుస్థానం)
షుమారు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి శిరిడీ చేరుకుని దర్శనమిచ్చిన స్థానం ఖండోబా ఆలయం మఱ్ఱి చెట్టు దగ్గర
2.శరీరం విడిచి మూడు రోజుల తర్వాత గదాధరుని (శ్రీ రామకృష్ణ పరమహంస) అవతారకార్యాన్ని స్వీకరించి తిరిగి పునరుజ్జీవితులైన సంవత్సరం - Aug 18,1886
శిరిడీలో దర్శనీయ స్థలాలు:
1.గురు స్థానం(వేప చెట్టు)
2.ఖండోబా మందిరం
3.ద్వారకామాయి(మసీదు)
4.చావడి
5.సమాధి మందిరం
6.లెండీ వనం
7.నంద దీపం
8.గణపతి,శని,మహదేవుల ఆలయాలు(సమాధి మందిరానికి ఎడమప్రక్క)
9.కర్ణ కానీఫనాధుని ఆలయం.
10.విఠల్ మందిరం (కర్ణ కానిఫా ఆలయం దగ్గర)
.11.అష్టలక్ష్మీ మందిరం ( పంజాబీ హోటల్ ఎదురుగా)
12.తాజింఖాన్ బాబా గారి దర్గా.
13.బడే బాబా గారి దర్గా (చావడి ఎదురుగా)
చోటే బాబా గారి సమాధి (ఖండోబా మందిరంలోని మఱ్ఱి చెట్టు ప్రక్కన) ,మోటే బాబా గారి సమాధి (Gate no: 4 దగ్గర),తాత్యాకోతే పాటిల్ సమాధి,అయ్యర్ సమాధి,అబ్ధుల్ బాబా సమాధి ,నానావళి గారి సమాధి (ఊదీ ప్రసాదం పంచే దగ్గర), అమీదాస్ భవాని మెహతా గారి సమాధి,ముక్తరాం గారి సమాధి(దత్త మందిరం వెనుక).
బాబాగారు బిక్ష గ్రహించిన ఇళ్లు:
1.సఖరామ్ పాటిల్
2.వామనరావ్ గోండ్ఖర్
(వీరిరువురి ఇళ్లు చావడికి దగ్గరలో ఇప్పుడు వెన్నెల హోటల్ ఉన్న దగ్గర ఎదురెదురుగా ఉండేవి)
3.బయ్యాజి అప్పాకోతే పాటిల్
4.బాయిజాబాయి గణపతికోతే పాటిల్
(వీరిరువురి ఇళ్లు వెన్నెల హోటల్ దాటగానే ఎడమచేతివైపు ఉన్న వీధిలోకి ప్రవేశించి 20 అడుగులు వేయగానే తులసి కోట లాంటి దానిపై పాదుకలు ముద్రించి ఉంటాయి - -పక్కపక్క ఇళ్లు)
5.నందరామ్ మార్వాడీ సంఖ్లేచా.
(ద్వారకామాయి దగ్గర)
భక్తులు:
1.మహల్సాపతి.(వీరి సమాధి తాజింఖాన్ బాబాగారి దర్గా దగ్గర ఉంది)
2.చాంద్ పాటిల్
3.తత్యాకోతే పాటిల్
4.మాధవరావ్ దేశ్ పాండే /శ్యామా
5.నానా సాహెబ్ చందోర్కర్.
6.అన్నా సాహెబ్ దబోల్కర్ /హేమాడ్ పంత్
7.దాసగణు మహరాజ్
8.ఉపాసని బాబా
9.లక్ష్మీబాయి షిండే(ద్వారకామాయి ఎదురుసందులో 30 అడుగుల దూరంలో ఎడమచేతి వైపు)
10.అన్నాసాహెభ్ దభోల్కర్
11.భాగోజీ
12.కాకా సాహెబ్ దీక్షిత్ / హరి సీతారాం
13.దాదా సాహెబ్ ఖాపర్డే
14.అబ్ధుల్లా జాన్
15.బూటీ
16.బడే బాబా
ఓం సాయి రామ్ ....ఓం సాయి రామ్ ....ఓం సాయి రామ్ ....ఓం సాయి రామ్ ....
