Monday, May 13, 2024

శ్రీ సాయిబాబాను విమర్శించే వారికి ఈ వ్యాసము ఒకసారి పంపండి.

శ్రీ సాయిబాబాను విమర్శించే వారికి ఈ వ్యాసము ఒకసారి పంపండి.
ఇప్పటికన్నా ఆచార వ్యవహారములు పటిష్టంగా ఉన్న ఒక శతాబ్దం క్రితమే అనగా శ్రీసాయిబాబా
భౌతికంగాకంగా ఉన్నప్పుడు ఆయనను సేవించినవారిలో ఎక్కువ మంది బ్రాహ్మణులే. శ్రీసాయిసచ్చరిత్ర రచించిన హేమాద్రిపంత్, సాయిచరిత్రను తన హరికథల ద్వారా గానం చేసిన దాసగణు మహారాజ్, సాయి నివాసాన్ని రాజదర్బారులా అలంకరించి, పూజలు, హారతులు ప్రారంభించిన రాధాకృష్ణమాయి బ్రాహ్మణులే.అంతేకాదు వీరందరికీ మొట్టమొదట సాయిని పరిచయం చేసిన నానాసాహెబ్ చందోర్కర్ కూడా సద్బ్రాహ్మణ వంశంలో జన్మించి, భగవద్గీతకు మూడు రకాల భాష్యాలను చదువుకున్నవాడు. అంతే కాదు ఆరోజులలోనే డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉన్నత పదవిని అలంకరించినవాడు. ఇకపోతే సాయితో అతి సన్నిహితంగా మెలిగిన శ్యామ, బొంబాయి, నాసిక్ లలో ప్రసిద్ధి చెందిన న్యాయవాదులయిన దీక్షిత్ మరియు ధూమల్, ఇంకా అనేకమంది సాయిని సేవించిన వారిలో ఎక్కువమంది బ్రాహ్మణులే ఉన్నారు. నిష్టాచార పరాయణుడు, అనేక కఠిన సాధనలు అనుష్ఠించి, చివరకు ఒక గొప్ప మహనీయుని సూచనమేరకు షిరిడీ వచ్చి సాయిని ఆశ్రయించిన ఉపాసనీ బాబా బ్రాహ్మణుడే. సాయికి పేరు పెట్టిన మహల్సాపతి విశ్వబ్రాహ్మణుడు.నిజంగా సాయి గనుక ముస్లిం ఫకీరే అయితే ఈ వ్యాస ప్రారంభంలో చెప్పుకున్నట్లు ఇప్పటికన్నా ఆచార వ్యవహారాలు పటిష్టంగా ఉన్న ఆరోజులలోనే సనాతన హైందవ ధర్మంలో జన్మించడమే కాకుండా, ఉన్నత విద్యను అభ్యసించిన వారు, ఉన్నత పదవులలో ఉన్నవారు, సాధకులైన ఎందరో సాయిని సేవించేవారా? కనుక ముస్లింల బారి నుండి హిందువులను రక్షించడం కోసమే ఆయన ఆ వేషధారణలో కనిపించారని భావించాలి. అంతేకాదు సాయి నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు చూసిన ఒక భక్తుడ ఆయన సుంతీ చేయించుకోలేదని స్వయంగా చెప్పాడు. మరొక విషయం ఏమిటంటే ఆయన చెవితమ్మెలకు రంధ్రాలు ఉండేవి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటే ఆయన హిందువో ముస్లిమో తేల్చుకోవచ్చు. ఇకపోతే కొంతమంది సాయిబాబా హిందూ ఆచారాలను పాటించారా? అని అడుగుతున్నారు. ఆయన నివాసం పేరు ద్వారకామాయి.అందులో ఆయన ఈశాన్యం మూల కూర్చొని, ఆగ్నేయం మూల అగ్నిహోత్రం వెలిగించేవారు. గుమ్మానికి ఎదురుగా తులసి బృందావనం స్థాపించారు. ప్రతిరోజు సాయింత్రం దీపాలు వెలిగించేవారు. శ్రీరామ నవమి ఉత్సవం వైభవంగా జరిపేవారు.మహా సమాధికి ముందు "శ్రీరామ విజయం" అనే గ్రంథాన్ని మూడుసార్లు చదివించుకుని విన్నారు. ఇవన్నీ హిందూ సంప్రదాయం కాదంటారా? అంతేకాదు ఆయన ఎవరినీ ముస్లిములుగా మార్చలేదు. తనకు తానుగా ముస్లిం మతాన్ని స్వీకరించిన ఒకహిందూ యువకుడిని చెంపదెబ్బ కొట్టి, నీ అబ్బను మార్చు కుంటావా? అని ప్రశ్నించారు?.సాయి బాబా భౌతిక దేహాన్ని విడిచి పెట్టిన తరువాత దక్షిణ భారతావనిలోని మద్రాస్ నుండి షిరిడి వెళ్లి శ్రీసాయి సమాధి దర్శనంతో ప్రభావితులై సాయి చరిత్రను ఆంగ్లంలో రచించి ప్రపంచానికి అందించిన బి.వి నరసింహ స్వామిఎవరో చూడండి, ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించి,ఐఏఎస్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించారు, అలానే వారి అన్నగారైన కులపతి మాస్టర్ Ekగారు, ఎక్కిరాల వేదవ్యాస్ గారిలాంటి గొప్పవారు సాయిని మహనీయుడుగా ఎందుకు కీర్తించారు ? అంతదాకా ఎందుకు కాకినాడ శ్రీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామివారు, ప్రసిద్ధి చెందిన ప్రవచనకర్తలైన చాగంటివారు, గరికిపాటివారు సాయిబాబాను ఎప్పుడైనా వ్యతిరేకించడం,విమర్శించడం జరిగిందా?