*🌞మకర సంక్రాంతి నాడు సాయినాధుని కి గంగోదక స్నానం.🌞*
*హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్రలో " ఈ (షిర్డీలోని ) సాయి సత్పురుషుడు ఈశ్వరుని మరో అవతారం " అని వ్రాశాడు.*
*సాయి అంకిత భక్తుడైన హరి వినాయక సాఠేకు సాయిబాబాకు గంగోదక స్నానం చేయించాలి అని ప్రగాఢమైన కోరిక ఉండేది.*
*సాఠే ప్రభుత్వంలో ఉన్నత శ్రేణి అధికారి గా ఉన్నాడు. ఆయన షిరిడీలో మకాం వేసుకొని సాయినాధుని కి గంగోదక స్నానాలు, పూజలు స్వయముగా చేయలేడు.*
*మేఘశ్యాముడనే అను వ్యక్తి సాఠేకు పరిచయమయ్యాడు. ఆప్తుడయ్యాడు కూడా. మేఘుడు శివ భక్తుడు.* *అందుచేత సాఠే సాయిబాబాను సేవించడానికి మేఘశ్యాముడిని షిర్డి సాయిబాబా వద్దకి పంపాడు.*
*మొదటగా సాయిబాబా మహమ్మదీయుడనే భావన జీర్ణించుకున్న మేఘుడు షిరిడీలో ఉండలేక వెళ్లిపోయాడు. నాసిక్ త్రయంబక క్షేత్రాన్ని చేరాడు.*
*అక్కడ అతనికి శివలింగం కనిపించలేదు. శివలింగ స్ధానంలో సాయిబాబా యే కనిపించాడు. అతడు ఆశ్చర్యపోయాడు.*
*శివుడే సాయినాధుడు అని నిర్ధారించుకొన్నాడు.*
*ఇక అప్పటినుంచి తనువు, మనసు అంతా సాయి యే నిండిపోయాడు.*
*నాసిక్ నుండి బయలుదేరి షిరిడీ చేరాడు. షిరిడీలో సాయినాథుని తనివితీరా దర్శించాడు. ఇక అక్కడే ఉండిపోయాడు.* *రేయింబవళ్లు "సాయి శంకర్ " నామ స్మరణ చేసెడివాడు.*
*షిరిడీలో శివునికి ఇష్టమైన బిల్వపత్రాలు లభించేవి కావు.*
*వాటికోసం మైళ్లు నడచేవాడు.*
*సుందర దేహము కలవాడు, బలిష్ఠుడు, జఠాధారి అయిన మేఘశ్యాముడు ఒంటికాలిపై నిలబడి, తలతిప్పకుండా సాయిబాబాను తదేకంగా చూస్తూ ఆరతులు ఇచ్చెడివాడు.*
*దినమూ షిర్డిలోని గ్రామదేవతలను ఆరాధించి, చివరగా తన ఆరాధ్యదైవం, శివ స్వరూపముగా సాయిని భావన చేసి పూజించెడివాడు.*
*ఒక మకర సంక్రాంతి పర్వదినాన గొదావరి నదీ జలాలు తెచ్చి, బాబాకు నలుగు పెట్టి, చందనం అద్ది, స్నానం చేయించాలని మేఘుడి మనసులో కోరిక పుట్టింది.*
*బాబా అనుమతి పొంది, సూర్యోదయానికి ముందే మేఘుడు ఖాళీ బిందెను తీసుకుని, ఎండవేడిమి నుంచి రక్షించే గొడుగు అయినా తీసుకోకుండా,కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా, గొదావరి నదివైపు షుమారు 25 మైళ్లు నడచి, గొదావరి జలాలు తీసుకొచ్చి, షిరిడీలో బాబా కు స్నానం చేయించాలని అతని కోరిక.*
*ఈ రోజు మకర సంక్రాంతి పండుగ.*
*సాయి రూపంలో ఉన్న, శంకరునికి గోదావరి జలాలతో స్నానం చేయిస్తే ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడని ఎంతో ప్రేమపూర్వకంగా మేఘశ్యాముడు బాబాకు స్నానం చేయించి తన అభీష్ఠాన్ని నెరవేర్చుకొన్నాడు.*
*సాయిబాబా కూడా తన దివ్యలీలలతో ఆ గంగోదక అభిషేకాన్ని స్వీకరించి మేఘశ్యాముని అనుగ్రహించారు.*
*సాయిబాబా పరమశివుఁడు భస్మధారులు, భిక్షాపాత్రధారులు.*
No comments:
Post a Comment