సాయి సాహిత్యములో ఎందరి గాథలో వున్నాయి .వాటిలో కొందరి భక్తుల పేర్లు తరచుగా వినిపిస్తుంటాయి
సాయి సాహిత్యములో ఎందరి గాథలో వున్నాయి .వాటిలో కొందరి భక్తుల పేర్లు తరచుగా
వినిపిస్తుంటాయి .ఉదాహరణకి ,మాధవరావ్
దేశపాండే ,కాకాసాబ్ దీక్షిత్ ,హేమాడ్ పంత్ ,
దాసగణు మున్నగు వారు .కొందరి పేర్లు అయితే
ఒక్కసారే వస్తాయి .ఉదాహరణకి చోల్కర్ ను
తీసుకొనవచ్చును .చోల్కరు కథ ఒక అధ్యాయములో కనిపించినా మన మనసులో
చిరస్థాయిగా ఉండిపోతాడు .అందరికి నచ్చి ,
అందరూ మెచ్చుకొన్న సుగుణాలలో ఒకటి
కర్తవ్యపాలన .అతడు తాను నిర్వర్తించదలిచిన
కర్తవ్యమును నిర్వర్తించాడు .పరీక్షకు చదివాడు .
పరీక్షకు చదవకుండా ,సరిగా రాయకుండా గాలిలో
దీపంపెట్టి ,సాయబాబా ! నీ మహిమను చూపు !
నన్ను ఉత్తీర్ణుగా చేయి అని కోరలేదు .ఏ వ్యక్తి
అయినా తన విజయానికి తనకు తానై మొదట శ్రమించాలి .తరువాతే దైవము ,గురువుల ప్రమేయం వస్తుంది .చోల్కరు అందరినీ ,చివరకి
సాయిబాబాను ఆనందపరిచిన విషయము మొక్కు తీర్చడం .చోల్కరు చక్కర ( పంచదార )
ఉన్న ఏ పదార్ధాన్నీ సేవించేవాడు కాదు .చక్కర
లేని తేనీరు తాగసాగాడు .ఈ సంగతి బాబా గ్రహించాడు .చక్కర ఎక్కువగా వేసి ,తేనీరుని
పూజ్య శ్రీ బి.వి.నరసింహస్వామి జీవిత చరిత్ర
1. *"గురుదేవుని పూర్వజీవితం*"
*జననము-బాల్యము*
తమిళనాడు రాష్ట్రంలోని ఎరోడ్ జిల్లాలోని *భవాని* ఎన్నో శతాబ్దాలుగా గొప్ప పుణ్య క్షేత్రంగా పేరుగాంచింది. దక్షిణ భారత దేశంలోని వేలాదిమంది యాత్రికులు సంవత్సరం పొడవునా భవాని దర్శించి అక్కడ కొలువై ఉన్న సంగమేశ్వర - భవాని మాతల అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. ఈ పట్టణం కావేరి, భవాని మరియు గుప్తగామిని అనే 3 నదుల సంగమం వద్ద నెలకొని ఉండడంతో దీనిని తమిళనాడు యొక్క త్రివేణి సంగమం అని పిలుస్తుంటారు.
శ్రీవత్స గోత్రీకులైన వెంకటగిరి అయ్యర్, అంగాచి అమ్మాళ్ అనే పుణ్య బ్రాహ్మణ దంపతులు పుత్ర సంతనం పొందాలనే కోరికతో ప్రతీ రోజూ ఈ సంగమేశ్వర - భవానీ మాతలను అర్చిస్తూ ఉండేవారు. అంగాచి అమ్మాళ్ కు సంగమేశ్వరుని యందు గల అనన్య భక్తివిశ్వాసాల ఫలితంగా ఒకసారి ఒక సాధువు ఆమె ఇంటికి వేంచేసారు. ఆమె కోరికను గ్రహించిన ఆ సాధువు ఆమెను షోలింగర్లో కొలువై ఉన్న నరసింహ స్వామిని దర్శించమని సూచించారు. ఆ నరసింహస్వామి ఆమెకు తప్పక కొడుకును ప్రసాదిస్తారని ఆశీర్వదించి ఆ సాధువు వెళ్ళిపోయారు.
షోలింగర్లోని నరసింహ స్వామిని దర్శించి వచ్చిన వెంటనే ఆ పుణ్య స్త్రీ కోరిక నెరవేరింది. అంగాచి అమ్మాళ్ గర్భం ధరించి పుత్రోదయానికై ఆ దంపతులు ఆసక్తిగా ఎదురు చూడసాగారు. 1874వ సంవత్సరం ఆగస్టు 21వ తేదీన శ్రావణ పంచమి శుభ దినాన సూర్యాస్తమయ సమయంలో గోధూళి వేళ 6.15 నిమిషాలకు ఆ పతివ్రత మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ జననం కూడా ఎంతో చిత్రమైన పరిస్థితుల మధ్య జరిగింది. అంగాచి అమ్మాళ్ తన ఇంట్లో పెరట్లోని గొడ్లపాక వైపు నడిచి వెళుతుండగా అకస్మాత్తుగా ఏ ముందస్తు సూచన లేనట్లుగా ఎవరి సహాయం లేకుండానే అక్కడికక్కడే ప్రసవం అయి పోయింది. తదనంతర కాలంలో నరసింహ స్వామీజీగా వేనోళ్ళ కొనియాడబడిన శిశువు జన్మించాడు.
