*గోవింద రఘునాద్ దభోల్కర్ (హేమాడ్ పంత్ )*
*" శ్రీ సాయి సచ్చరిత్ర "మరాఠి భాషలో రచించి బాబా జీవిత చరిత్ర బోధనలు, లీలలు, మనకు అందించి సాయి భక్తుల హృదయాలలో చిరస్ధాయిగా నిలిచిపోయాడు.*
*బాబా మహాసమాధి అయిన 18 ఏళ్లకు, బాబా భక్తులనుంచి అనేక విషయాలు, అనుభవాలు, సేకరించి, సాయిబాబా గురించి అనేక గ్రంథాలు రచించి పూజ్యుడైనాడు,*
*" సాయి వ్యాసుడు "గా, సాయి దూతగా పేరొందినాడు శ్రీ బి.వి. నరసింహ స్వామిగారు.*
*సమర్థ సద్గురువుల చరిత్ర వ్రాయటం అత్యంత కష్టతరం, క్లిష్ట తరం దైవ సంపత్తి కలిగిఉంటేగానీ సద్గురువు అర్థం కాడు.*
*కల్పితాలకు తావులేనిది వారి చరిత్ర.*
*శ్రీ నరసింహస్వామిగారు తన గురువు ఆన్వేషణలో అనేకమంది సిద్ధపురుషులను, మహత్ములను దర్శించిన క్రమములో 11 ఏళ్లు గడచిపోయాయి.*
*చివరగా ఉపాసనీ మహరాజ్ ను దర్శించి, తన గురువు దర్శనం కాలేదు అని చింతిస్తూ, తన స్వస్థలమైన మద్రాసు నగరానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.*
*అది 1936 అగస్ట్ 29 వ తారీకు రోజున ఉపాసనీ మహరాజ్ అశ్రమం నుండి బయలుదేరాడు.*
*ఇంతలో ఉరి స్మశానం దాటుతూ ఉండగా, ఆరు అడుగుల ఆజానుబాహుడు అయిన ఒక పఠాన్ అడ్డువచ్చి షిర్డి వెళ్ళి ఒకసారి సాయిబాబా సమాధిని దర్శించి వెళ్లవలిసినదిగా, సూచించాడు.*
*" సాయిబాబా ఎన్నడో 1918 లో సమాధి అయినాడుకదా !* *ఆయన దర్శనం వల్ల నాకేమి ప్రయోజనము ? నేను నాగపూరు, అజ్మీర్ దర్గాలను దర్శించాను." అని స్వామి జవాబిచ్చాడు. అయితే ఆ పఠాన్ వదలలేదు.*
*" ఒకసారి షిర్డి వెళ్లిచూడు.* *సాయినాధుడు జీవించే ఉన్నారు. నిన్ను తప్పక అనుగ్రహిస్తారు " అని పఠాన్ చెప్పగానే సాకోరి నుండి బయలుదేరి షిర్డి చేరుకున్నాడు.*
*షిర్డి చేరేసరికి ఉదయం 11 గంటలయింది. అబ్దుల్ బాబా, సమాధిని విసనకర్రతో విసురుతున్నాడు.*
*బాబా సమాధి దర్శనం ఆయన జీవితంలోనూ, లక్షలాది మంది జనావళి జీవితాలలాగే ప్రధాన ఘట్టం అయ్యింది శ్రీ బి.వి. నరసింహస్వామిగారు బాబా సమాధి చెంత నిలబడి ఉన్నారు.*
*18 ఏళ్లుగా సాయినాధుడు తన నిధిని నిక్షిప్తం చేశాడు.* *తన అధ్యాత్మిక సంపద అందచేయటానికి, ఒక సమర్ధుడైన వ్యక్తి గురించి ఎదురుచూస్తున్నట్లు కనిపించింది.*
*" అది నిజమేనన్నట్లు, ఒక గొప్ప మెరుపు కాంతి " నరసింహస్వామి అణువణువునా ప్రాకింది.*
*సాయినాధుడు నరసింహస్వామిలో లీనమయ్యాడు.* *నరసింహస్వామికి నూతన శరీరం లభించింది. ఒక్క అరక్షణంలో ఇది జరిగింది.* *నరసింహస్వామికి ఆత్మ సాక్షాత్కారం లభించింది. ఆయన సాయినాధునిలో భాగమైపోయారు.* *చెప్పాలంటే స్వామి సాయి స్వరూపునిగా మారిపోయారు. గజిబిజిగా ఉన్న నరసింహస్వామి మనసు స్థిరత్వం పొందింది.*
*స్వామిలో సాయినాధుడు వెలుగు నింపాడు.*
*1941 సం.లో ఒక సమావేశంలో స్వామి ఇలా ప్రసంగించారు.*
*" నేను షిర్డి వచ్చేవరకు నా అధ్యాత్మిక తృష్ణ తీరలేదు.*
*షిరిడీలో నాకు కావలిసినదానికంటే ఎక్కువే దొరికింది. నా సద్గురువు నాకు లభించాడు.*
*ఆయనే "సమర్థ సాయినాధ్ మహరాజ్ " ఆయనతోనే నేను అనుక్షణం కలిసే ఉన్నాను ".*
*శ్రీ బి.వి.నరసింహస్వామిగారు 21 -8 -1874 న తమిళనాడు లో " భవానీ " అను పట్టణంలో జన్మించారు.*
No comments:
Post a Comment