Tuesday, May 14, 2024

శ్రీ రాముఁడు, శ్రీ కృష్ణుడు, మారుతి, జగదాంబ మున్నగు దేవీ దేవతలు మినహాయిస్తే, షిర్డి సాయిబాబాకు ఉన్నటువంటి విసృత ఆరాధన వ్యవస్త మరెవ్వరికీ లేదు

 శ్రీ రాముఁడు, శ్రీ కృష్ణుడు, మారుతి, జగదాంబ మున్నగు దేవీ దేవతలు మినహాయిస్తే, షిర్డి సాయిబాబాకు ఉన్నటువంటి విసృత ఆరాధన వ్యవస్త మరెవ్వరికీ లేదు.*

*సాయినాధుని జీవితంలోనే కాదు, ఆరాధనలోని ప్రతి ఘట్టమూ అనందదాయకమే.*


*ప్రఖ్యాత కవి సి.నారాయణ రెడ్డి గారు షిర్డి సాయి పల్లకి ఉత్చావం గురించి "సాయి మహిమ " చిత్రంలో క్రింది విధంగా వర్ణించారు.*


*"కదిలింది శ్రీసాయి పల్లకీ, కరుణామయుని పూల పల్లకీ" అని సాయిభక్తుల కన్నుల ముందు, కదలాడుతున్న, ఓ పల్లకి ను దర్శింపచేసారు.*


*ఆ పల్లకీ ఒక సుందర స్వప్నం కాదు. భావనామయ రూపం అసలే కాదు. అది సాయి భక్తుల అరాధనకు రూపమే.*

*అది నాటిదా ? అది యిప్పటిదా ? హేమడ్ పంత్ సాయి సచ్చరిత్రలో ఓవి టు ఓవి గ్రంథం (37 వ అధ్యాయము ,118 వ ఓవి ) షిర్డీలో ద్వారకామాయి నుండి చావడికి తొలిసారిగా 10 -12 -1909 నాడు కదిలింది ఆ పల్లకి.*


*నేటికి 113 వసంతాలు పూర్తిచేసుకొన్నాయి.*


*ప్రస్తుతం గురువారము నాడు ఆ పల్లకీ శోభా యాత్ర జరుగుతుంది.*


*మరల గురువారం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు సాయినాధుని, సాయి పాదుకలను ఎదపై నిలుపుకొనెదనో అని ఎదురు చూసే జీవరూపం ఆ పల్లకీ.*


*ఒకసారి షిర్డి గ్రామములో భారీ వర్షాలు కురిసాయి*

 

*ఆ సమయములో కొందరు సాయిభక్తులు, శిధిల అవస్థలో ఉండి, వర్షపు నీరుతో తడిసిపోయే ద్వారకామాయి లో, సాయిబాబా నిద్రించటం సమంజసం కాదని, బాబాకు ఎంతగానో నచ్చ చెప్పినా, సాయిబాబా పట్టించుకొలేదు.*

*భక్తులు సాయిబాబా కంటె మొండివారు.*


*నారాయణ తేలి అను సాయిభక్తుడు ,బాబా వద్దని వారిస్తున్నా వినకుండా, చావడికి బలవంతంగా మోసుకొని తీసుకెళ్లాడు. అతనికి బాబా పై గల ప్రేమ అటువంటిది.*


*ఆ రాత్రి బాబా చావడిలో నిద్రించాడు. మరునాడు ద్వారకామాయిలో నిద్రించాడు.*


*అప్పటినుంచి షిరిడీలో బాబా రోజు విడచి రోజు చావడిలోనూ, ద్వారకామాయిలోనూ నిద్రించసాగాడు.*


*అయితే చావడిలో ప్రప్రథంగా నిద్రించిన తారీఖు గాని, సంవత్సారం తెలియటం లేదు.*


*ఇక కొంతకాలం తరువాత బాబా చావడిలో నిద్రించే సందర్బం పురస్కరించుకొని, భక్తులు బాబా ద్వారకామాయి నుండి చావడికి నిద్రించటానికి వెళ్ళడం ఒక పల్లకీ శోభా యాత్రగ రూపొందించారు.*

*అదే చావడి ఉత్చావం అని, పల్లకి ఉత్సవం అని అంటారు.*


*ఆ పల్లకి యాత్ర* 

*10 -12 -1909 నుండి రోజు విడచి రోజు జరిగేది.*


*10-12-1910 శేజ్ ఆరతి మరియు 11-12-1910 ప్రథమంగా కాకడ ఆరతి చావడి లో సాయి మహారాజ్ కు జరుపబడెను.* 


*(సాయి సచ్చరిత్ర - అధ్యాయము 37)*


*10-12-1910 సాయి ఆశ్శీసులతో దీక్షిత్ వాడా శంఖు స్థాపన జరగడం విశేషం.*


*10-12-1910 రోజున, కొన్ని నెలలుగా శిరడిలో వున్న కపర్దే కు, తన స్వగృహం, అమరావతికి తిరిగి వెళ్ళుటకు సాయి అనుమతి ఇచ్చారు.*


*బాబా సమాధి అనంతరం చావడి ఉత్చావం ప్రతి గురువారము జరుగుతుంది .*


*సాయిబాబా సమాధి అనంతరం ప్రతి గురువారము జరపబడుచున్నది, చావడి ఉత్చావం ఒక సంఘటన కాదు.*


*ద్వారకామాయి నుండి చావడి వరకు సాగే ఈ అమృతవాహిని  కొనసాగుతుంది.*

No comments:

Post a Comment