ఆయన జననం జరిగిన అరుదైన, అద్భుతమైన తీరు బహుశా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేదిగా ఉంది. అది ఆయన దృఢమైన, పటిష్ఠమైన మనోవైఖరిని శక్తిని తెలియ చేస్తుంది. ఆయన ఈ విశాల ప్రపంచంలో అవిశ్రాంతంగా పర్యటించ నున్నారనడానికి సంకేతమా అన్నట్లుగా ఆరుబయట జన్మించారు. ధరణీమాత ఒడిలో జన్మించారు. బంధరహితుడైన ఆయన ఆత్మను వినీలాకాశం చిరునవ్వుతో పలకరించింది. అస్తమించే సూర్యుని కిరణాలు చెట్ల మధ్య నుంచి విస్తరించి వింతైన, సుందరమైన రీతిలో పచ్చని పచ్చికను ప్రకాశవంతం చేసాయి. పొడవాటి కొబ్బరి చెట్లు తమ ఆకులను మృదువుగా ఊపుతూ నాట్యం చేస్తుండగా ఆ ప్రక్కనే ప్రవహించే భవాని నది మంద్ర స్థాయిలో తన ప్రవాహంతో గానం చేసింది. ఆ చెట్ల ఆకులు ఆ గానానికి పరవశించి నర్తిస్తున్నాయా అన్నట్లుంది.
ఆ శిశువు భగవంతుడు ప్రసాదించిన వరంగా ఆ దంపతులు భావించారు. ఆయనను తులాభారం వేసి ఆ బరువు వెండి, బంగారాలను షోలింగర్ నరసింహ స్వామికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించారు. తండ్రి ఆయనకు రామనాథన్ అని పేరు పెట్టాలనుకున్నారు. కారణం ఆ శిశువు శ్రీ రామచంద్రుడు జన్మించిన నక్షత్రంలోనే జన్మించాడు. కానీ అంగాచి అమ్మాళ్ కోరిక మేరకు *నరసింహస్వామి* అని నామకరణం చేసారు. శ్రీరామచంద్రుని వలే ఆయన కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదంలో జన్మించారు. ఆది శంకరాచార్య, భగవాన్ రమణ మహర్షి కూడా ఇదే నక్షత్రంలో జన్మించడం విశేషం. నరసింహ స్వామి జన్మించిన శుభఘడియ లలో 3 ఉచ్ఛ గ్రహాలు లగ్నంలో ఉండడంతో ఆ శిశువుకు ఉజ్వల భవిష్యత్తు ఉండ బోతోందని ఆ కుటుంబ జ్యోతిష పండితులు తెలియ చేసారు. ఆయనొక గొప్ప వ్యక్తి అవుతారని జోస్యం చెప్పారు.
రచయిత :- డా.జి.ఆర్. విజయకుమార్.
*"పూజ్య శ్రీ బి.వి.నరసింహస్వామి జీవిత చరిత్ర*"..
*2*. నరసింహస్వామి ఒక పవిత్రమైన ధనవంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి 2వ గ్రేడ్ ప్లీడరు. ఆయనకు ఎన్నో స్థిరాస్తులు కూడా ఉన్నాయి. భవాని నది ఒడ్డున అందమైన, ప్రశాంతమైన పరిసరాలలో వారికి ఒక పెద్ద ఇల్లు ఉంది. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు ఆ ఇంటిని ఒక నందనవనంగా అగుపించేలా చేసేవి.
సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నరసింహ స్వామి ఒక అందమైన, తెలివైన, ధృడమైన యువకునిగా ఎదిగారు. ఆయన కళ్ళు ఎంతో లోతైన దృష్టితో ఉండి అందరినీ ఆకర్షించేవి. చిన్నతనం నుంచీ కూడా ఆయన సంతోషంగా, సృజనాత్మకంగా, తెలివిగా, తుంటరిగా వుండేవారు. ఇతర పిల్లల నుంచి ప్రత్యేకంగా ఉండేవారు. ఒక టీచరు ఆయన ఇంటికి వచ్చి ఆయనకు అక్షరాలు నేర్పించేవారు. నరసింహ తన తోటి పిల్లలందరినీ తన చుట్టూ ప్రోగు చేసి వారితో కలిసి హాస్యమాడుతూ అల్లరి చేస్తూ ఉండేవారు. ఒకరి అధికారానికి లోబడి ఉండడాన్ని ఆయన ఇష్టపడేవారు కాదు. ఒక వేళ గొడవే వస్తే ఆయన చాలా కఠినంగా పోరాడేవారు. ఏమాత్రం అన్యాయాని సహించేవారు కాదు. తన గంభీర ప్రవృత్తితో దానిని ఎదిరించే వారు.
