Monday, May 13, 2024

శ్రీ సాయినాథ స్థ వన మంజరి "మహా మహిమాన్వితమైన స్తోత్ర గ్రంథాన్ని 1918 సంవత్సరం భాద్రపద శుద్ద చవితి నాడు మధ్యప్రదేశ్ రాష్ట్రం లోగల మహేశ్వర క్షేత్రము నందు రచన చేసి మూడురోజుల తరువాత షిరిడీలో సాయినాధునికి వినిపించి బాబా అనుగ్రహ అశీస్సులు పొందాడు .ఆ రచన ముగించి నేటికి 103 వసంతాలు ముగిస్తాయి .

 .పరమ పర్వ దినం .గణేశ చతుర్థి నాడే 
కలియుగ ప్రథమ దత్తావతారం అయిన శ్రీ పాద 
శ్రీ వల్లభుడు మన తెలుగునాట పిఠాపురం నందు 
జననము జరిగిన రోజు .సాక్షాత్తు తూర్పు గొదావరి జిల్లా లో గల అయినవిల్లి గణేశుడే 
దత్తావతారం స్వీకరించినట్లు గ్రంధాలలో కనిపిస్తుంది .
సాయి అంకిత భక్తుడైన శ్రీ దాసగణు మహరాజ్ 
ఎంతో భక్తీ శ్రద్దలతో రచన చేసిన " శ్రీ సాయినాథ 
స్థ వన మంజరి "మహా మహిమాన్వితమైన స్తోత్ర 
గ్రంథాన్ని 1918 సంవత్సరం భాద్రపద శుద్ద చవితి 
నాడు మధ్యప్రదేశ్ రాష్ట్రం లోగల మహేశ్వర క్షేత్రము నందు రచన చేసి మూడురోజుల తరువాత షిరిడీలో సాయినాధునికి వినిపించి 
బాబా అనుగ్రహ అశీస్సులు పొందాడు .ఆ రచన 
ముగించి నేటికి 103 వసంతాలు ముగిస్తాయి .

ఒక రొజు బొంబాయి నందు గల బాంద్రా ప్రాంతము 
నుండి ఒక మహిళ సాయబాబా దర్శనానికి షిర్డి వచ్చి ,బాబా ఎదుట కూర్చున్నది .యేడు ఏళ్లుగా 
ఆమె విపరీతమైన తలనొప్పి తో బాధ పడుచున్నది .బాబా ఆమె తలనిమురుతూ "
అమ్మా ! నీకు తలనొప్పిగా ఉన్నది అవునా " అని 
అడిగాడు ." ఇంతకు ముందు ఉండేది .ఇప్పుడు 
మీరు తల నిమరాగానే తగ్గిపొయింది బాబా !"
అని అన్నది .బాబా ఆమెతో " అమ్మా ! నీ చిన్నతనం నుండి నాకెన్నో పదార్ధాలు తినబెడుతున్నావు కదా ! " అని అన్నారు .
ఆనాటిదాకా ఆమె బాబాను చూడలేదు .అదెట్లా 
సంభవం ? అని అశ్చర్యపోయింది .బాబా అమెతో 
" నీవు ఎవరిని పూజిస్తావు ? " అని అన్నారు .
"గణపతి ని "అన్నదామె ." చూసావా ! నీవు నివేదించిన పదార్ధాలన్నీ నాకే అందుతున్నాయి "
అని తన పొట్టను తడుముకున్నాడు సాయి .
భోజన ప్రియుడైన విఘ్నేశ్వరుడు తానే అని  సూచించారు .

No comments:

Post a Comment