సాయిబాబాను గురించి పురాణాలలో లేకపోవచ్చు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నిజమైన జ్ఞానికి-నాకు భేదంలేదని చెప్పాడు కదా? అయినా పురాణాలలోలేని ఎందరో దేవీ దేవతలను మనమిప్పుడు పూజించడం లేదంటారా? సమ్మక్క-సారక్క గురించి ఏ పురాణంలో ఉంది? గుబ్బల మంగమ్మ పుంతలో ముసలమ్మల గురించి ఏ పురాణాలు వర్ణించాయి? పోనీ భగవాన్ రమణులు, శ్రీరామకృష్ణులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి గురించయినా మన పురాణాలలో ఉన్నాయా? కాకపోతే వారంతా హిందూ రూపంలో ఉండడం వలన అభ్యంతరం లేదు.. అంతే కదా? రూపమే అభ్యంతరమైతే మత్స్య, కూర్మ ,వరాహాది రూపాలలో కూడా భగవంతుడు ఎందుకు వచ్చాడు?ఒకవేళ సాయి భక్తులలో ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకోమని చెప్పడంలో ఎంతమాత్రం తప్పులేదు. అంతేకానీ సాయినే విమర్శించడం సరికాదు. ఒకవేళ అలా విమర్శించే వారిలో ఎవరైనా పై వ్యాసంలో పేర్కొన్న వాళ్ళందరి కన్నా గొప్పవాళ్ళా?పోనీ సాయి భక్తులంతా ముస్లిం మతం స్వీకరించి హైందవేతర కార్యక్రమాలు చేస్తుంటే బాధపడాలిగానీ వాళ్లంతా శుభ్రంగా హైందవ ఆచారాలే పాటిస్తుంటే ఇక బాధ పడడం దేనికి? అయితే సాయి పాదాల దగ్గర ఇతర దేవతామూర్తులను, యంత్రాలను, శివలింగాలను పెట్టడం మాత్రం చాలాచాలా తప్పు. ఇలాంటి లోపాలను మాత్రం సాయి భక్తులు వెంటనే సరి చేసుకోవాలి. విద్యా,వైద్య, ఆర్థిక, రాజకీయ  రంగాలలో లోపాలు ఉన్నాయని ఆ రంగాలే లేకుండా చేయాలంటే కుదరదు కదా? వాటిలోని లోపాలను మాత్రం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే సాయి భక్తులు ఏవైనా పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్దుకోమని చెప్పాలికానీ సాయినే విమర్శించకూడదు. భారతదేశమంతటా కాలినడకతో సంచరించి 24 చాతుర్మాస్య వ్రతాలు అనుష్టించి,అలనాటి శృంగేరి జగద్గురువుల చేత "అయం హి  సాక్షాత్ భగవాన్ దత్తాత్రేయః స్వయం యతిః" అని కీర్తింపబడిన పరమహంస పరివ్రాజకాచార్యులు, అతి నిష్ఠా గరిష్టులు అయిన శ్రీ శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కూడా సాయిబాబాను కీర్తించి, బాబాకు నమస్కారములు మరియు నారికేళము పంపించారు. నేడు సాయిని ద్వేషించే వారంతా ఈ విషయాలను ఒకసారి గుర్తిస్తే బాగుంటుంది. సాయి మీద చేసే తిరుగుబాటేదో మత మార్పిడులకు పాల్పడుతున్న అన్యమతస్తుల పైన చేస్తే బాగుంటుంది.. సాయి భక్తుల చేత విష్ణుసహస్రనామము, భావార్ధ రామాయణము,ఏకనాథ భాగవతము,దాసబోధలు  చదివించారుగాని ఖురాన్ చదివించలేదు కదా? ముస్లిం పకీర్ లా కనిపించి, అల్లా మాలిక్ అనడం ద్వారా హిందువులను బాధించే అనేకమంది ముస్లింలు వెనకంజ వేశారు.. అయినా అల్లాహ్ అన్నప్పుడల్లా భగవంతుడు అనే అర్థమే తప్ప ముస్లింల దేవుడు అని మాత్రంకాదు!! అనేక వేల మంది చేత  కీర్తింపబడిన అవతార్ మెహర్ బాబా కూడా శ్రీసాయి బాబాను వజ్రాలలో కెల్లా గొప్ప వజ్రం కోహినూరు వజ్రం లాగా సాయిబాబా మహనీయులలో కోహినూరు వజ్రం లాంటి వారు అని కీర్తించారు కదా? ఇలాంటి విషయాలన్నీ ఒకసారి తెలుసుకోండి. ప్రసిద్ధి చెందిన పురాణ పండితులు వయోవృద్ధులు అయిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కూడా వారి ప్రవచనాలలో సాయిబాబాను దత్తావతారంగా కీర్తించారు. సాయిని విమర్శించే కుహనా మేధావులంతా వీరిలో ఎవరికన్నా గొప్పవాళ్ళు?

No comments:

Post a Comment