ఎవ్వరూ తనని పరిహాసం చేయడానికి ఆయన అవకాశం ఇచ్చేవారు కాదు. ఎంతో స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండేవారు. చిత్రంగా ఆయనకు సన్నిహితులని చెప్పుకోదగ్గ స్నేహితులు ఎవ్వరూ ఉండేవారు కాదు. దాని కారణంగా కుటుంబంలోను, బయట ఎవ్వరితోను ఆయనకు గాఢమైన అనుబంధం ఉండేది కాదు. తల్లి ఆయనను ఎంతో గారాబం చేసినప్పటికీ అది ఆయనను చెడగొట్టే విధంగా ఉండేది కాదు.
ఆయన అల్లరిని, ఆటలను అందరూ ఎంతో ఇష్టపడి ప్రేమించేవారు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ తన వయసుకు మించిన పరిణతి ప్రదర్శించేవారు. నరసింహ జన్మించిన 3 సంవత్సరాల తరువాత 1877లో అంగాచి అమ్మాళ్ మరొక పుత్రునికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి లక్ష్మణ అని పేరు పెట్టారు. దురదృష్టవశాత్తు అతను అతి కొద్దికాలం జీవించి ఉన్నాడు. అతను 3 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా 1880లో ఎవరో దుండగులు అతనిని అపహరించి, దోచుకుని చంపి వేసారు. ఈ సంఘటన ఆ తల్లితండ్రులను ఎంతగానో కృంగదీసింది.
లక్ష్మణ మరణించడానికి ఒక సంవత్సరం ముందు అనగా 1879లో ఆ తల్లిదండ్రు లకు మరొక విషాదం ఎదురైంది. ఈ దంపతులు తమ బంధువులు, గ్రామంలోని రైతులు, ఇతర పనివాళ్ళందరితో కలిసి సంక్రాంతి పండుగ రోజున ప్రత్యేక పూజ కోసం భవాని నది ఒడ్డున సమావేశమై ఉండగా 5 సం!!ల పిల్లవాడైన నరసింహ తోటి పిల్లలతో ఆడుకుంటూ భవాని నదిలో పడిపోయాడు. ఒక రైతు సరైన సమయానికి నదిలో దూకి ఆ ఘోర జల ప్రమాదం నుంచి ఆ పిల్లవాడి ప్రాణాలను కాపాడగలిగాడు.
దీనితో బెదిరిపోయిన వెంకట గిరి అయ్యర్, అంగాచి అమ్మాళ్ కొంతకాలం తరువాత తమ కుటుంబ జ్యోతిష్కుని సంప్రదించారు. ఆయన నరసింహ అకాల మృత్యువు నుంచి తప్పించుకోగలిగాడు కనుక ఇక 80 సం!!ల పైన జీవిస్తాడని తెలిపారు. ఆ దంపతులను ఆ స్థలం వదిలి వేరొక చోటుకు మకాం మార్చమని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాక నరసింహ భవిష్యత్తులో ఎంతో గొప్ప వ్యక్తియై వేలాది మందికి మార్గ దర్శకుడౌతాడని తెలిపారు. దీనితో పాటు ఆయన మరొక పిడుగు లాంటి విషయం చెప్పారు. నరసింహ తన కుటుంబ జీవితాన్ని వదిలి సన్యసించి సాధువు లాగ మారే అవకాశం ఉందని తెలియ చేసారు. ఇది ఆ దంపతులను ఎంతో కలవరపరిచింది.
అప్పటికే వారి చిన్న కొడుకు మరణించడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు సాధువై పోతే తమ వంశం అంతరించి పోతుందని భయపడ్డారు. ఆ భయం వారినెంతో కలచి వేసింది.. ఇక ఈ విషయమై ఆ దంపతులు భగవంతుని ఆశ్రయించారు. అప్పటికి అంగాచి అమ్మాళ్ వయసు 36 సం!!లు. ఆ దంపతులు సంగమేశ్వర - భవానిల సన్నిధిలో ఇక తమ జీవిత పర్యంతం బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తామని ప్రమాణం చేసారు. నరసింహ పెరిగి పెద్దవాడై గృహస్తు కావాలనే సంకల్పంతో వారి ప్రతిజ్ఞ చేశారు.
