*తండ్రి మాటకు తలొగ్గి శ్రీరాముడు ఆదర్శపురుషుడు అయితే ...*
*తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకొని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు.*
*అంపశయ్యపైనే విష్ణు సహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ప్రీతికరమైన మాఘ శుద్ద ఏకాదశిని తన పేరిట బహుమానం పొందిన పురాణపురుషుడు.*
*ఈ రోజు భీష్మ ఏకాదశి.*
*అది ద్వాపరయుగం శోభకృతు నామ సంవత్సరం మాఘ శుద్ధ అష్టమి.*
*ప్రత్యక్ష తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా, ఆ మధ్యాన్నం వేళ (అభిజిత్ లగ్నంలో ) శ్రీ మహా విష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైయ్యాడు భీష్ముడు.*
*ఆ పురాణ పురుషుడు దేహత్యాగం చేసిన రోజే భీష్మాఅష్టమి.*
*మరణించే ముందు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడు రోజుల తర్వాత వచ్చే ఏకాదశిని ఆ కురువృద్దుని పేరిట భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి పొందింది.*
*
*మనమందరం విశేషముగా విష్ణు సహస్రనామ పారాయణ చేద్దాం.*
*శ్రీ సాయి సచ్చరిత్రలో 27 వ అధ్యాయములో తన అంకిత భక్తుడైన శ్యామాకు విష్ణు సహస్ర పారాయణ చేయమని సాయి ఆదేశించారు.*
*విష్ణు సహస్ర నామ పారాయణ దుష్ట శక్తులను పోగొట్టుటయే గాక ఆధ్యాత్మిక సాధనలో వచ్చే అడ్డంకులను పోగొడుతుంది.*
*విష్ణు సహస్ర నామాన్ని ఏ విధమైన నియమాలు లేకుండా చేయవచ్చును ' అని అంటారు శ్రీ సాయి పాదానందగా పిలవబడే శ్రీ రాధాకృష్ణ స్వామీ.*
No comments:
Post a Comment