Monday, May 13, 2024

సాయిబాబా లీలలు చేష్టలు అందరికీ ఒక పట్టాన అర్ధంకావు

*సాయిబాబా లీలలు చేష్టలు అందరికీ ఒక పట్టాన అర్ధంకావు.*
 
*దాసగణు మహరాజ్ బాబా భక్తుడు. చేసేది పోలీస్ ఉద్యోగం. బాబా ఆదేశముతో తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశాడు.*

*అతనికున్న చదువు అంతంత మాత్రమే.*
*ఆర్థిక స్తోమత అసలేలేదు.* *డబ్బు సంపాదించుకొందామన్న కొరిక అసలే లేదు.*
*ఇవన్నీ చాలనట్లు ఒక అనాథ బాలుడిని చేరదీసాడు.* *కొన్నాళ్లకు ఆ బాలుడు యువకుడయ్యాడు.* *చక్కని గాత్రం, చక్కని దస్తూరి, అద్భుత జ్ఞాపకశక్తి, మచ్చలేని నడవడిక ఇవన్నీ ఆ యువకుడి సంపద.* 

*అతని పేరు వామన్ అథవాలే .అందరూ ఆతనిని దామూ అన్నా అని పిలిచేవారు.* *ఒకసారి దాసగణు, దాము అన్నాతో సాయిబాబా దర్శనం చేసుకున్నారు.*

 *అదేసమయానికి నానా చాందోర్కర్ ,కాకాసాబ్ ధీక్షిత్, కాకా మహాజని మున్నగు భక్తులు ద్వారకామాయిలో ఉన్నారు.*
*వారితో పాటు ప్రముఖ వైద్యుడైన డాక్టరు మహ బల్ మొదలైనవారు కూడా ఉన్నారు.*
 
*దాము అన్నా తన మధుర గాత్రంతో తుకారామ్ మహరాజ్ అభంగమైన "ఘర్ జానేదో శ్యామ్ మురారి " అన్న పాటను పాడాడు* 
*అక్కడవారందరూ ఆ పాటకు తన్మయత్వం చెంది ఆనంద భాష్పాలు రాల్చారు.*

 *సాయిబాబా కూడా ఆ పాటకు అనందించి, నాలుగుసార్లు ఆ పాటను పాడించుకొన్నారు. బాబా ఒక పాటను అన్నిసార్లు పాడించుకొన్నట్లు ఇంకెక్కడా గ్రంధస్తమవలేదు.*

*మరొక విశేషమేమనగా ఈ దామోదర అన్నాయే,* *దాసగణు మహరాజ్ రచించిన "సాయినాథ స్తవన మంజరిని " గ్రంధస్తం చేశాడు.* 

*ఆ సంగీతాన్ని డాక్టరు మహా బల్, ఆయన భార్య, కుమార్తె కుడా విన్నారు.* 

*అప్పుడు సాయిబాబా డాక్టరు మహా బల్ ను చూపిస్తూ దాసగణుతో "గనూ ! నీ కుమారుడైన దాము అన్నాకు, డాక్టరు మహా బల్ కూతురినిచ్చి వివాహం చేయవచ్చుగా " అని అన్నారు. అక్కడేఉన్న డాక్టరు, ఆయన భార్యా, కూతురు ఆ మాటలు విన్నారు  కానీ మౌనంగా ఉండిపోయారు. అంతట వారు బాబా అనుమతిపొంది వారి స్వస్థలమునకు వెళ్ళిపోయారు.*
 
*డాక్టరు మహా బల్ కు, షిరిడీలో తన కుమార్తె వివాహము గూర్చి బాబా పలికిన పలుకులు చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఏమి చేయాలో అర్ధంకావటం లేదు.* 

*ఒక అనాథ యువకునికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడమా ? సాయిబాబా మాటను తిరస్కరించడమా ?*
 *చివరకు సాయి మాటే తనకు వేదవాక్కుగా భావించాడు.*
 
*బాబా అదేశం ముందు సామాజిక ఆర్థిక అసమానతలు ఎవరు చూస్తారు ?* 

*డాక్టర్ కుమార్తెతో మాజీ కానిస్టేబుల్ దాసగణు పెంపుడు కుమారుడైన వామన్ అథవాలే ( దాము అన్నా ) తో వివాహం జరిగింది.*

*ఇదే సాయిబాబా లీల అంటే !*

No comments:

Post a Comment