*ముంబై -పూణే లకు మధ్య ఉన్న రైలు మార్గంలో కనిపించే ఒక చిన్న గ్రామము భివపురి.*
*1916 సం లో ఇక్కడ నిర్మించిన సాయబాబా మందిరమే ప్రపంచములో మొదటి సాయిమందిరం.*
*ఈ మందిరం లోని బాబా విగ్రహము సాక్షాత్తూ బాబా గారు అందించటం ఒక విశేషము.*
*ఈ మందిరాన్ని నిర్మించిన శ్రీ కేశవ రామచంద్ర ప్రధాన్ ఒక నాస్తికుడు కావడం మరొక విశేషము.*
*భివపురి కి చెందిన రామచంద్రప్రధాన్ ముంబైలో, పారశీ మతానికి చెందిన ఒక ఫైనాన్స్ వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేసేవాడు. తన యజమాని ఇచ్చిన రుణాలు వసూలు చేసి యాజమానికి అందచేయడమే ప్రధాన్ పని.*
*ఆలా బాకీలు వసూళ్లు నిమిత్తం ప్రధాన్, మన్మాడు, నాసిక్ మున్నగు ప్రాంతాలలో తిరుగుతుండెడివాడు.*
*రామచంద్ర ప్రధాన్ కు ఒక మిత్రుడుండేవాడు.*
*అతనికి షిర్డి సాయిబాబా మీద అపారమైన భక్తీ,విశ్వాసాలుండేవి. అతడు షిర్డి బాబా దర్శనానికి వెళ్ళేటప్పుడల్లా, ప్రధాన్ ను తనతో కలసి షిరిడీకి రమ్మని ప్రాధేయపడేవాడు.*
*కానీ చిన్నతనము నుంచి దేవుళ్ళమీద, మహాత్యాల మీద, నమ్మకం లేని ప్రధాన్, తన స్నేహితుని మాటలను లెక్క చేసేవాడు కాదు.*
*అయితే చివరికి ఒకసారి షిరిడీకి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు ప్రధాన్. అతని స్నేహితునితో ఒక షరతు పెట్టాడు.*
*అదేమిటంటె " తాను షిరిడీకి వస్తాను గానీ బాబా దర్శనానికి రానని, తన విడిది గదిలోనే ఉండిపోతానని, బాబా మశీదులో అడుగుపెట్టనని " షరతు పెట్టాడు.*
*ప్రధాన్ స్నేహితుడు, ప్రధాన్ ను, ధర్మశాల విడిదిలోనే ఉంచి బాబాను దర్శించుకునేందుకు వెళ్లిపోయాడు.*
*కొద్ది సమయం తరువాత బాబాకు మధ్యాన్న హారతి మొదలైంది. మధురమైన హారతి పాటలు, లయబద్దమైన సంగీతం మసీదునుండి వినిపిస్తుంది. ఆ హారతి పాటలు విన్న ప్రధాన్ కు కాలునిలవలేదు. తనకు తెలియకుండానే నడచుకొంటూ, మసీదులోనికి అడుగుపెట్టాడు.*
*అతను మశీదులో అడుగుపెట్టి, అక్కడ బాబాను చూసి మైమరచిపోయారు.*
*అదే పారవశ్యంతో బాబా వద్దకి వెళ్లి నిలుచున్నాడు.*
*ప్రధాన్ ను చూసిన బాబా, తన అలవాటు ప్రకారం దక్షిణను అడిగాడు.*
*అప్పటికీ అతను మైకంలోనే ఉన్నాడు.*
*తన యజమాని కొరకు వసూలు చేసిన తన వద్దనున్న 2500 -00 మారుమాట్లాకుండా బాబాకు దక్షిణగా ఇచ్చేశాడు*
*అతనికి బాబా మహిమ తెలిసింది.*
*ప్రధాన్ కు తన విడిదిచేసిన సత్రానికి వచ్చిన తరువాత కానీ జరిగినదేమిటో మనసుకు తోచలేదు.*
*కానీ, ఇప్పుడేమి చేసేది ? తన యజమాని కి ఏమి చెప్పేది ?*
*అసలు యజమాని దగ్గరకి వెళ్లడానికి కూడా అతని దగ్గర డబ్బు లేదాయె ?* *ఇలా పరిపరి విధాలా అలోచిస్తూ ప్రధాన్ తన ఉరికి చేరుకున్నాడు.*
*తన వంట్లో బాగాలేదని, అరోగ్యం కుదుటపడగానే వచ్చి, కలుస్తానని యజమానికి కబురు పంపాడు.*
*కానీ యజమానినుంచి ఒక చిత్రమైన జవాబు తిరిగివచ్చింది.*
*" కావలిసినంత విశ్రాంతి తీసుకుని, అరోగ్యం కుదుటబడ్డాకేరమ్మని.*
*ఎందుకంటే యే ఋణాలు వసూలు చేసేందుకు ప్రధాన్ తిరుగుచున్నాడో, దానికి రెట్టింపు వసూలు అయిందని " ఆ జవాబులోని సారాంశం.*
*ఈ జవాబు విన్న ప్రధాన్ కు మతిపోయినట్టు అయినది.*
*ఈ సంఘటన జరిగిన దగ్గరునుంచి ప్రధాన్ తరుచూ షిర్డి బాబా యందు భక్తి కలిగి షిర్డి వెళ్ళుతుండేవాడు.*
*అంతేకాదు తనతో ఒకసారి తన ఊరు భివపురి కి రమ్మని బాబాను చాలాసార్లు కోరాడు.*
*అలా కోరగా కోరగా బాబా విసిగిపోయి, తన విగ్రహాన్నీ ప్రధాన్ చేతిలో పెట్టి, " నీ ఊరికి వెళ్ళి ఒక మందిరాన్ని నిర్మించు.*
*అందులో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించు. ఇక నీవు షిరిడీకి రానవసరం లేదు, అని తేల్చి చెప్పారు.*
*ప్రధాన్ బాబా అజ్ఞానుసారం భివపురిలో ఒక మందిరాన్ని నిర్మించి 1916 సం .లో బాబా స్వహస్తాలతో అందించిన బాబా విగ్రహాన్ని ప్రతిష్టించాడు.*
*బాబా వాగ్దానము చేసినట్లుగానే ఆయన ఉనికిని తరచూఅక్కడ భక్తులకు అనుభవమయ్యేది.*
*మందిరానికి ఎదురుగా ఉన్న చెట్టు నీడన బాబా విశ్రమించడం కనిపించేది.*
*తెల్లవారి ఝామున మూడు గంటలకు ఆలయము తలపులు తెరుచుకున్న చప్పుడు వినబడేది.*
*సాయిభక్తులు ఒక్కసారయినా దర్శించవలిసిన బాబా మందిరం.*
No comments:
Post a Comment