సాయినాధ్ - ఖండోబా మందిర పూజారి అయిన మహల్సాపతి సాయిబాబాకు " సాయి " అని నామకరణం చేశాడు.*
*సాయి అన్న పదం మహల్సాపతి నోటంట అప్రయత్నంగా వచ్చిందే తప్ప, ఉద్దేశపూర్వకంగా కాదు.*
*" సాయి " అన్న నామమే ఈనాడు కోట్లాదిమందికి నిరంతర స్మరణగా మారింది.*
*" సాయి " అనగా అది రెండు పదాల కలయిక.* *సా + ఆ యి = సాయి ." సా " అనగా సగుణ ." ఆయి " అనగా తల్లి.*
*అనుకోకుండా ఈ నామములో మాతృత్వం కనిపిస్తుంది. ఇది సాయిబాబా మాతృస్వరూపం సూచిస్తుంది. తల్లికి తన బిడ్డల యెడలగల వాత్సల్యం.*
*సాయిబాబాకు తన భక్తుల యందు గల ప్రేమ అపారము. బాబా తల్లికి మించిన తల్లి.*
*సాయి సచ్చరిత్ర పారాయణం చేసినవారికి బాబా మాతృ ప్రేమ కన్పిస్తుంది.*
*" నాధ " అను పదమునకు భరించువాడని అర్థం " మీ భారములు నాపై పడవేయుడు. నేను మోసెదను " అని బాబా చెప్పినట్లుగా, ఆయనను శరణువేడిన భక్తుల భారములను ఈనాటికి మోస్తున్నారు. అందుకే సాయినాధునిగా కీర్తిస్తూన్నారు.*
*మహరాజ్ - మహరాష్ట్రలో సాధు సత్పురుషులను మహరాజ్ అనిపిలుస్తారు.*
*సాధారణంగా మహరాజ్ అనే పదానికి ఒక రాజ్యానికి రాజుని మహరాజ్ అని పిలుస్తారు.*
*మనం కీర్తిస్తున్న*
*" సాయిమహరాజ్ " అన్న పదానికి అర్థం చెప్పటానికి మాటలు చాలవు.*
*బాబా ఎప్పుడూ " నా ధనాగారం నిండిపోయి విపరీతంగా పొంగి పొర్లుతుంది . నేను అడిగినవారందరికీ ఇస్తూనేవున్నాను.*
*కానీ నేనిచ్చేది తీసుకొనుటకు ఎవరూ ముందుకి రావటం లేదు " అని చెప్పేవారు.*
*బాబా ఇహిక సుఖాలేగాక పరలోక సుఖాలు ఇవ్వగల సమర్థుడు.*
*అవతార్ మెహర్ బాబా చెప్పినట్లు " సాయిబాబా గూర్చి నాకు తెలిసిన జ్ఞానం, మీకు కూడా కలిగితే ఆయన ఈ విశ్వానికి పరిపూర్ణుడైన, పరిశుద్ధమైన ప్రభువుగా మీరు అంగీకరిస్తారు " అని అన్న సత్యం గుర్తించాలి.*
*అందుకే అయనను*
*" సాయిమహరాజ్ " గా కీర్తిస్తుంటారు.*
*ఇంతవరకు మనం వివరించిన ," అనంతకోటి బ్రహ్మాండనాయకా, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ , శ్రీ సచ్చిదానంద, సద్గురు, సాయినాధ్ మహరాజ్ కి జై " అన్న స్తోత్రంలో సాయిబాబా విశ్వరూపం కనిపిస్తుంది.*
*( ఇంగ్లీష్ వాఖ్యకు తెలుఁగు అనువాదము )*
No comments:
Post a Comment