Tuesday, May 14, 2024

షిరిడీ సాయిబాబా అందగాడా ?*

 *షిరిడీ సాయిబాబా అందగాడా ?*


*ఆయన ఒక బుక్కా ఫకీరు. చిరిగిన కఫనీ, పెరిగిన గడ్డం, తలకు చుట్టుకున్న గుడ్డ, చేతిలో భిక్షా పాత్ర, ఎప్పుడూ ఏదో లోకాలను చూస్తున్నట్లు చూపు.*

*అయితే ఆయన అందగాడు కాదనీ చెప్పగలరా ? బిడ్డకు తన తల్లి ఎంత వికారిగా ఉన్నా, పాపకు మోహనంగా కనిపిస్తుంది.*

*సాయినాధుడు కూడా అంతే.*


*బాబా అందాన్ని చూసి కళ్లు తిప్పుకోలేనివారు ఉన్నారు.*


*"పుంసా మోహన రూపాయ "  అని శ్రీరాముని గూర్చి చెప్పినట్లే ఉంటుంది బాబా గురించి చెబుతుంటే.*


*నిశ్చలంగా, గంభీరంగా ఉండే బాబా చూపు, మధుర మందహాసం,  మనలోని ఏదో అందుకొనటానికి వీలుకానిది అందినట్లే ఉంటుంది. ఆయన కన్నులు కారుణ్యాన్ని వర్షిస్తుంటాయి.*

*పాదాలు, పట్టుకో, అవతలి ఒడ్డుకి చేరుస్తానంటాయి.*


*ఆయన మందహాసం, నీవు ఒక్క అడుగువేయలేవా ? నేను పది అడుగులు వేయాలా ? అంటాయి.*


*ఓ జీవా ! ఇంకా మాయలోనే ఉన్నావా ?మాయను వదలి బయటకి రా !*


*షిరిడీలో బాబా మోహన రూపాన్ని దర్శించినవారు ఎందరో వున్నారు.*


*కానీ ఆ రూపాన్ని, దర్శించిన తరువాత పొందిన అనుభవాన్ని, ఆ మధుర అనుభూతిని, మనకు అందించినవారు బహు కొద్దిమంది.*

*దాదాసాబ్ ఖాపర్డే షిరిడీలో వుండగా, ఆయన అనుభవాన్ని తెలుపుతూ  "సాయిబాబా ఒకప్పుడు నాకు తన మోమును మృదు మధుర మందహాసాలు ఒలికిస్తూ చూపారు.*

*అలాంటి మందహాసం ఒక్కసారైనా సరే చూడటానికి ఇక్కడ ఈ షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా పడి ఉండవచ్చు.*

*నేను ఆ దృశ్యాన్ని చూస్తూ పారవశ్యంతో అలా ఉండిపోయాను " అని తన డైరీలో జనవరి 17 వ తారీకు 1912 సంవత్సరంలో వ్రాసుకొన్నాడు.*

*కాకాజీ వైద్య అనే సప్తశృంగి దేవాలయ పూజారిని సప్తశృంగి దేవత షిరిడీలో గల సాయిబాబాను దర్శించమని చెబితే, ఆయన సాయిబాబాను దర్శనం చేసుకున్న తరువాత అతని చిత్తచాంచల్యం తొలగిపోయింది.*

*అది సాయిబాబా దర్శన ఫలం అని తెలుసుకున్నాడు సాయిబాబాయే స్వయంగా ఇలా తెలిపాడు* 

*"అత్యంత ఆనందకరమైన నా నిరాకార స్వరుపాన్ని తెలుసుకుని, దానిని నిత్యం ధ్యానించాలి, లేదా నా సగుణ రూపాన్ని గుర్తు తెచ్చుకొని, నఖశిఖ పర్యంతం నన్ను రాత్రీ పగలూ మనసులో పెట్టుకోవాలి.*


*చివరగా, సాయినాథుని మృదుమధుర మందహాస వదనాన్ని చూస్తుంటే, తనువెల్లా బ్రహ్మానందంతో పరవశిస్తుంది.*


      *సేకరణ - సాయి @366 గ్రంథమునుండి.*

No comments:

Post a Comment