గురునానక జయంతి
*సిక్కు ధర్మ స్థాపకుడైన గురు నానక్ ఒకప్పుడు తన శిష్యులతో కలసి లాహోర్ నగర వీధులలో నడుస్తూ వెళుతుండగా ఒక అందమైన భవనం ఆయన దృష్టిని అకర్షించింది.*
*ఆ భవనం ముందు వైపు ఏడు పాముపడగలు చెక్కబడి వున్నాయి.*
*పాముపడగలు చెక్కతో స్పష్టంగా చెక్కబడి వున్నాయి.*
*నానక్ గురువుకి ఆ ఇంటిముందు పాముపడగలు చెక్కడం వింతగా తోచినది.*
*అక్కడవారు ఆయనతో " గురుదేవా ! ఆ ఇంటి యజమాని కోట్లకు పడగలెత్తాడు.*
*తాను ఏడు కోట్లకు అధిపతినని చాటుకోడానికి ఆలా ఏడు పడగలు తన భవనం ముందు అందంగా ఏర్పాటుచేసుకొన్నాడు " అని చెప్పారు.*
*ఎందుకో నానక్ గారికి ఆ భవన యజమానిని చూడాలని అనిపించింది.*
*అక్కడకి వెళ్లగానే ఆ భవన యజమాని సాదరంగా ఆహ్వానించి, తన ఇంట్లొ భిక్ష స్వీకరించమని ప్రార్దించాడు.*
*నానక్ అందుకు అంగీకరించి తన కోరికను తీరిస్తే భిక్ష స్వీకరించటానికి సిద్ధమని జవాబిచ్చారు.*
*ఆ భవన యాజమానితో తాను వృద్ధుడైపోయానని కొంతకాలమే తాను జీవిస్తానని, చిన్నవయసులో ఉన్న భవన యజమానితో చెప్పారు.*
*అప్పుడు తన సంచిలో గల ఒక సూదిని భవన యజమానికి ఇచ్చి*
*" నేను రేపో మాపో ఈ లోకాన్ని విడిచిపోతాను.*
*నీవు చాలా చిన్నవయసులొ ఉన్నావు. నీవు ఆ పైలోకానికి రావడానికి చాలాకాలము పడుతుంది.*
*అందుచేత నాకోసం నీవు ఈలోకం విడచివచ్చేటప్పుడు ఈ సూదిని భద్రంగా పట్టుకొనిరావాలి.*
*అదే నా కోరిక.*
*దీనికి నీవు ఆంగీకరిస్తే నీవిచ్చే భిక్షను స్వీకరిస్తాను " అని చెప్పారు.*
*అది విన్న ఆ భవన యజమాని ఆశ్చర్యపోయాడు.*
*అతడు నానక్ గారితో "అదేమిటీ స్వామీ ! సూదిని స్వర్గానికి తీసుకురావడమేమిటి ?* *గతంలో ఎవరైనా ఏదైనా తీసుకుని పోగలిగారా ? ఇది ఎలా సంభవం స్వామీ ! " అని* *అనగానే, అందుకు నానక్ " అలాగా నాయనా ! ఇంత చిన్న సూదిని తీసుకుని పైలోకానికి తీసుకుని రాలేనివాడివి, నీకున్న ఏడుకోట్ల సంపదను ఎలా తీసుకుని పొగలవు ? అని ప్రశ్నించాడు.*
*దానికి ఆ యజమాని " ఏమీ తీసుకుపోలేము స్వామి " అని తలవంచుకుని సమధానమిచ్చాడు.*
*అందుకు నానక్ " నీవు వద్దనుకున్నా నీవు చేసిన పాపపుణ్యాలు నీ వెంట వస్తాయి.*
*కనుక నీ సంపదలో కొంత దాన ధర్మాలు చెయ్యి. నీతిగా బ్రతుకు.*
*ఇతరులకు తోచినంత సహాయము చేసి భగవంతుడు ప్రసాదించిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకో " అని బోధన చేశారు.*
*కొన్నాళ్లకు ఆ ధనవంతుడు తన ఆస్తిని కొంతభాగము పేదలకు దానం చేసి, నానక్ గారి శిష్యులలో ఒకటైనాడు.*
No comments:
Post a Comment