Tuesday, May 14, 2024

శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించిన నక్షత్రమాలిక స్తోత్రం,18 వ శ్లోకములో ...*

 *శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించిన నక్షత్రమాలిక స్తోత్రం,18 వ శ్లోకములో ...*


*" కారంజనగారేప్యమ్బా మాధవ* 

*ద్విజతో విభుః  మాసి పౌషిసితే పక్షే ద్వితీయాయం శనిర్దినే "* 

*కరంజ నగరంలో అంబ, మాధవ శర్మ అను ద్విజ దంపతులకు పుష్యమాసం శుక్లపక్ష విదియ నాడు శనివారమున అవతారం తీసుకున్నారు.*

*ఈ రోజు అనగా* 

*13 -1 -2024  శనివారం, పుష్య శుద్ద విదియ.*


*ఈ రోజునే కలియుగంలో రెండవ దత్తావతారమైన శ్రీ నృశింహ సరస్వతి స్వామి వారు జన్మించిన తిథి.* 

*ఈ సంవత్సరం స్వామి వారి జన్మ దినం, తిథి, వారం కలసిన, విశేషమైన పర్వదినం.*


*ఈ రోజున శ్రీ గురుచరిత్ర 40 వ అధ్యాయములో భక్తుడైన నరహరి అను బ్రాహ్మణుడు స్తోత్రం చేసిన "శ్రీ నరసింహ సరస్వతి స్తోత్రమును పఠించి శ్రీ గురు దత్తాత్రేయుని కృపా కటాక్షములు పొందవచ్చును.* 


*దత్త సంప్రదాయములో ఈ స్తొత్రమును "మహాస్తోత్రం " గా  చెప్పుట పరిపాటి.*

*ఇది అమోఘమైన స్తోత్రం.* 


*గాణ్గాపుర్, నర్సోబావాడి మున్నగు దత్త క్షేత్రములలో పల్లకీ ప్రదిక్షిణ సేవలో దీనినే గానము చేయుదురు.*

No comments:

Post a Comment