కుటుంబ జ్యోతిష్కుని సలహా ననుసరించి వెంకటగిరి అయ్యర్ భవానిలో ఉన్న తన ఇల్లు, స్థలాలు అన్నీ అమ్మి వేసారు. కేవలం కొద్ది పంట పొలాలు, కొబ్బరి తోట మాత్రం ఉంచుకుని భవానికి 40 కి.మీ. దూరంలో ఉన్న సేలంకు మకాం మార్చారు. వెంకటగిరి అయ్యర్ సేలం పట్టణానికి సమీపంలోని హస్తినంపట్టిలో కుటుంబాన్ని స్థిరపరిచారు. సేలంలో 2వ గ్రేడ్ ప్లీడర్ గా తన వృత్తిని కొనసాగించారు.
రచయిత :- డా.జి.ఆర్.విజయకుమార్
*"పూజ్య శ్రీ బి.వి.నరసింహస్వామి జీవిత చరిత్ర*"..
*3*. *సేలంలో బాల్యం*..
తమ కుమారుడైన నరసింహను సేలం లోని పాఠశాలలో చేర్పించారు. అప్పటికే ఆయన భవానిలో తమ ఇంటికి వచ్చిన గురువు వద్ద అక్షరాలు, ఇతర ప్రాథమిక అంశాలు నేర్చుకుని ఉన్నారు. నరసింహ మనోవైఖరి, ఆత్మస్థైర్యం ఆ వయసులోని ఇతర పిల్లలకంటే చాలా ఉన్నతంగా ఉండేవి. ఆయన చదువులో అమితకుశలునిగా ఉండేవారు. సైద్ధాంతిక విషయాల కన్నా ఆయన ఆచరణాత్మక, పరిశీలనాత్మక విషయాల పట్ల ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేవారు.
క్రొత్త విషయాలను పరిశోధించ డం పట్ల ఆయన ఎంతో ఆసక్తి కనబరిచేవారు. సుదూర ప్రాంతాలు, దేశాల గురించిన వివరణలు ఆయనను ఎంతగానో ఆకట్టుకునేవి. లక్ష్యశుద్ధితో సాహసోపేతమైన మనస్తత్వం కలిగి ఉండేవారు. నాయకునిగా ఉండాలని కోరుకునేవారు. తన వయస్సు లోనే ఉన్న ఇతర పిల్లల కంటే శారీరకంగాను, మేథాపరంగాను ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ఆయనకు తన తోటివారు ఎంతో మందకొడిగా అనిపించే వారు.
ఏమాత్రం నిస్తేజాన్ని, బద్ధకాన్ని, నిసత్తువను ఆయన భరించలేక పోయేవారు. అటువంటి వారితో సహవాసం చేస్తే తానూ వారిలాగే మారిపోతానని భయపడేవారు. మందకొడిగా, నిరుత్సాహంగా ఉండడాన్ని ఆయన మరణ సదృశంగా భావించేవారు. తల్లిదండ్రులైన వెంకటగిరి అయ్యర్, అంగాచి అమ్మాళ్ నరసింహను వైదిక వాతావరణంలో పెంచి పెద్ద చేసి ఆయనలో సామాజిక బాధ్యతను పెంపొందింప చేసారు. వారెంతో విశాల హృదయులుగా, ఉదారులుగా పేరు గడించారు. భవాని వద్ద ఉన్నప్పుడు కూడా అంగాచి అమ్మాళ్ తమ తోటలో సంవత్సరంలో మొదట పండిన మామిడిపండ్లు,కొబ్బరికాయలు ఇతర పండ్లు, ధాన్యం ఇవన్నీ పొరుగు వారికి, స్నేహితులకు, తమ బంగ్లాలో పనిచేసే వారికి పంచి పెట్టి వారికి సరిపడే కొద్ది భాగం మాత్రమే తమ వద్ద ఉంచేది.
నరసింహ స్వామి తరువాతి కాలంలో ఈ విషయాన్నే స్మరిస్తూ *స్వచ్చందంగా సమాజసేవ చేయడం నేను మా అమ్మ నుంచే నేర్చుకున్నాను* అన్నారు.
నరసింహ తండ్రి అయిన వెంకటగిరి అయ్యర్ ఎంతో పండితుడు, మేథావి. రాత్రి వేళలలో ఆయన కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను సమావేశ పరిచి రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణాలను చదివి వినిపించేవారు. పండుగ సమయాలలో ఆయన సాధువులు, పండితులను ఇంటికి ఆహ్వానించి వారి ప్రసంగాలను ఏర్పాటు చేసేవారు.
