జగత్తులోని అన్ని రూపాలు ధరించిన తత్వం తానే అని అనుభవపూర్వకంగా భక్తులకు తెలియచేసిన, ఆ రూపాతీతుని రూపం సాయిభక్తుల ధ్యానానికి ధ్యేయం, ఆనంద అనుభూతికి ఆలంబనం "*
*శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.*
----------------------------------------
*దాదాకేల్కర్ షిర్దీ నివాసి.*
*సాయిబాబా అంటే గిట్టదు.*
*సాయిబాబా అనుమతిస్తే తాను కేల్కర్ కుమార్తెను వివాహమాడతానని సాయిభక్తుడైన హరివినాయక్ సాఠే కేల్కర్ కు చెబుతాడు.*
*బాబా ఈ సంబంధానికి ఒప్పుకోడని కేల్కర్ అనేక ఇతర మార్గాలు సూచించాడు.*
*బాబా అంగీకరిస్తేనే పెళ్లాడతాను అని అంటాడు హరివినాయక సాఠే.*
*గత్యంతరం లేక కేల్కర్ తన కుమార్తెను వెంటబెట్టుకుని బాబాను దర్శిస్తాడు.*
*విశ్వప్రేమికుడైన సాయిబాబా కు కేల్కర్ పైన ఎందుకు కోపం ఉంటుంది ?*
*బాబా వెంటనే కేల్కర్ కుమార్తె నొసట కుంకుమ బొట్టుపెట్టి "ఈ బిడ్డను అహ్మదాబాద్ కు (అంటే సాఠేతో వివాహం చేసి) పంపు " అని ఆశీర్వదించాడు. బాబా అనుమతితో వివాహం జరిగింది.*
*సాయిబాబా కు ఎవరిమీదా కోపం, ద్వేషం ఉండవని, ఆయన సత్పురుషుడని కేల్కర్ గ్రహించాడు.*
*అలా గ్రహించడమేకాదు, సాయి సన్నిధే పెన్నిధిగా ఉండిపోయాడు.*
*విశ్వంలోని సర్వ ప్రాణుల శ్రేయస్సు చూసేది ఆ జగన్నాధుడైన సాయినాధుడే కదా !*
No comments:
Post a Comment