Tuesday, May 14, 2024

షిరిడీ సాయిబాబాకు ఇచ్చే నాలుగు హారతులలో, ప్రభాతసమయాన ఇచ్చే కాకడ హారతి, శేజ్ హారతులు విశేష ప్రాధాన్యత సంతరించుకున్నవి.*

 షిరిడీ సాయిబాబాకు ఇచ్చే నాలుగు హారతులలో, ప్రభాతసమయాన ఇచ్చే కాకడ హారతి, శేజ్ హారతులు విశేష ప్రాధాన్యత సంతరించుకున్నవి.*


*ఇందులో పాండురంగ భక్తులు, సంత్ కవులైన జ్ఞానేశ్వర మహరాజ్ కు సంబంధించిన అభంగాలు, భక్తతుకారామ్, నామదేవ్, జానాబాయి రచించి పాడిన అభంగాలు మనకు వినబడతాయి.*


*ముఖ్యముగా షిరిడీలో చావడిలో భక్తులు బాబాకు శేజ్ హారతి ఇచ్చేటప్పుడు, జ్ఞానేశ్వర మహరాజ్ సంబంధించిన పాట భక్తులు పాడినప్పుడు సాయిబాబా చేతులు జోడించి నమస్కరించేవారు.*

 

*జ్ఞానేశ్వర మహరాజ్ రచించిన జ్ఞానేశ్వరి, భావార్థ దీపిక అనే గ్రంథాలను బాబా తన భక్తులచే పారాయణ చేయించెడివారు.*


*మరాఠీలో ప్రఖ్యాత సంత్ కవి అయిన జ్ఞానేశ్వర మహరాజ్ తన 14 వ ఏటా సంస్కృత భాషలో ఉన్న భగవద్గీతను ప్రజలు తప్పుగా అర్థం చేసుకొంటున్నారని కలవరపడ్డాడు.* 

*ప్రజల భాష అయిన మరాఠిలో ఆ తత్వాన్ని అందివ్వటానికి నడుంకట్టాడు.* 

*తన సోదరుఁడు, గురువైన నివృత్తినాధుడు ఆ నిర్ణయానికి ఆనందించాడు.*

 

*గోదావరి నదికి దక్షిణ తీరాన, ముల్లోకాలను అనాది పంచకోశ క్షేత్రమైన నెవాసా వద్ద మోహినిరాజ్ పేరుతో విష్ణువు కొలువై ఉన్నాడు.* 


*జ్ఞానేశ్వరుడు అక్కడున్న ఒక స్థంభానికి ఆనుకొని ఒక గ్రుడ్డి దీపపు వెలుగులో గీతాప్రవచనం చేసాడు.*

*ఆ స్థంభం ఇప్పటికీ నెవాసా మందిరంలో కనిపిస్తుంది.*


*జ్ఞానేశ్వరుని శిష్యుడైన సచ్చిదానంద బాబా జ్ఞానేశ్వరి గ్రంధాన్ని ఎంతో శ్రద్దతో లిఖించాడు. జ్ఞానేశ్వరి దేశభాష అయిన మరాఠికే కాదు.* 

*దేశమాతకు ఒక విలువైన ఆభరణం.*

*ఆ ఆభరణానికి అక్కడక్కడా దుమ్ము ధూళి శోకింది.*


*1296 సం. కార్తీక బహుళ త్రైయోదశి నాడు జ్ఞానేశ్వరుఁడు తన 21 వ  సంవత్సరంలో ఆళంది పట్టణములో సజీవ సమాధి చెందారు.*


*జ్ఞానేశ్వరమహరాజ్ నేటికీ సజీవుడే.*


*దాదాపు 300 సంవత్సరాల తరువాత సంత్ ఏకనాధ్ మహరాజ్ (1533 -1599 )* *కలలో జ్ఞానేశ్వర మహరాజ్ కనిపించి " ఏకనాధ్ ! ఇక్కడ నా సమాధి పై చెట్లు వ్రేళ్ళు నా కంఠంలో గుచ్చుకొంటున్నాయి.* *వాటిని తొలగించగలవా " అని అడిగారు.* 


*ఏకనాధుడు ఎంతో కష్టంతో జ్ఞానేశ్వరుని సమాధిని గుర్తించి, తేజోవంతమైన సూక్ష్మ దేహానికి నమస్కరించి చెట్టును వ్రేళ్ళను సమూలంగా ఖండించాడు.* 

*అప్పుడు ఏకనాధ్ తో జ్ఞానేశ్వరుఁడు " నిన్ను కలవటానికి చెట్టువ్రేళ్లు నిమిత్తమాత్రం.*

*అసలు కారణము విను !* *నేను రచించిన జ్ఞానేశ్వరి గ్రంధము ఎందరిచేతులలో పడి ఇష్టంవచ్చినట్లు మార్చివేయబడినది.*

*అసలు పాఠాన్ని లోకానికి అందించే బాధ్యత నీమీద పెడుతున్నాను " అని అన్నారు.*

*ఏకనాధుడు దానికి సమ్మతించాడు. మూఁడు రోజులు వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది.*

*ఏకనాథుడు జ్ఞానేశ్వరునికి ప్రణమిల్లాడు. ఒక ఏడాదిలో జ్ఞానేశ్వరి గ్రంథాన్ని పరిష్కరించాడు.*


*ద్వారకామాయిలో సాయిబాబా తన వారితో* 

*జ్ఞానేశ్వరి గ్రంథ పారాయణం చేయమని అదేశించేవారు.*


*నేడు అనగా 10-12 -2023 కార్తిక బహుళ త్రయోదశి ఆదివారము జ్ఞానేశ్వరమహరాజ్ పుణ్యతిథి.* 


*జ్ఞానేశ్వరుని స్మరణచేద్దాం.*

No comments:

Post a Comment