Tuesday, May 14, 2024

సాయిబాబా శ్యామా అనే భక్తునికి విష్ణు సహస్ర నామాన్ని పారాయణచేయమని అదేశించారు

 *సాయిబాబా శ్యామా అనే భక్తునికి విష్ణు సహస్ర నామాన్ని పారాయణచేయమని అదేశించారు* 


*విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేస్తూ సాయి బాబా పై నమ్మకం పెట్టుకోమని బెంగళూరు కు చెందిన సాయి పాదానందగా పేరొందిన శ్రీ రాధాకృష్ణ స్వామీజీ. స్వామీజీ శ్రీ .బి .వి. నరసింహస్వామి గారి శిష్యులు.*

 

*ఆయన తరచూ భక్తులతో "విష్ణు సహస్ర నామ పారాయణ దుష్ట శక్తులను, పోగొట్టుటయేగాక, ఆధ్యాత్మిక సాధనలో వచ్చే అడ్డంకులను పోగొట్టుతుంది.*

*విష్ణు సహస్ర నామాన్ని ఏ విధమైన నియమాలు లేకుండా చేయవచ్చును " అని చేప్పెడివారు.*


*స్వామీజీ ఒకసారి ఊటీ పట్టణంలో వుండగా ఒక వ్యక్తి వచ్చాడు.* *ఆయనకున్న ఇద్దరు కుమార్తెలకు వివాహం కావడం లేదని చెప్పాడు.*

*స్వామీజీ ఆయన కుమార్తెలిద్దరినీ పిలిపించారు.*


*ఆ యువతులతో 25 రోజులు విష్ణు సహస్ర నామ పారాయణం చేయమని చెప్పారు.* 

*దానితో పాటు వారి ఇంటికి ఎదురుగా ఉన్న తులసి మొక్కకు ప్రదక్షణలు కూడా చేయమని చెప్పారు దినపత్రికలలో తగిన వరులకొరకు ప్రకటన ఇమ్మని కోరారు. స్వామీజీ ఆదేశించినట్లు ఆ ఇద్దరి యువతులకు వివాహం జరిగింది.*

*ఇందంతా విష్ణు సహస్ర నామ పారాయణ ఫలితమే అన్నారు స్వామిజీ.*

 

*స్వామీజీకి సాయి పధమును తెల్పిన మహనీయుడు శ్రీ బి.వి. నరసింహస్వామి గారు.* *ఆయన అంటే స్వామీజీకి భక్తి ప్రపత్తులు వున్నాయి.*


*స్వామీజీకి మనుష్యులమీదే కాదు, జంతువుల మీద కూడా ఆపార కరుణ ఉండేది.* 


*స్వామీజీ బెంగుళూరు వచ్చిన కొత్తలో ఆయన వద్దకు ఎవరో ఒక చూడి ఆవును తీసుకొచ్చారు.* *అది ప్రసవ వేదన పడుతుంది.* 

*స్వామీజీ ఆయన చేతితో దాని వంటిపై రుద్ది సుఖ ప్రసవం అవుతుందని చెప్పారు.*

*కొన్ని రోజులతరువాత ఆ ఆవు యజమాని, సుఖప్రసవమైన ఆ అవును దాని దూడను స్వామీజీ వద్ధకు తీసుకొచ్చాడు.*

*ఆ ఆవు స్వామీజీ వంక పదేపదే చూడసాగింది.*

*స్వామీజీ అక్కడివారిని పిలచి " ఈ ఆవు యొక్క కృతజ్ఞతను చూడండి " అని అన్నారు.*

*మానవులమైన మనం తోటివారి యందు ఇంత కృతఙ్ఞతలు చూపుతున్నామా ? అని ప్రశ్నించారు.*


*స్వామిజీ జనవరి 14 -1980 సం. న సాయి చరణాలలో ఐక్యమయ్యారు.*


*నేటికి శ్రీ రాధాకృష్ణ స్వామీజీ సాయి లో ఐక్యమై 44 వసంతాలు ముగుస్తాయి.*


*షిరిడీలో సాయిబాబా సంస్థాన్ వారు స్వామీజీ ఫొటోను సమాధిమందిర్ హాలులో గల ఫొటొ గ్యాలరీలో ఏర్పరిచారు. భక్తులు ఆ చిత్రపటాన్ని దర్శించుకోవచ్చు.*

No comments:

Post a Comment