*' చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు, కొంచమైన అదియు కొదవు కాదు. విత్తనంబు మర్రివృక్షం బునకు ఎంత ...' అన్నాడు వేమన.*
*మనిషి ఏ పనినైనా చిత్తశుద్ధితోచేయాలి.*
*దాని వల్ల సిద్ధిన్చే ఫలితం ఎంత చిన్నదైనా తక్కువేమీకాదు. మర్రి విత్తనం చిన్నదిగా ఉంటుంది.*
*దాన్ని సారవంతమైన భూమిలో నాటితే మొలకిత్తి, కాలక్రమములో మహా వృక్షంగా రూపొందుతుంది.*
*మనిషి చిత్తం (మనసు ) సైతము సారవంతమైన క్షేత్రము వంటిందే.*
*సమాజంలో అనేక రకాలైన కాలుష్యాల గురించి వింటున్నాం.*
*వీటి అన్నింటికంటే ప్రమాదకరమైనది మనో కాలుష్యము. దీన్ని ' భావ కాలుష్యం ' అనవచ్చు.*
*బయటపడాలంటే మన చిత్తం శుద్దిగా స్వచ్చందంగా ఉండాలి.*
*స్వచ్ఛమైన వీధులు, నగరాలూ, దేశాలు, స్వచ్చమైన మనసుల వల్లనే సాధ్యపడతాయి.* *అనేకమంది బాహ్యశుద్దికి అత్యంత ప్రాధాన్యమిస్తారు. అది నాగరిక లక్షణమే.*
*నిత్యం చేసే పూజలలోను - బాహ్య అంతర శుద్ది అవసరమైనా లోపలి శుద్ది అంతకంటే ముఖ్యమైనది.*
*ద్రవ్యశుద్ధి, పాక శుద్ది వంటి మాటలూ వున్నాయి.*
*ఎలాంటి అక్రమాలకు, అన్యాయాలకు తావు లేకుండా న్యాయార్జిత విత్తంతో జీవితం సాగించినప్పుడు అది ద్రవ్య శుద్ది.*
*ఆత్మ శుద్ది లేని ఆచారమది ఏల, భాండము శుద్ధిలేని పాకమేల ' అని పలికిన వేమన - చిత్తశుద్ది లేకుండా శివుణ్ణి పూజిస్తే లాభమేమిటని నిలదీసాడు.*
*చిలుము పట్టిన పాత్రలో వండిన పదార్థం విషప్రాయమవుతుంది. అలాగే చిత్తశుద్ది లేని ఏ ఆచారమైనా సమాజానికి నష్టదాయకంగా మారుతుంది.*
*చిత్త శుద్ది అంటే అరిషడ్వార్గాలకు తావులేని నిర్మలమైన, కల్మష రహితమైన మనసు.*
*ఎవరి మనసులో, కామ, క్రోధ, మోహ, మద, మత్సారాలు మున్నగు దుర్గుణాలకు చోటు ఉండదో వారే చిత్త శుద్ది కలవారు. ఈ అరిషడ్వార్గాలు ఆరు లోపల శత్రువులు.*
*బయట శత్రువులను జయించానని మనిషి సంతసిస్తుంటాడు. లోపలి శత్రువులను గురించి పట్టించుకోడు. అతడు జయిస్తే ఎక్కడా శతృవులు ఉండరు.*
*సత్యం, దయ, ప్రేమ,శాంతి, కరుణ వంటి మానవీయ గుణాలను పెంపొందించిన వారికి చిత్తశాంతి పుష్కలంగా లభిస్తుంది.*
*ఈ మానవీయ గుణాలే దైవ గుణాలు అంటారు.*
No comments:
Post a Comment