భారత రామాయణాలను చిత్రీకరించిన పటాలు కూడా ఆయన వద్ద ఉండేవి. ఈ ఐతిహాసిక నాటకాలను, ఘట్టాలను తిలకించే భాగ్యం నరసింహకు అనేక సార్లు దక్కింది. వాటిలోని పవిత్ర ఋషులు, యోగుల జీవితాలు ఆయననెంతో ఆకర్షిం చేవి. వారి శక్తులు, దివ్యదృష్టి, మేథస్సు, రాజులు, చక్రవర్తులను సైతం ఆజ్ఞాపించ గల వారి హోదా అతనినెంతో ముగ్ధుని చేసేవి. సాధువు అంటే అర్థం తెలియక పోయినా ఆ లక్షణాలు చూచి తాను కూడా వారిలా సాధువు కావాలని కోరుకునే వాడు.
వెంకటగిరి అయ్యర్ మూఢ విశ్వాసాలను ఏ మాత్రం ప్రోత్సహించే వారు కాదు. ఆయన తన ఇంట్లో జరిగే దైవ సంబంధ వైదిక కార్యక్రమాలలో ముస్లింలు పాటలు పాడడాన్ని ఏ మాత్రం అడ్డుకునే వారు కాదు. ఒకసారి నరసింహస్వామి తన శిష్యులతో *నాలో ఏమాత్రం శుద్ధత ఉన్నా అది నాకు నా తండ్రి నుంచి అలవడినదే* అన్నారు. నరసింహపై ఆయన తల్లి ప్రభావం ఎంతగానో ఉండేది. అతనిలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడానికి ఆమె ఎల్లప్పుడూ అతని వద్ద భక్తిగీతాలు పాడుతూ ఉండేది.
ఎవరైనా మహాత్ముడు లేక సాధువు సేలం వచ్చారని తెలిస్తే ఆ దంపతులు అందరి కన్నా ముందు ఆ మహాత్ముని తమ ఇంటికి ఆహ్వానించేవారు. శృంగేరి జగద్గురు శంకరాచార్యులు శ్రీ నరసింహ భారతీ స్వామీజీ, కాళహస్తి సమీపంలో నివసించిన శ్రీ సొరకాయ స్వామీజీ నరసింహను బాల్యంలో ఎంతగానో ప్రభావితం చేసారు. శృంగేరి పీఠాధిపతులైన నరసింహ భారతీ స్వామిని ఆది శంకరాచార్యుల అపర అవతారంగా భక్తులు భావిస్తారు.
ఆయనకు ఎంతోమంది భక్తులు ఉండేవారు. నరసింహ ఆయనను మొట్టమొదటి సారి దర్శించినప్పుడే ఆయన ఆ పసివాడిని ఆశీర్వదించి అతని బుగ్గలపై సున్నితంగా తట్టారు. ఇలా చేసి వెంటనే ఆయన ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోసాగారు. ఆయన వైపే చూస్తున్న పిల్లవాడు నరసింహ ఆ స్వామీజీ ఎంతో వేగంగా వెళ్ళిపోతుంటే వారి పాదాలు భూమిని తాకక పోవడం గమనించాడు. ముఖ్యంగా ఆయన శక్తివంతమైన కళ్ళు ఆ పిల్లవాడిని చిత్రమైన రీతిలో ఆకర్షించాయి. ఆ ప్రభావం అతనిపై ఎంతో తీవ్రంగా పడింది. తరువాతి కాలంలో నరసింహ స్వామీజీ *ఈ సంఘటన నేనెప్పటికీ మరచిపోలేను. అది ఒక నిధి వలే ఎప్పటికీ నాతో నిలిచి ఉంటుంది* అన్నారు.
1882లో నరసింహ 8 సం!!ల వయస్సులో ఉండగా అతనికి *బ్రహ్మోపదేశం* జరిగింది. వారి పొరుగునే ఉండే నటరాజ వడయర్ ఆ పిల్లవానికి సంధ్యావందన క్రతువును నేర్పించారు. తండ్రి ద్వారా గాయత్రీ మంత్రో పదేశం పొందిన నరసింహ అప్పటి నుంచీ త్రికాల సంధ్యావందనం ఆచరిస్తూ గాయత్రీ జపం నియమనిష్ఠలతో చేయసాగారు. తరువాత రుద్రం, నమకం, చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం నేర్చు కొనడానికి ఆ పిల్లవాడిని వేద పాఠశాలలో చేర్పించారు.
