*సృష్టికర్త పలు జీవులను సృష్టించి, వాటికి ఆయువు పోసి, భూమిపైకి పంపుతున్నాడు.*
*అప్పుడు మనిషితో పాటు , ఎద్దు, కుక్క, గుడ్లగూబ మిగిలిపోయి ఉన్నాయి.'*
*మనిషీ !నీకు పాతికేళ్ళు ఆయుర్ధాయము ఇస్తున్నా అంటాడు సృష్టికర్త .' దేవా అంత తక్కువైతే ఎలా అని విలపిస్తాడు.*
*ఆ పక్కనే ఉన్న ఎద్దు ' భగవాన్ నేను చేయవలిసిన పనులేమిటి ? అని ప్రశ్నిస్తుంది*
*' నువ్వు పొలం దున్నాలి. బండి లాగాలి, బరువు మోయాలి. గడ్డి తినాలి. కుడితి నీళ్లు తాగాలి 'అని సృష్టికర్త బదులిస్తాడు .' స్వామీ ! నా ఆయువులో పాతికేళ్లు తగ్గించి ఆ మనిషికి ఇవ్వండి.*
*సృష్టికర్త పాతికేళ్లు ఆయువు ఎక్కువిచ్చినా మనిషికి తృప్తి కలుగలేదు ' స్వామీ*
*నేను ఏమేమి పనులు చేయాలి ? అని అడిగింది కుక్క. నీవు చివరిదాకా కాపలా కాయడమే నీపని అని సృష్టికర్త జవాబిస్తాడు .' అయితే నా అయువులో పాతికేళ్లు మనిషికి ఇవ్వండి ' అని కుక్క కోరుతుంది.*
*అప్పటికీ మనిషికి తృప్తి కలగలేదు. గుడ్లగూబ సృష్టికర్తా ! నా సంగతేమిటి అని అడుగుతుంది .' నువ్వు రాత్రంతా మేలుకోవాలి.*
*చెట్టుతొఱ్ఱలలో శిథిల భవనాలలో అరుస్తుండాలి ' అని అంటాడాయన .' నా ఆయువు నుంచి పాతికేళ్లు ఆ మనిషికే ఇచ్చేయండి ' అంటుంది గుడ్లగూబ.*
*ఆలా మొత్తానికి మనిషికి వంద ఏళ్లు ఆయువు లభించిందట. ఏమి లాభం ?*
* *పాతికేళ్లు నానా గడ్డి తింటూ ఎద్దులా కష్టపడి, సంపాదించాల్సి వస్తుంది ఆ సొమ్మును కాపలా కాస్తూ, కుక్కలా మరొ పాతికేళ్లు గడపాల్సిన స్థితి కలుగుతుంది.*
*ఇంతలో వృద్దాప్యం తరుముకొని వచ్చేస్తుంది. రాత్రిళ్ళు నిద్ర లేకుండా అతడు గుడ్లగూబలా శేష జీవితం గడపాల్సి ఉంటుంది.*
*ఆయుర్దాయాన్ని స్వార్ధం కోసం కాకుండా, పరోపకారం కోసం వీలైనంతగా వినియోగించినవాడే పుణ్యాత్ముడు. అతడే అసలైన మనిషి.*
*ప్రాణికోటిలో మనిషి ఎంతో భిన్నమైనవాడు.*
*మాట్లాడటం, ఆలోచించడం వంటి అనేక ప్రత్యేకతలు గలవాడు.*
*శారీరకంగా అతడు ఇతర ప్రాణులకంటే బలహీనుడైనా తెలివితేటలు ఉండటం వల్ల అధికుడయ్యాడు .స్థూలంగా చూస్తే మానవ జాతి అంతా ఒకటిగానే కనిపిస్తుంది.*
*లోతుగా పరీశీలిస్తే పలు తరహాల మనుషులు* *గోచరిస్తారు. వారిలో మహాత్ములు, దురాత్ములూ వుంటారు.*
*ఇతరుల కష్టాలు చూసి దుఃఖించేవాడే మహత్ముడు.*
*అందుకే స్వామీ వివేకానంద " దేశములో కుక్క వంటి చిన్న ప్రాణి సైతము ఆకలితో బాధపడకూడదు.*
*అలాంటి పరిస్థితిలో నేను మళ్ళి మళ్ళి ఇదే గడ్డమీద వెయ్యిసార్లైనా జన్మించి ఆకలి దప్పులు లేని సమాజ స్థాపనకు ప్రయత్నిస్తేనేగానీ, స్వీయ ముక్తిని కోరను " అని అనేవారు. మనిషి ఆయుర్దాయం వందేళ్లు అంటారు. కానీ అలాంటివారు కొద్దిమందే కనిపిస్తుంటారు.*
*పుణ్యాత్ములు ఈ లోకమంతా సుఖముగా ఉండాలని పరమాత్మను ప్రార్దిస్తారే తప్ప కేవలం తమ ఆయుర్దాయాన్ని కోరుకోరు.*
No comments:
Post a Comment