శ్లో *శ్రీమత్పరం బ్రహ్మ గురు స్మరామి.*
*శ్రీమత్పరం బ్రహ్మ గురుం నమామి.*
*శ్రీమత్పరం బ్రహ్మ గురుం యాజామి.*
*శ్రీమత్పరం బ్రహ్మ గురు భజామి.*
*జ్ఞాన స్వరూపులైన పరబ్రహ్మ స్వరూపులగు గురుదేవులను సర్వదా చిత్తమునందు చింతించుచున్నాను.*
*జ్ఞానతేజ స్వరూపులు, పరబ్రహ్మ స్వరూపులైన, శ్రీగురుదేవులను సతతమూ కీర్తించుచున్నాను.*
*చైతన్య స్వరూపులు, పరబ్రహ్మ స్వరూపులైన శ్రీగురుదేవుల వైశిష్ట్యమును చెప్పుచున్నాను.*
*ఆనందస్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీగురుదేవుని ఎల్లవేళలా నమస్కరించుచున్నాను ఈ విధముగా పరబ్రహ్మ స్వరూపులగు గురుదేవులను సర్వకాల అవస్థలయందు స్మరించుట, భజించుట, కీర్తిని గానము చేయుట, నమస్కరించుట ద్వారా శ్రీగురు తత్వ జ్ఞానము పొందగలరు.*
*( శ్రీగురుగీత )*
*"ధ్యానమూలం గురు మూర్తి*
*పూజామూలం గురు పాదం.*
*మంత్రమూలం గురు వాక్యం.*
*ముక్తీ మూలం గురు కృపా.*
*ఈ క్రింది ప్రదేశాలలో దత్త పాదుకలు దర్శించుకొవచ్చు.*
1 *శ్రీ విమల పాదుకలు - ఔదంబర్. మహరాష్ట్ర.*
2 *శ్రీ మనోహర పాదుకలు - నర్సోబావాడి. మహారాష్ట్ర.*
*3 .శ్రీ నిర్గుణ పాదుకలు - గణగాపూర్. కర్ణాటక.*
4 *శ్రీపాద శ్రీవల్లభా - కురువపూర్ -మహబూబ్ నగర్ జిల్లా.*
5 *శ్రీ కరుణ పాదుకా - కడగంచి -కర్ణాటక.*
6 *శ్రీ దత్త పాదుకా - గిరినార్ - గుజరాత్.*
7 *అవధూత పాదుకా - బోలేకుం ద్రి. బెల్గాం సమీపమున. కర్ణాటక.*
8 *ప్రసాద పాదుకా - వాసుదేవానివాస్. పుణె సమీపమున.*
No comments:
Post a Comment