పొరుగునే ఉన్న స్నేహితురాలైన అలమేలమ్మ పిల్లవానికి విష్ణుసహస్రనామం, లలితా సహస్రనామం, ఇతర స్తోత్రాలు నేర్పించింది. ప్రతీ రోజు సాయంత్రం 4 గంటలకు అలమేలమ్మ తమిళంలో *కన్నా! శ్లోక సొల్లువా* అనగానే ఆ పిల్లవాడు పరిగెత్తు కుంటూ ఆమె ఇంటికి వెళ్ళి ఆ స్తోత్రాలు నేర్చుకునేవాడు. ప్రతీ రోజూ భోజనం చేసే ముందు తులసి మొక్కకు నీరు పోసి, ఆవుకు మేత పెట్టాలని అంగాచి అమ్మాళ్ నరసింహకు బోధించింది. నరసింహ దానికి కారణం అడుగగా *ఇతరులకు పెట్ట కుండా మనం తినడం సరికాదు* అని చెప్పింది.
రచయిత :- డా.జి.ఆర్.విజయకుమార్
నారాయణ్ మోతీ రాంజనే పెద్ద కొడుకు శ్రీ ధ్యాననాథ్ నారాయణ్ జాని
నారాయణ్ మోతీ రాంజనే పెద్ద కొడుకు శ్రీ ధ్యాననాథ్ నారాయణ్ జాని. చిన్న తనం నుండే తల్లిదండ్రులతో పాటు ఇతనికి కూడా దైవ భక్తి అబ్బింది. దాసగణు మహారాజ్, సొనొపంత్ దండేకర్, ధుండా మహరాజ్, రంగనాథ్ స్వామి ప్రభానికర్ వంటి సుప్రసిద్ధ సాధు సత్పురుషులను దర్శించి వారి ఆశీర్వచనాలను పొందాడు.వారి ప్రవచనాలను విన్నప్పుడు నేనూ వీరి వలె ఆ పరమాత్మను దర్శించగలనా ? ప్రహ్లాదుని వలె అనన్య భక్తిని సాధించగలనా ? భగవంతుని ప్రతిరూపమైన సద్గురువును కనీసం కలుసుకొని సేవించగలనా ? అని వివిధ రకాలైన ప్రశ్నలు అతనిని వేధిస్తుండేవి. దానితో పాటుగా చిన్నతనం నుండే ఒంటరిగా వుండడం అలవాటు చేసుకున్నాడతను. ప్రతీరోజూ స్కూలు నుండి వచ్చేటప్పుడు తమ స్కూలుకు దగ్గరలో వున్న పార్వతి కొండపై వున్న అమ్మవారిని దర్శించుకుంటుండేవాడు.
పూణే లోని కసబాపేటలో శ్రీ భైరవనాధుల గుడి వుండేది.హరనాధ్ బాబా అనే ఒక సాధు పుంగవుడు అక్కడ నివసిస్తుండేవారు. ఒకరోజు ధ్యాననాథ్ జాని పార్వతి కొండపై ఒంటరిగా కూర్చోని వుండగా శ్రీ హరనాధ్ బాబా అక్కడికి వచ్చి తనకు కలలో శ్రీ సాయినాధులు కనిపించి తన దర్శనం కోసం ఒక బాలుడు తపిస్తున్నాడని, వెంటనే వెళ్ళి అతనిని శిష్యుడుగా స్వీకరించి ఆధ్యాత్మిక సాధనలో శిక్షన ఇవ్వమని చెప్పారని” అన్నారు. అందుకు ధ్యాననాథ్ జాని కు ఎంతో ఆనందం కలిగింది. వెంటనే హరినాధ్ బాబాకు సాష్టాంగ ప్రణామం చేసాడు. గురువు గారికి అత్యంత భక్తి శ్రద్ధలతో శశ్రూషలు చేసి వారి నుండి యోగము, భక్తి, ధ్యానము, వైరాగ్యము లకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు ధ్యాననాథ్ జాని.
