శ్రీ సాయినాధ అష్టోత్తర శత నామావళి.*
*51 వ నామం ."ఓం శ్రీ కర్మ ధ్వంసినే నమః ."*
*మనసులో ప్రేమను నింపుకొని మాత్రము ఏమి ప్రయోజనము ? దానిని అనుభవించి, ఆస్వాదించు యోగ్యత కర్మబద్దులకు లేదు కదా ? అను ఒక ప్రశ్న ఉద్భవించును.*
*అంతేకాదు " ఆవస్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభా శుభం " అను శ్లోకం అంగీకరించవలిసినదే.*
*కానీ భగవంతునికి అసాధ్యం లేదు ."కర్తు మకర్తు మన్యథా కర్తుము "*
*ఆయన సమర్ధుడు.* *జరుగ వలిసినదానిని జరిగించును.* *ఒక్కొక్కప్పుడు జరుగనీయడు. ఒక్కొక్కప్పుడు మరొక విధముగా జరుగునట్లు చేయును.*
*అటువంటి సన్నివేశం బాబా సచ్చరిత్రలో కనిపిస్తుంది.*
*డాక్టర్ పిళ్లే అను నతడు బాబాకు ప్రియ భక్తుడు.* *అతడు నారి కురుపు అనే వ్యాధితో బాధపడుతూ షిర్డీ వచ్చాడు.*
*" బాధ చాలా హెచ్చుగా ఉన్నది. భరింప లేకున్నాను.*
*దీనికంటే చావు మేలని తోచుచున్నది.*
*గత జన్మలో చేసిన పాపములను పోగొట్టుటకై దీనిని అనుభవించవలసిన యెడల, దీనిని పది జన్మలలోకి సరిదిద్దిన ఎడల అనుభవించెదను.*
*ఈ బాధ దుర్భరంగా ఉన్నది " అని చెప్పుకొనగా కాకాసాబ్ దీక్షిత్ బాబాకు సర్వము నివేదించెను.*
*" అతడేల పది జన్మలెత్తవలెను ? అంత దీర్ఘకాలం పది జన్మల పాటు బాధపడవలెనా ? పది రోజులలో గత జన్మల పాపములను హరించివేయగలను.*
*నేను ఇక్కడ ఉండి ఇహపర సుఖములు ఇచ్చుటకు సిద్ధంగా ఉండగా, అతడేల చావవలెను ?"అని చెప్పి, అతనిని వీపుపై ఎక్కించుకొని తీసుకు రండి అని ఆదేశించెను.*
*వారట్లే పిళ్లేను మోసికొనివచ్చి ద్వారకామాయిలో కూర్చుండబెట్టిరి.*
*బాబా అతనికి ధైర్యము చెప్పి, వివేక వచనములు బోధించెను. ఒక కాకి వచ్చునని, అది వచ్చి వెళ్లిన వెంటనే అతని బాధ ఉపశమించునని చెప్పెను.*
*మసీదును శుభ్రం చేసి దీపములు వెలిగించు అబ్దుల్ వచ్చి పొరపాటున పిళ్లే కురుపుపై కాలు వేసెను.*
*డాక్టరు పిళ్లే కాలునుండి ఏడు పురుగులు బయటకు వచ్చెను. కొంతసేపు భరించలేని బాధను అనుభవించవలిసి వచ్చెను.*
*" కాకి ఎప్పుడు వచ్చును ? " అని బాబాను ప్రశ్నించగా " అబ్దుల్ యే నేను చెప్పిన కాకి.*
*ఇక నీకు పది రోజులలో నీ బాధ శాశ్వతముగా నయమగును.*
*సుఖముగా ఉండుము " అని బాబా బదులు చెప్పెను.*
*సాధారణముగా ప్రారబ్ధ కర్మను అనుభవించవలిసినదే అని పెద్దలు చెప్పెదరు.*
*కానీ డాక్టరు పిళ్లే దృష్టాంతం అది ఖండించు చున్నది.*
*బాబా ఎందరో కర్మఫలములను ధ్వంసం చేసినట్లు, తాను తీసుకొని అవలీలగా అనుభవించినట్లు తెలిసికొనవచ్చును.*
No comments:
Post a Comment