*పాండురంగ భక్తురాలైన జానాబాయి రచించిన భక్తి గీతాలు మనకు కాకడ హారతిలో వినిపిస్తాయి.*
*ఆమె మరొక పాండురంగ భక్తుడైన నామదేవ్ ఇంటి పరిచారిక.*
*జానాబాయి అపరిమిత భక్తి శ్రద్ధలు విని కొంతమంది భక్తులు ఆమె వద్దకి వెళ్లారు.*
*జానాబాయి పశువుల పేడను పిడకలు గా ఎండబెట్టి, వంటకు పొయ్యిలో ఉపయోగించేది.*
*ఒకసారి అమె పేడతో పిడకలు చేసి ఆరటానికి, ఇంటి గోడకు పెట్టి వెళ్లిపోయింది.*
*అది చూసి ఆ పిడకలు ఆరిపోయిన తరువాత, ఆ పక్కింటి మహిళ దొంగిలించింది.*
*పైగా జనాబాయితో తగవు పెట్టుకొంది. "గోడకు ఉన్న పిడకలన్నీ నావే "అని వాదించసాగింది.*
*అదివిన్న జానాబాయి అక్కడున్నవారితో "నేను పెట్టిన పిడకలలో పాండురంగని నామం వినిపిస్తుంది.*
*పిడకలును చెవి క్రింద పెట్టుకుని వినండి.*
*పాండురంగ నామం వినిపిస్తుంది " అని చెప్పగా, అక్కడ గల భక్తులు ఆమె చెప్పినట్లే చేసారు.*
*వారికి పిడకలలో పాండురంగ నామం వినిపించింది. ఆ పిడక లన్ని జానాబాయివే అని తీర్పు చెప్పారు.*
*జానాబాయి తనుచేస్తున్న ప్రతిపని యందు పాండురంగ నామ స్మరణ చేస్తూ పనులు చేసుకునేది.*
*నామ స్మరణే ముక్తికి మార్గము.*
*" పాండురంగ హరి, జై జై రామకృష్ణ హరి, పాండురంగ హరి, జై జై రామకృష్ణ హరి.*
No comments:
Post a Comment