Tuesday, May 14, 2024

గురుపాడ్యమి.*

 గురుపాడ్యమి.*



*కలియుగములో రెండవ దత్తావతారమైన శ్రీ నృశింహ సరస్వతి స్వామి వారు శ్రీశైలం పాతాళ గంగ తీరమున ఒక పుష్పరధము అధిరోహించి నిజానంద గమనం చేరి తమ అవతార సమాప్తి గావించిరి.*

*ఆ రోజు బహుధాన్య సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం మాఘ బహుళ పాడ్యమి శుక్రవారం, పుష్యమీ నక్షత్రం దినము అవతార సమాప్తి చేసారు.*

*శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు చివరగా గాణ్గాపూర్ నందు 23 సం. ప్రవాసం చేసి ఎన్నొ విశేషములు జరిగినవి.*

*భక్తుల శారీరిక మానసిక బాధలు తొలగించి అందరినీ అనుగ్రహించారు.* 

*శ్రీ స్వామి వారు చూపిన లీలలు అనంతం.*


*అందులొ భాగముగా శ్రీ గురుచరిత్ర 40 అధ్యాయములో నరహరి కుష్టు రోగము తొలగించుట.*

*అందుకు గాను శ్రీ నరహరి చేసిన శ్రీ నరసింహ సరస్వతి స్వామీ వారిని స్తోత్రం  చేసిన అష్టకం ఎంతో మహిమన్వితమైనది.*


*ఈ గురుపాడ్యమినాడు ఆ స్తోత్రాన్నీ పఠించి దత్తాత్రేయుని అనుగ్రహం పొందుదాము.*

No comments:

Post a Comment