తన గురు సేవ గురించి ధ్యాననాథ్ జాని ఇలా రాసాడు.” నా గురువుగారైన హరినాధ్ బాబా గారు నాకు అతి నిఘూఢమైనట్టి అధ్యాత్మిక సాధనలను నార్పించారు. అందుకు వారికి వారి పరాత్పర గురువైన శ్రీ సాయినాధులకు వేల వేల వందనాలను అర్పించుకుంటున్నాను. ఒక సందర్భం లో అయితే ఒక గుహలో శ్రీ గోరక్ నాధ్ ప్రతిమ ఎదుట నన్ను ధ్యానం ధారణలో గంటలకొద్దీ కూర్చోబెట్టారు. అన్నపానీయాదుల సంగతే మరిచిపోయాము.శ్రీ సాయినాధులు, శ్రీ హరినాధ్ బాబల దయ వలన నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగింది. నాకు కుండలినీ జాగృతి సిద్ధించిన తర్వాత నా సద్గురువు నాకు నాథ సాంప్రదాయానికి సంబంధించి ఎన్నో రహస్యాలను నేర్పించారు”
తన సర్వ శక్తులను శిష్యునికి ధారపోసిన తర్వాత శ్రీ హరనాథ్ బాబా 28-04-1950 లో శ్రీ రామ నవమి పర్వ దినమున దేహ త్యాగం చేసారు. తన గురువు అభీష్టం మేరకు రాయగడ జిల్లా కర్జత్ తాలూకా పలస్దరీ అనే మఠం వద్ద ఆయనను సమాధి చేసి అన్ని లాంచనలను పూర్తి చేసాడు ధ్యాననాథ్ జాని. శ్రీ సాయినాధుని ఆశ్శీసులతో, సద్గురువు శ్రీ హరనాధ్ బాబా పర్యవేక్షణలో ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్తగా రూపొందిన ధ్యాననాథ్ జాని జీవితం ధన్యం.
ధ్యాననాధ్ జానీ తాను మహరాష్ట్రలో నలుమూలలకు పర్యటించి శ్రీ సాయినాధుని లీలా వైభవం గురించి విశేషంగా ప్రచారం చేసాడు. ఎంతో మంది సాధకులకు ఆయన ఆదర్శప్రాయుడయ్యాడు.ఆ విధంగా ఆధ్యాత్మిక పంధాలో తన జీవితమంతా నడిచి తండ్రికి మించిన తనయుడిగా పేరు గాంచాడు.
షిరిడీలో ఒక గురుపూర్ణిమ
గురుపూర్ణిమ ఉత్సవాలు యధావిధిగా ప్రతీ ఆషాఢపూర్ణిమకు గురుపూర్ణిమ ఉత్సవాలు నేటికినీ కొనసాగుతునే వున్నాయి .ఆలా 1914
సం .లో షిరిడీలో ఒక గురుపూర్ణిమ సందర్భంగా
విశేషముగా ప్రసాదాలు తయారుచేస్తున్నారు .
ఆ సందర్భంగా సాయిభక్తురాలైన రాధాకృష్ణ మాయి ,మసాల దినుసులు పొడిచేసేందుకు ఒక
పెద్ద రోలును తరలించవలసి వచ్చింది .ఆ సమయములో ఆమెకు సహాయము చేసేందుకు
ఎం .బి .రేగే అను భక్తుడు అక్కడకు వచ్చాడు .
అదే సమయములో పురందరే అనే మరొక బాబా భక్తుడు ఆ పెద్ద రోలును కదలించడానికి వారితో
కలిశాడు .ఆలా ఆ రోలును కదిలించడంలో రేగే
చెయ్యి ఆ రోలుక్రిందపడి నుజ్జయిపోయేది .కానీ
అది గమనించిన రాధాకృష్ణమాయి చాకచాక్యంగా
ఆ రోలును తనవైపు తిప్పుకొని రేగెను కాపాడింది
అలాచేయడంలో ఆమె చూపుడువేలు రోలుక్రింద
నలిగి రక్తం కారసాగింది .వెంటనే ఆమె ఒక గుడ్డను నూనెలో తడిపి తన వేలుకు చుట్టుకొంది .
ఆలా ఆ తరువాత మిగిలిన కార్యక్రమము
పూర్తిచేసి వంటల పని ముగించింది .ఆ పని అంతా పూర్తిఅయ్యేక రేగెను వెంటబెట్టుకుని ఒక
నిర్జన ప్రదేశానికి వెళ్ళి తన బాధ తీరేదాకా షుమారు అరగంట సేపు విలపించింది .తన వేలు
చిట్లినప్పుడు ,బాధతో విలపిస్తే మిగతా పనులు
దెబ్బతింటాయని ఓర్పుతో భరించింది .
అపూర్వ కార్యదక్షతతో బాబాను సేవించిన ఆ భక్తురాలు చిరస్మరణేయురాలు .శిర్డీసాయి బాబాను మనసావాచాకర్మణా అంకితమైన
సుందరీబాయి క్షీరసాగర్ అనే రాధాకృష్ణమాయి
ధన్యురాలు .
Subscribe to:
Comments (Atom)









