*సాయిబాబా షిరిడీలో సజీవముగా ఉన్నప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, గోవా మున్నగు ప్రదేశాలలో అనేకమంది భక్తులుండేవారు.* *అందులో బొంబాయి నగరంలో రామకృష్ణ కొఠారీ అని పేరుగల వ్యక్తి మాతృమూర్తి ఒకరు.*
*ఒకసారి రామకృష్ణ కొఠారి తండ్రికి న్యుమోనియా జ్వరం వచ్చి పరిస్ధితి విషమించింది. డాక్టర్లు కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాడని చెప్పారు.*
*కొఠారి తల్లికి షిర్డి సాయినాధుడు తప్ప వేరే దైవం లేడు. బాబాను ఆర్తితో ప్రార్ధించింది. షిరిడీకి పాదయాత్ర చేస్తానని మొక్కుకొంది.*
*సాయిబాబా కరుణించినందున కొఠారీ తండ్రి ప్రాణాలు దక్కాయి.*
*మొక్కుకున్నందున కొఠారి తండ్రి, తల్లి, మరికొందరితో బొంబాయి నుండి పాదయాత్ర చేస్తూ, షిరిడీకి దగ్గరలోగల కోపెరగాన్ పట్టణానికి చేరుకున్నారు.*
*అక్కడనుంచి మొక్కుకున్న కొఠారి తల్లి తప్ప మిగతావారందరూ ఎద్దులబండ్లలో షిరిడీకి వెళ్లిపోయారు. కోపెరగాన్ నుండి ఆమె షిరిడీకి నడక మొదలెట్టింది.*
*అక్కడనుంచి అమెకు కాళ్ళు వాచిపోయి నెప్పు పెట్టినందున, దారిలోగల ఒక చెట్టుక్రింద విశ్రమించినప్పుడు, బాగా గెడ్డం పెంచుకొని ఉన్న , పశువుల కాపరిగా కనిపిస్తున్న ఒక వ్యక్తి ఆమెవద్దకు వచ్చి " అమ్మా ! సాయిబాబా నీ మొక్కును స్వీకరించారు. ఇక నీవు బండిలో షిరిడీకి వెళ్ళు" అని చెప్పాడు.*
*అయినా ఆమె అందుకు అంగీకరించకుండా, నడక సాగించింది.*
*షిరిడీలో అది మధ్యాన్న ఆరతి సమయము. బాబా ద్వారకామాయిలో ఆసీనుడైయున్నాడు.*
*బాబాకు నిత్యమూ ఆరతి యిచ్చే బాపూసాబ్ జోగ్ బాబాకు హారతి ఇవ్వడానికి సిద్ధపడుతుండగా బాబా జోగ్ ను కొంచంసేపు ఆగమన్నారు.*
*కొంతసేపటికి రామకృష్ణ కొఠారి తల్లి కాలినడకను ద్వారకామాయిని చేరుకొంది. సాయిబాబాను మనసారా దర్శించుకొన్నది.*
*బాబా ఆక్కడివారితో*
*" ఈ తల్లి ని దారిలో కలిసాను. నడక చాలునని చెప్పినా వినిపించుకోకుండా పాదయాత్ర చేసింది " అన్నారు.*
No comments:
Post a Comment