*షిరిడీ సాయిబాబా భక్తురాలైన రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ భార్యతో "తల్లీ ! ప్రతిదినమూ ముమ్మారు మీ ఇంటికి వెళ్లవలిసి వచ్చుచున్నది,* *అని బాబా అన్నారు.*
*అదేసమయమున అక్కడ ఉన్న ఒక షిరిడీ నివాసీ బాబా మాటలు విన్నది.*
*"బాబా ! ఏమిటీ, చాలా వింతగా మాట్లాడు చున్నావు ? " అని అన్నది ఒక మహిళ.*
*ఆమె ద్వారకామాయి లో ప్రతిదినం సాయిబాబాను చూచుచునే ఉన్నది.*
*బాబా షిర్డీ విడచి ఎచ్చటికినీ దూర ప్రదేశానికి వెళ్లుట ఆమెకు తెలియదు.* *అప్పుడు బాబా " నేను అసత్యము చెప్పను. నేను మహాలక్ష్మిని. అమ్మా ! నేను మీ ఇంటికివస్తూనే ఉన్నాను.*
*తినుటకు నీవు నాకు ఇస్తున్నావు. ఇది సత్యం కాదా ? అని బాబా తర్ఖడ్ భార్యను అడుగుతాడు.*
*" అవును బాబా ! అంటుంది తర్ఖడ్ భార్య.*
*ఇంకా బాబా అక్కడ ఉన్న షిరిడీ మహిళతో "అమ్మా ! నేను సులభముగా బాంద్రా పట్టణంలోని ఈమె (తర్ఖడ్ ) ఇంటికి వెళ్ళుచుందును.*
*మధ్యలో ఒక గోడ ఉన్నది. గోడ దాటినా తరువాత రైలు మార్గమున్నది.*
*అటు తరువాత ఈమె ఇల్లు ఉన్నది.*
*నేను గోడలు త్రవ్వకములు పై ఎగిరివెళ్లవలిసి వచ్చుచుండును " అని బాబా అన్నారు అక్కల్కోట మహరాజ్ శిష్యుడు దత్తస్వామి.*
*దత్తస్వామినే కుంభార్ స్వామి అని, శ్రీకృష్ణ సరస్వతి స్వామి అని పిలుస్తారు.*
*ఆ దత్త స్వామికి ఎందరెందరో భక్తులు, శిష్యులు.*
*దత్తస్వామి భక్తుల ప్రేమకు లొంగిపోయేవాడు.*
*ఆయన భక్తుడు ఒకని పేరు భాస్కర్.*
*అతడు పండరీపురం యాత్ర చేయదలచి తన గురువైన దత్తస్వామి అనుమతి కోరాడు.* *దత్తస్వామి వెంటనే అనుమతించాడు.*
*భాస్కర్ అప్పటికప్పుడు ఉన్నపళాన అక్కడనుండే పండరీపుర యాత్రకు బయలుదేరాడు.*
*తన స్వస్థలమైన కోల్హాపూర్ వూరు చివరకు వచ్చాడు అక్కడ ఎందరో పండరికి పాదయాత్ర చేస్తున్నారు మరికొందరు ఎడ్లబండ్లపైన వెళుతున్నారు.*
*భాస్కర్ కు చేతిలో డబ్బులేదు.*
*ఓపిక కూడా లేదు. అయినా పాండురంగని దర్శనం కొరకు తహతహలాడుచున్నాడు.*
*ఈలోగా పండరీపురం పోయే ఒక ఎడ్లబండి అతని పక్కన ఆగింది.*
*"మీరు పండరీ యాత్ర చేస్తున్నారా ? అని బండి యజమాని ప్రశ్నించాడు.*
*" అవును " అని పలికాడు భాస్కర్." అయితే బండి ఎక్కు " అని అన్నాడా యజమాని."*
*నావద్ద డబ్బులు లేవు "అని అన్నాడు భాస్కర్.*
*" నాకు కావలసింది డబ్బు కాదు. తోడు కావాలి. ఒంటరిగా పండరియాత్ర చేసి రాలేను ." అని అన్నాడు యజమాని.*
*భాస్కర్ సంతోషముగా బండి ఎక్కాడు. బండి యజమానితో కలసి పండరీనాధుణ్ణి దర్శించాడు.*
*ఇద్దరూ ఆనందించారు. ఇక తిరుగు ప్రయాణం సాగించారు.*
*ప్రయాణం ముగించుకుని, చివర మరల బండి కొల్హాపూర్ ఊరు చివర ఆగింది.*
*భాస్కర్ బండి యాజమానితో " నేను వచ్చేదాకా ఆగండి.*
*నేను మీబండి బాడుగ నిమిత్తం డబ్బు పట్టుకొని వస్తాను " అని ఇంటికి వడివడిగా వెళ్ళి బండి యజమానికి ఇవ్వడానికి డబ్బులు పట్టుకొచ్చి చూస్తే ఊరిచివర బండి లేదు, బండి యజమాని లేడు. చాలాసేపు డబ్బు ఇవ్వటానికి అక్కడే నిలబడ్డాడు. నిద్రవస్తే అక్కడే కునుకు తీశాడు.*
*ఆ స్వప్నములో దత్తస్వామి కనిపించి నవ్వుతూ " బిడ్డా ఇంటికి పో ! ఇక బండివాడు రాఁడులే ! " అని అన్నారు.*
*అప్పుడు గ్రహించాడు భాస్కర్, ఆ బండివాడు తన దైవమైన దత్తస్వామి అని.*
*సత్పురుషులు తమను నమ్మినవారిని,ఆశ్రయించిన వారిని అనేక రూపాలలో అనుగ్రహించి రక్షిస్తారు*జగత్తులోని అన్ని రూపాలు ధరించిన తత్వం తానే అని అనుభవపూర్వకంగా భక్తులకు తెలియచేసిన, ఆ రూపాతీతుని రూపం సాయిభక్తుల ధ్యానానికి ధ్యేయం, ఆనంద అనుభూతికి ఆలంబనం "*
*
No comments:
Post a Comment