*సాయిబాబా ను సేవించిన అనన్య భక్తులలో మేఘశ్యాముడు అనే గుజరాతీ బ్రాహ్మణుడు ఒకడు.*
*పరమ శివ భక్తుడు. నిరంతరమూ పంచాక్షరీ మంత్రమును జపిస్తూండేవాడు.*
*ఈ భక్తుని గూర్చి మనము సాయిబాబా సచ్చరిత్ర 28 మరియు 31 వ అధ్యాయములలో చూడవచ్చును.*
*బాబాకు మరొక భక్తుడైన హరి వినాయక సాఠే అనే ప్రభుత్వ ఉద్యోగి వద్ద వంట బ్రాహ్మణుడుగా ఉండేవాడు.*
*సాఠే అతనికి గల శివ భక్తిని గమనించి, షిర్డీలో గల సాయిబాబాకి పరమశివునకు ఎలాంటి భేదము లేదని బోధించి స్వయముగా బాబాను సేవించమని సాఠే మేఘ శ్యాముని షిర్డీకి పంపాడు. కాని మధ్యలో అనేక సంశయాలను తీర్చుకొని చివరకి షిర్డి చేరి, మనసా, వాచా, కర్మణా బాబా సేవలో తరించి పోయాడు.*
*అతడు షిర్డిలో గల దేవుళ్లను నిత్యము పూజలు చేసేవాడు.*
*సాయిబాబాను పరమశివునిగా భావించి, ఎంతో దూరము నడచి వెళ్ళి బిల్వ పత్రాలను సేకరించి, సాయిని పూజించేవాడు.*
*ఒక మకర సంక్రాతి నాడు బాబాకు గోదావరి జలాలతో స్నానము చేయించినప్పుడు జరిగిన లీలను చూసి పరవసించి పోయాడు.*
*బాబా తన లీలల ద్వారా అనేక విధాల అనుగ్రహించారు.*
*బాబాను నిష్కామంగా, సేవించిన ఈ అంకిత భక్తుడు చివరగా*
*19 -1 -1912 సం. నాడు తన ఇష్ట దైవమైన సాయినాధునిలో ఐక్యమైపోయాడు.*
*బాబా మేఘా శ్యాముని కళేబరము వెంట గ్రామస్తులతో పాటు వెళ్లి కంట నీరు పెట్టిరి. తరువాత జరిపే కర్మలు బాబా తన స్వంత ఖర్చుతో నిర్వహించెను.*
*తన ఆత్మను సాయి పరమాత్మలో ఐక్యం చేసిన మేఘశ్యాముడు ధన్యుడు.*
*నేటికి మేఘశ్యాముడు తనువు చాలించి 112 సంవత్సరాలు.*
No comments:
Post a Comment