*నాసిక్ పట్టణ నివాసి అయిన గొపాల్ హోరా అనే కృష్ణ భక్తుడు ఏ విధముగా నైనా సరే, ఈ జన్మలోనే శ్రీ కృష్ణ దర్శనం పొందాలనే తపనతో, తన గురువు వద్ద మంత్రోపదేశం పొందాడు.*
*భక్తి శ్రద్దలతో 26 ఏళ్లు సాధన చేశాడు. కృష్ణ దర్శనం లభించలేదు. ఎక్కడికి వెళ్లినా భగవద్గీతను వెంట తీసుకుని పోయేవాడు.*
*షిరిడీలో ఎవరో ఒక బ్రాహ్మణుడు ఫకీరుగా ఉన్నాడని తెలిసి, భగవద్గీతను వెంట తీసుకుని బాబా దర్శనం కోసం వెళ్లాడు.* *సాయబాబాను చూసి ఆగిపోయాడు. సాయి మహమ్మదీయుడా?*
*బాబా వద్దకు భగవద్గీతను తీసుకుపోతే, ఆ గ్రంథం*
*అపవిత్రమవుతుందేమోని* *అనుమానపడ్డాడు.*
*బాబా అతనితో " నీవు మైలు పడవచ్చును గానీ, గీతా గ్రంథం మాత్రం అపవిత్రం కాదు. నీవు తలచినది పొరపాటు " అని అన్నారు.*
*ఇంకా బాబా "నీవు భగవద్గీతను పఠించగలవా ?"*
*అని ప్రశ్నించారు అతన్ని.*
*" నేను 26 సంవత్సరాలనుండి పఠిస్తున్నాను. అది*
*కంఠస్థమైనది కూడా ." అని హోరా చెప్పాడు.*
*బాబా భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని మధ్య నుండి చదవమంటే, అతడు చదవలేకపోయాడు.*
*" విచారించకు ! నీకు చదవగలిగే శక్తిని యిస్తాను.*
*చదువు " అని అన్నాడు బాబా ." నీవు బాలకృష్ణుని దర్శనమే* *కావాలనుకొంటున్నావు, నీకు పెద్ద కృష్ణుని దర్శనమే* *లభిస్తుంది .చూడు ." అన్నారుబాబా.* *అనుకోకుండా ఆశ్చర్యంగా, సాయిబాబా నుండి* *మృదుమధుర వేణుగానం*
*వినబడినది. సాయినాధునికి బదులు సాక్షాత్ శ్రీకృష్ణుడే దర్శనమిచ్చాడు.*
*గోపాల్ హోరా తన్మయుడై సాయి పాదాలపై వాలిపోయాడు*
*" నేను మీవద్దనే ఉండిపోతాను " అన్నాడు హోరా*
*" ఇంటికి వెళ్లి తామరాకుపై నీటిబొట్టులా ఉండి శ్రీ కృష్ణ ధ్యానంలో నిమగ్నడవు కమ్ము " అని బాబాఅశీర్వదించి
No comments:
Post a Comment