నేడు షిరిడీలో ద్వారకామాయిలో ధుని ఎదురుగా దర్శనమిస్తున్న బాబా ఆసీనుడైయున్న చిత్రపటం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నది.*
*ప్రతీ సాయిభక్తుల గృహాలలోను, కొన్ని సాయిమందిరాలలోను ఈ చిత్రపటం దర్శనమిస్తుంది.*
*ఈ పటానికి రూపుదిద్దినవాడు, ఆ రోజులలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు అయిన శ్యామరావు జయకర్ .*
*సుమారు 1916 సం. ప్రాంతంలో జయకర్ తన భార్యా, పిల్లతో సహ సాయి దర్శనానికి షిర్డీ వచ్చాడు.*
*జయకర్ బాబా చిత్రాన్ని గీయటానికి అనుమతించమని బాబాను ప్రార్దించాడు.*
*అది విన్న బాబా " అరే ! పిచ్చి బిచ్చగాడిని.*
*నా చిత్రం గీసుకొని ఏమి చేసుకొంటావు ? " అన్నారు.*
*చివరికి బాబా తన చిత్రపటం గీయడానికి ఒప్పుకొన్నారు.*
*సాయి ప్రేరణతో జయకర్ గీసిన చిత్రం, ద్వారకమాయిలో ఇప్పటికీ షిరిడీలో కొలువై ఉంది.*
*జయకర్ గీసిన చిత్రం, సాయిసచ్చరిత్ర తోనూ, బాలాజీ వసంత్ తాలిమ్ మలచిన సమాధిమందిరం లో ఉన్న సాయిబాబా విగ్రహమూర్తితో పోల్చవచ్చును.*
*సాయిసన్నిధిలో ఉండే భక్తులకు కూడా, కష్టాలు తప్పవు.*
*జయకర్ షిరిడీలో, సాయిసన్నిధిలో ఉండే సమయములో, మసూచి వ్యాధితో జయకర్ పెద్ద కుమారుడైన రఘునందన్ మరణించాడు.*
*శ్యామరావు జయకర్ భార్యా ఎంతో దుఃఖంతో, బాబా ముందు తన బాధను వినిపించింది.*
*బాబా ఆమెను ఓదారుస్తూ, విధి బలీయమని చెప్పగానే ఆమె కొంత శాంతించింది.*
*కానీ బాబా భక్తుల దుఃఖాన్ని చూస్తూ ఉరుకోలేడు గదా ఆమె దుఃఖం బాబాను చలింపచేసింది.*
*బాబా జయకర్ భార్యతో*
*" దిగులు చెందకు !*
*నీ చనిపోయిన బిడ్డ మరల నీ కడుపున పుడతాడు".*
*బాబా వాక్కు బ్రహ్మ వాక్కు. అది కేవలం ఊరడింపు మాట కాదు. అది సత్యమే అయి తీరుతుంది.*
*విధిని కూడా ఎదిరించగల శక్తి బాబాకు వుంది.*
*బాబా అన్నట్లుగానే జయకర్ దంపతులకు, బాబా మహాసమాధి అనంతరం 1920 సం. లో ఒక బిడ్డ జన్మించాడు.*
*ఆ బిడ్డకు ఆ దంపతులు*
*" రామ్ " అని పేరు పెట్టారు.*
*సాయిబాబా మన కర్మానుసారం తీసివేసినా, మరొక చేతితో ఇవ్వగల సమర్థ సద్గురువు.*
*దానికి ఆయనయందు అచంచల విశ్వాసం, ఓర్పు ఎంతో అవసరం.*
No comments:
Post a Comment