Tuesday, May 14, 2024

ఎవరైతే ఈ దేహాన్నే సాయిబాబా అనుకుంటారో వారు సాయిబాబానసలు చూడనట్లే"

 1918 కి ముందు కూడా బాబా తమ దేహానికి పరిమితమై లేరు. ఎందుకంటే బాబానే స్వయంగా, *"నా ముర్షద్ (గురువు) నన్ను ఏనాడో ఈ దేహం నుండి విడుదల చేశారు. ఎవరైతే ఈ దేహాన్నే సాయిబాబా అనుకుంటారో వారు సాయిబాబానసలు చూడనట్లే"* అని చెప్పారు. తమ దేహం నుండి ఆయన అప్పటికే విడుదలయ్యారు కనుక నిజానికి ఆయన దేహమే ఒక సమాధి; కొద్దిమందితో వ్యవహరించగల పరిమితమైన కదలాడే ఒక చిన్న  సమాధి, ఆయన ప్రేమస్వరూపులు, పెరుగుతున్న భక్తుల అవసరాలు తీర్చాలనుకున్న వారు కనుక, భక్తులకు కూడా ఆయనతో వ్యవహరించడానికి ఒక ఆలంబన కావాలి కనుక తరువాత ఆయన మారవలసివచ్చింది. అందుకని ఆయన తమ 'సమాధి'ని మార్చుకున్నారు. ఆ సమాధి (ఆయన భౌతిక శరీరం) నుంచి తమ దేహం యొక్క ఆకారం యొక్క పరిధిని పెంచి ప్రస్తుతం ఉన్న సమాధికి మారారు. అందుకనే ఆయన, *"నా సమాధి మాట్లాడుతుంది, నా సమాధి కదులుతుంది, నా సమాధి సమాధానం చెబుతుంది"* అన్నారు. ఆయన భౌతికదేహం అంతకుముందు సమాధానమిస్తూ ఉండిన రీతిలోనే!


శ్రీ బాబూజీ. 


Source  : శరశ్చంద్రికలు.

No comments:

Post a Comment